Wednesday, 22 July 2020

తిరుపతి..శ్రీనివాసం - విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలేక్టర్ భరత్ గుప్తా.. . అన్నిరకాల కోవిడ్ క్యూర్ మందులు 15 రోజులకు సరిపడా నిల్వ వుండాలని ఆదేశం...

 

తిరుపతి, జూలై 22: కోవిడ్ సెంటర్లలో మైల్డ్ కేసులను అడ్మిట్ చేసుకుంటున్నా చేరేముందు రక్త పరీక్షలు, అవసరాన్ని బట్టి ఎక్సరే  వుంటుందని, అందుకోసం కాల్ ఆన్ ల్యాబ్ లేదా ల్యాబ్ ఏర్పాటు, మొబైల్ ఎక్సరే మిషన్, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటు వుండాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా కోవిడ్ సెంటర్ ఇంచార్జులను ఆదేశించారు. 
బుధవారం సాయంత్రం తిరుపతి..శ్రీనివాసం  విష్టు నివాసం లలో కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలేక్టర్.. అక్కడి పెషంట్లకు అందజేస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు.అంతకముందు కలేక్టర్ ఈ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జెసి (డి) వీరబ్రంహమ్ , అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ లతో కలసి మెడికల్ ఏజెన్సీలతో, ఇఎస్ ఐ , ఐ ఏం ఏ డాక్టర్లతో సమావేశమైనారు. కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సెంటర్లలో వైద్య సదుపాయాలు అందుబాటులో వుండేలా వైద్య పరికరాలు వుండాలని ఎపిఎం ఐ డి సి, ఇ ఇ ని ఆదేశించారు. కోవిడ్ కేంద్రానికి వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్ వెళ్లదలచుకుంటే, హోమ్ క్యారంటైన్ కిట్ అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్లు వివరించాలని సూచించారు. 
అలాగే కోవిడ్ రోగులకు వాడే సి , జింక్, బి కాంప్లెక్స్ వంటివి కొరతలేకుండా 15 రోజులకు సరిపడా మందులు స్థానిక మెడికల్ ఏజెన్సీలు కోరిన ఇండెంట్ మేరకు సరఫార చేయాలని సూచించారు. ఇఎస్ ఐ లో అడ్మిషన్లు ప్రారంభించాలని, ఆయుర్వేద వైద్యశాలలో కోవిడ్ సేవలకు  డాక్టర్లకు విధులు కేటాయింపు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇఎస్ ఐ సూపర్నెంట్ బాల శంకర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాలాంజనేయులు , ఎపి ఎం ఐడిసి  దనంజయ రావు, చక్రపాణి, మెడికల్ ఏజెన్సీలు యుగంధర్ మెడికల్స్, వాసవి మెడికల్స్, సాయి శ్రీనివాస మెడికల్స్, గెలాక్సీ మెడికల్స్, బాలాజీ వాక్సిన్ హౌస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment