ఆధ్యాత్మిక యాత్రకు వచ్చి, కరోనా కారణంగా దక్షిణాదిలో ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈమె ఇబ్బందులు పేర్కంటూ. వివిధ పత్రికలు..మీడియా..సోషల్ మీడియాలలో కథనాలు రావడంతో.. స్పందించిన తితిదే చైర్మన్.వి.సుబ్బారెడ్డి..
తన ప్రతినిధులను ఎస్తర్ వద్దకు పంపించారు.
ఇవాళ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ విషయంలో సినీ నటుడు సోనూ సూద్ కూడా స్పందించారు.
తనవంతుగా ఎలాంటి సాయమైనా చేస్తామంటూ హామీ ఇచ్చారు.
ఓ న్యాయవాది కుటుంబం ఆదరించి ఎస్తర్‌కు వారింట్లోనే బస, భోజన వసతి కల్పించింది.
రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు ఒలివియా(55), ఎస్తర్(32)లకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్ దీపా వెంకట్ అండగా నిలిచారు. తల్లీకూతుళ్లతో ఆమె మాట్లాడారు. రష్యన్-తెలుగు, రష్యన్-హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపుతున్నారు. బృందావనంలో వున్న ఎస్తర్ తల్లి ఒలివియాను తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. వివరాలలోకి వెళితే.
ఎస్తర్ రష్యా వనిత, తల్లి ఒలివియాతో
కలిసి ఫిబ్రవరి 6న భారత్‌కు వచ్చారు.
ఎస్తర్జి రష్యాలో పిజియోథెరపీ వైద్యురాలు. ఆలయాల అలంకరణలోనూ ప్రావీణ్యముంది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భారత్ చేరుకున్న వీరికి కరోనా చేదు అనుభవం మిగిల్చింది. లాక్ డౌన్ సమయంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో గడిపి ఆంక్షలు సడలించాక తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చారు. కరోనా ఆంక్షల కారణంగా విదేశీయులకు దర్శన భాగ్యం లేదని తెలిసి నిరాశకు గురయ్యారు. చేతిలో డబ్బులు కరిగిపోగా... ఎవరైనా తమను ఆదుకుంటారనే ఆశతో రష్యన్లు ఎక్కువగా వచ్చే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావనం పట్టణానికి ఎస్తర్ తల్లి వెళ్లారు. అక్కడ ఎలాంటి సాయమూ అందలేదు. పైగా తిరిగి రాలేక అక్కడే ఇరుక్కుపోయారు. ఎస్తర్ అవస్థలను చూసిన కపిల తీర్థం సమీపంలోని ఓ వ్యక్తి ఆమెకు ఆశ్రయం కల్పించారు.. ఎస్తర్ రష్యా వాసి అయినప్పటికీ పూర్వ జన్మ సుకృతం ఏడుకొండలస్వామి దర్శనం అయింది.త్వరలోనే తల్లి.. కూతుళ్లు.. కలుసుకునివారి స్వదేశానికి చేరుకోవాలని వారి కధ సుఖాంతం కాావాలని కోరుకుందాాం
No comments:
Post a Comment