మీడియా ద్వారా జర్నలిస్టీలు కరోనా విపత్తులో ప్రజలను చైతన్యం చేస్తోందంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. ఆందోళన చెందవద్దని ప్రజలకు ధైర్యం చెప్పారు.సూచన
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు వెంకయ్య నివాళి అర్పించారు.
దేశంలో తాజా పరిస్థితులపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో మీడియా నిర్వహిస్తున్న పాత్ర అమోఘం అని కొనియాడారు.మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాలదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారం చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇటీవల అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
No comments:
Post a Comment