Thursday, 9 July 2020

రైతు బాంధవుడు రాజన్న - శైలజా చరణ్ రెడ్డి కాణిపాకంలో ఘనంగా వైయస్సార్ జయంతి & రైతు దినోత్సవ వేడుకలు

రైతుబందవుడు..జననేత.  మాజీ ముఖ్యమంత్రి,స్వర్గీయ  వై.యస్.రాజశేఖర రెడ్డి గారి 71 వ జయంతి  వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాణిపాకంలో వైయస్సార్ కు వైకాపా నాయకులు, అభిమానులు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి  నివాళులు అర్పించారు.  వేడుకలపై  వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజా చరణ్ రెడ్డి స్పందిస్తూ  రైతు దినోత్సవ వేడుకలలో, రైతులకు కులమతాలకతీతంగా ఘనంగా స్థానిక నాయకులు సన్మానం చేయటం  హర్షించదగ్గ విషయమని    ఆనందాన్ని వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో జగన్నాథరెడ్డి, చరణ్ రెడ్డి, చిన్నారెడ్డి, పుణ్య సముద్రం రవి , గిరి రెడ్డి, రాజ్ కుమార్ ,  కుమారి, యోగానంద, భాస్కరయ్య  ఇతర నాయకులు పాల్గొన్నారు.
శైలజా చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ  రాజశేఖర్ రెడ్డి గారు యుగపురుషుడు ,  రైతు బాంధవుడు,  మరణం లేని విధాత అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో సున్నా వడ్డీ పథకానికి గత ప్రభుత్వం గ్రహణం పట్టించింది. రైతులను మోసం చేసింది. దాదాపు 57 లక్షల మంది రైతులకు రూ.1,150 కోట్లు బకాయి పెట్టింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని మన ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే.. ఖరీఫ్, రబీ.. ఏ సీజన్‌కు ఆ సీజన్‌ పూర్తయ్యే నాటికి వారి వడ్డీ కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే  జమ చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు దద్దమ్మ అయితే వైయస్సార్ గారి కొడుకు చరిత్ర సృష్టించిన నాయకుడు  జగన్ అన్న అని ఆమె  ప్రశంసించారు.
 పుణ్య సముద్రం రవి మాట్లాడుతూ  తెలుగు జాతి మనుగడ ఉన్నంత కాలం రాజన్న చిరస్థాయిగా జగనన్న పథకాల్లో  బ్రతికే ఉంటారని,  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్సార్ అని,   రాబోయే రోజుల్లో రాష్ట్రం సస్యశ్యామలంగా  రైతు కళ్ళల్లో ఆనందం  జగనన్న సారథ్యంలో ఉండబోతుందని తెలిపారు.

No comments:

Post a Comment