చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు నటుడు సోనూసూద్ ఉదారంగా ట్రాక్టర్ అందించడం పట్ల వైకాపా మహిళా నేత శైలజారెడ్డి అభినంధనలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదంటూ పలువురు విమర్శలు చేయడం సరికాదన్నారు..
వైకాపా ప్రభుత్వం రైతాంగ. పేదలకు అందించే సంక్షేమ పధకాలన్నీ నాగేశ్వరరావు కుటుంబం కూడా అందుకుంటోందని ఆమె పేర్కొన్నారు..
రైతులు గొప్పవారు కావడం హర్షణీయం అని అమె పేర్కొన్నారు.
1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ.
3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.
5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది.
6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2250లు అందుకుంటున్నారు.
7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్‌కూడా తీసుకుంది.
8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు. ఇలా చెప్పడం ఇబ్బందికరంగా వున్నప్పటికీ విమర్శకుల కోసం తాను చెప్పాల్సిన పరిస్థితి వచ్ఛిందని శైలాజరెడ్డి పేర్కొన్నారు.మరో వైపు రైతు నాగేశ్వరరావు పై పలువురు సోషల్ మీడియాలో విమర్శలు ట్రోల్ చేస్తున్నారు.
సోనీ సూద్ సాయం చేసింది ఓ సాధారణ రైతుకి అనే రీతిలో కథనాలు రావడం సహేతుకంగా లేదని ఎదురు విమర్శలు వస్తున్నాయి.. కానీ సదరు రైతు వీరదల్లు నాగేశ్వర రావు ఇప్పటికే వివిధ సంస్థల్లో పనిచేశారని.
పైగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. వీరదల్లు నాగేశ్వర రావు గతంలో 2014 ఎన్నికల్లో లోక్ సత్తా తరుపున బరిలో దిగి వెయ్యి కి పైగా ఓట్లు కూడా సాధించారని
అంటే సమాజంలో అంతో ఇంతో గుర్తింపు ఉన్న వ్యక్తిగానే భావించవచ్చుకధా అలాంటి సమయంలో ఎందుకు ఈ ప్రయత్నం చేశారన్నది ఆశ్చర్యకరం అంటూ పలువురు పేర్కొన్నారు. ఊహించని రీతిలో ఇది సంచలనంగా మారిందని వారు చెబుతున్నారు.
అన్నింటికీ మించి వారు సమీప పట్టణంలో నివాసం ఉంటూ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఉపశమనం కోసం ఊరికి వచ్చినట్టు చెబుతున్నారు. ఏటా వ్యవసాయం చేసే కుటుంబం కాదని కూడా అంటున్నారు. తాత్కాలికంగా గ్రామానికి వచ్చిన వారిని రైతుగా చిత్రీకరించి ప్రచారం చేయడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు
No comments:
Post a Comment