ప్రముఖ సినీ రంగస్థల నటుడు దర్శకుడు, జర్నలిస్ట్, కాలమిస్ట్, రచయిత శ్రీ రావి కొండలరావు గుండెపోటుతో కన్నుమూసారు. ఆనారోగ్యం దృష్ట్యా బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచిచారు. 1932, ఫిబ్రవరి 11 న సామర్లకోట లో జన్మించిన రావి కొండలరావు, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు.
రావికొండలరావు ప్రస్థానం "మిస్ ప్రేమ" అనే నాటకం ద్వారా శ్రీకాకుళం నుంచి మొదలైంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, జర్నలిస్టుగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. కాగా, 1958లో శోభ చిత్రంలో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తమిళ, మలయాళ సినిమాలకు కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. మద్రాసు ఆనందవాణి పత్రిక సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ‘తేనె మనసులు’, ‘దసరా బుల్లోడు’, ‘రంగూన్ రౌడీ’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘భైరవ ద్వీపం’ ‘రాధాగోపాలం’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘కింగ్’, ‘ఓయ్’, ‘వరుడు’ తదితర చిత్రాల్లో రావికొండలరావు నటించారు.1996 మే లో రిలీజైన పౌరాణికచిత్రం "శ్రీకృష్ణార్జునవిజయం" . చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి వెంకట్రామిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా రావికొండలరావు కధ మాటలు అందించారు. తెలుగు సినీ పరిశ్రమపై వ్రాసిన #బ్లాక్అండ్వైట్ అనే పుస్తకానికి గాను #నందిఅవార్డ్ ను అందుకున్నారు. ప్రముఖ నటి రాధాకుమారి రావి కొండలరావు సతీమణి, 2012 లో ఆవిడ మృతి చెందారు. పెళ్ళిపుస్తకం సినిమాకు కథను అందించడమే కాక, అందులో గమ్మడి సహాయకుడిగా సంభాషణలు లేని హావ,భావ అభినయాలతో రావి కొండలరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవే...
చివరి శ్వాస వరకు రంగస్థల వికాసం కోసం విశేష కృషి చేశారు! చిరస్థాయిగా గుర్తుండిపోయే మంచి మనిషి రావి కొండలరావు.. గారికి నివాళి🙏🙏
ok
ReplyDelete