ఆదివారం డ్రైడే సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో కలయతిరిగారు..ఈ సందర్భంగా ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను ప్రత్యక్షంగా ఆయా నివాస కుటుంబీకులకు చూపి, ప్రతి ఆదివారం 'డ్రై' డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.
• ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి రాకుండా చూడాలని హరీష్ రావు సూచించారు.
• డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని మంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment