Sunday, 27 February 2022

ఆయన మంత్రానికి నషాలాన్ని చేరిన విషం విరుచుకుపడిపోయేది....

#పాముల_నర్సయ్య గారు 
మంత్రాలకు చింతకాయలు రాలతాయా?అని ప్రశ్నించే వారికి సమాధానం పాముల నర్సయ్య గారి జీవితం. ఎందుకంటే దైవత్వం మూర్తీభవించిన పాముల నర్సయ్య గారి నోటి నుంచి వచ్చే మంత్రం విషానికి విరుగుడుగా మారింది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దైవానుగ్రహం తో ప్రసాదించబడిన ఆ మంత్రం ఆనాటి కాలంలో పాము కాటుకు గురైన ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించింది. దైవశక్తి గల ఆ మంత్రం ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఎలాంటి కాలకూట విషానికైనా విరుగుడు లభించినట్లే. దైవానుగ్రహంతో తన మాటనే మంత్రం గా మలచుకున్న కారణజన్ముడు పాముల నర్సయ్య ‌.
నరసయ్య మంత్ర మహిమ...
పాముల నర్సయ్య గారు విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన వారు. చెరుకుమిల్లి వెంకట నరసింహారావు అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ మంత్రశక్తి ఆయనను పాముల నర్సయ్యగా మార్చేసింది. చిన్న వయసులో ఒకసారి కాశీ వెళ్లారు.అక్కడ గంగానదిలో స్నానం చేస్తుండగా అదే సమయంలో ఆనాటి శృంగేరి పీఠాధిపతి కూడా అక్కడికి రావడం జరిగింది.ఆ శృంగేరీ పీఠాధిపతి నర్సయ్యను చూసి, ఇతనిలో ఏదో దివ్యత్వం దాగి ఉంది, ఇతని వల్ల ఒక మహత్కార్యం జరగాల్సి ఉందని గ్రహించి ఆయనకు గారుడీ మంత్రాన్ని ఉపదేశించారు. విషాన్ని హరించే మంత్రం అది. నర్సయ్య ఆ మంత్రాన్ని ఎన్నో ఏళ్ల పాటు భక్తిశ్రద్ధలతో జపించి శక్తిని సాధించారు. ఆ మంత్రశక్తితో ఆయన పాముకాటుకు గురైన ఎంతోమందిని కాపాడారు.

నరసయ్య గారి జీవితానికి ఓ మలుపు...
ఓ బ్రిటిష్ అధికారిని కాపాడటం పాముల నర్సయ్య గారి జీవితానికి ఓ మలుపు గా మారిందని చెప్పవచ్చు. అ మలుపే ఎంతో మందికి ప్రాణదానం జరిగేటట్లు చేసింది. ఒక్కసారి ఓ బ్రిటిష్ అధికారి పాముకాటుకు గురి అయ్యాడు.కొంతమంది చెంచులు పసరు మందు వేసినా ఫలితం కనపడలేదు.శరీరమంతటికీ విషం పాకిపోయింది. ఇక కొద్ది క్షణాల్లో చనిపోతాడు అనగా అటుగా వెళ్తున్న నరసయ్యకు ఈ విషయం తెలిసి ఆ బ్రిటిష్ అధికారి చెవిలో మంత్రాన్ని చెప్పాడు. కాసేపటికి ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వేలో ఉద్యోగం ఇవ్వడమే కాదు, ఆయన కూర్చున్న చోట ఫోన్ కూడా ఏర్పాటు చేశారు.

ఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు .ఇప్పుడు 108 అంబులెన్స్ నెంబర్ ఎలా ఉందో అలా నర్సయ్య గారి ఫోన్ నెంబరు నాటి జనం నోళ్ళలో నానింది. ఆ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసి పాము కాటుకు గురయ్యారు అని చెబితే చాలు ,నరసయ్యగారు ఆ పాము మంత్రాన్ని పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో చెప్పి విషాన్ని దించేసేవారు. ఇలా కేవలం ఫోన్ ద్వారానే మంత్రం చెప్పి కొన్ని వేలమందిని బతికించారు .కానీ ఏనాడు ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మద్రాసు రైల్వే సూపరింటెండెంట్ గా బదిలీ చేసినా,అక్కడ కూడా ఇదే విధంగా ఫోను ఏర్పాటు చేయడం జరిగింది.

వైద్యం ఎలా చేసేవారంటే...
మంత్రం పనిచేయాలంటే కొంతమంది స్పర్శ ద్వారా చేస్తారు. మరి కొంతమంది తీర్థం ఇచ్చి మంత్రం పని చేసేలా చేస్తారు. కానీ నర్సయ్య గారు ఫోన్ రిసీవర్ తో నయం చేసేవారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది వాస్తవం వైద్యం ఎలా చేసేవారంటే విజయవాడలోని ఓ వ్యక్తికి పాము కరిచినట్లు ఫోన్ వస్తే ఆ ఫోన్ రిసీవర్ ను పాము కరిచిన వ్యక్తి చెవి దగ్గర పెట్టు అనేవారు. నరసయ్య భుజం మీద ఎప్పుడూ గుడ్డ పీలికలు ఉండేవి .దాంట్లోని ఓ పీలికనకు ముడి వేసి ఆ తర్వాత పాము కాటు వేసిన వ్యక్తికి చెవిలో గారుడీ మంత్రాన్ని చెప్పేవారు. కాసేపు ఆయన కళ్ళు మూసుకొని ఉపా‌సన చేసేవారు .దిగిపోతుందని చెప్పే వరకు ఆయన పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో ఏదో చెబుతుండే వారు . విషం దిగిపోయింది అని చెప్పిన తర్వాత ఆ గుడ్డ పీలికలలో కొంచెం ఇసుక వేసి దానిని చెట్టుకు కట్టివేసేవారు. దాంతో ఆ ప్రక్రియ పూర్తయినట్లు. ఇలా కొన్ని వేలమందిని ఆయన గారుడీ మంత్రంతో బతికించారు.

చేతులెత్తేసిన పరిశోధకులు...
నరసయ్య మంత్ర మహిమ ను గుర్తించి ఎన్నో దేశాల వారు ఆహ్వానాలు పంపారు .అదే సందర్భంలో ఈయన మంత్రం పై పరిశోధనలు సైతం జరిగాయి .నరసయ్య గారు తన జీవిత కాలంలో 22 సార్లు జర్మనీ వెళ్లారు .అలాగే 12 సార్లు ప్రపంచ పర్యటన చేశారు ఈయన పర్యటించిన దేశాలలో వీరి మంత్రాన్ని ఎన్నో విధాలుగా పరీక్షించారు.

ఓసారి రష్యా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఈయనకే పాము కాటు వేస్తే బ్రతుకుతాడో లేదో పరీక్షించబోయారు, ఇలాంటి పిచ్చి పనులు చేయ వద్దని చెప్పిన వినలేదు. ఈయన నోట్లో నాభి అనే వేరు ఉండేది. దాని రసాన్ని ఎప్పుడూ పిలుస్తూ ఉండేవారు. ఆ మూలిక విషానికి విరుగుడుగా పని చేసేది. నన్ను పాము కాటు వేస్తే ఆ పాము కే ప్రమాదం అని చెప్పారు. కానీ రష్యన్లు ఈయన మాట వినకుండా ,ఎవరితోనో మాట్లాడుతుంటే చాటుగా భయంకరమైన సర్పంతో వేయించారు. సరిగ్గా ఎనిమిది నిమిషాలు అయ్యే సరికి ఆ సర్పం చనిపోయింది . పాము చనిపోయిన విషయం తెలుసుకుని నరసయ్య గారు ఎంతో బాధ పడ్డారు. ఎందుకంటే వీరికి పాములంటే ఎంతో ఇష్టం .ఎవరైనా పాములను చంపితే ఊరుకునేవారు కాదు.
సేకరణ... సోషల్ మీడియా నుండి

Thursday, 24 February 2022

రాజ‌కీయ ప్రయోజనాలకోసం చేస్తున్న అవాస్త‌వ ప్ర‌చారాన్ని భక్తులు నమ్మరు- టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి


ధనవంతుల ప్రయోజనాలు పరిరక్షించే కుట్రతోనే ఈ ఆరోపణలు

-  సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవాటికెట్ల ధ‌ర‌లు పెంచుతున్నట్లు చెప్పామా?

-  రాజ‌కీయ ప్రయోజనాలకోసం చేస్తున్న అవాస్త‌వ ప్ర‌చారాన్ని భక్తులు నమ్మరు

- టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

            తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవా టికెట్ల జారీలో విఐపిల ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో పాలకమండలి సమావేశంలో జరిపిన చర్చను వక్రీకరించి కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుండటం దౌర్భాగ్యమని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి  చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒకప్రకటన విడుదల చేశారు. పాలక మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలనే అభిప్రాయం తోనే ఎస్వీబీసీ లో లైవ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. నాలుగు గోడల మధ్య కూర్చుని రహస్యంగా తాము ఈ అంశం చర్చించలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ చర్చ ప్రారంభంలోనే సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడం లేదని తాను స్పష్టంగా చెప్పిన మాటలు విమర్శకుల చెవులకు వినిపించక పోవడం తమ తప్పుకాదని శ్రీ సుబ్బారెడ్డి అన్నారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా తాను ఈ విషయం చాలా సూటిగా, స్పష్టంగా ఒకటికి రెండుసార్లు చెప్పిన వీడియో రాజకీయ ఆరోపణలు చేసే వారి కళ్ళకు కనిపించక పోవడం పాలక మండలి తప్పు కాదన్నారు.
             సామాన్య భక్తులకు కేటాయించే టికెట్ల ధరలు పెంచుతున్నామని, పెంచేశామని తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల్లో ఆందోళన రేపే ప్రయత్నాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సఫలం కానివ్వరనే విషయం వారు గుర్తించాలని శ్రీ సుబ్బారెడ్డి హితవుపలికారు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్ర దారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారన్నారు. ఇప్పటికే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్న వారు ఇకనైనా తెలివి తెచ్చుకోవాలని సూచించారు. తమ పాలక మండలి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. భక్తులకు మేలు చేసే సద్విమర్శలని తాము ఎప్పుడూ స్వాగతిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని ప్రజల్లో అభిప్రాయం కల్పించేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రను భక్తులు గ్రహించాలని ఆయన కోరారు. తాను, సభ్యులు పాలక మండలి సమావేశంలో మాట్లాడిన మాటలను సాంకేతిక పరిజ్ఞానంతో వారికి కావాల్సిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ వాస్తవం...
 
            ఆర్జిత సేవా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై చాలాకాలంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు. సేవాటికెట్లు ప‌రిమితంగా ఉండ‌గా, సిఫార‌సు లేఖ‌లు మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. సిఫార‌సుల‌ను త‌గ్గించేందుకు విచ‌క్ష‌ణ కోటాలో ఉన్న సేవా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచితే ఎలా ఉంటుంద‌నే విష‌యంపై చ‌ర్చ మాత్ర‌మే జ‌రిగింద‌ని, ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని వివ‌రించారు. సామాన్యుల‌కు కేటాయించే ఆర్జిత సేవాటికెట్ల ధ‌ర‌ల పెంచాలనే ఆలోచనే తమకులేదన్నారు. వి ఐ పిల ప్రయోజనాలను కాపాడి సామాన్య భక్తుల ప్రయోజనాలను దెబ్బతీయాలనుకుంటున్న వారే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఈకార్యక్రమాలు కనిపించలేదా ?

రెండున్న‌రేళ్ల నుండి టిటిడి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. విమర్శకులకు ఇవేవీ కనిపించలేదా అని శ్రీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.  శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించామ‌న్నారు. రెండో విడతగా దాదాపు 1100 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని పనులు  జరుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. జీవితకాలంలో ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకోలేని పేదవర్గాల వారిని ఆహ్వానించి ఉచితంగా శ్రీవారి దర్శనం చేయిస్తున్నామ‌న్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2021 అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు దాదాపు 7500 మందికి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌న భాగ్యం కల్పించామని చైర్మన్ వివరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 20వతేదీ వరకు దాదాపు 7 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామ‌ని తెలిపారు.  

         శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు భక్తులతో శ్రీ వేంకటేశ్వర నామకోటి రాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ‌న్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించామ‌ని, భువనేశ్వర్‌, చెన్నై, ఊలందూర్‌పేట, సీతంపేట, అమరావతి, రంపచోడవరంలో ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయ‌ని తెలియ‌జేశారు. విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని త్వరలో ప్రారంభిస్తామ‌న్నారు.

           ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిగారి ఆదేశంతో దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామ‌ని, ఇప్పటివరకు ప‌లు ఆలయాలకు ఆవులు, దూడలు అందించామ‌ని తెలిపారు. తిరుమలకు వెళ్లే భక్తులు గోమాతను దర్శించుకున్నాకే శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తుల కోసం అలిపిరి శ్రీవారి పాదాల చెంత శ్రీవేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయం ప్రారంభించామ‌న్నారు.

            టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో గతేడాది అక్టోబరు 30, 31వ తేదీల్లో జాతీయ గో మహాసమ్మేళనం నిర్వహించామన్నారు. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాలు, మఠాధిపతులు, గోసంరక్షణశాలల నిర్వాహకులు, గోప్రేమికులు, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులు హాజరయ్యారని ఆయన చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమ్మేళనం తీర్మానం చేయడం హిందూ ధర్మ వ్యతిరేక చర్యా ? అని నిలదీశారు.

             తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీకపిలేశ్వరాలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో గోపూజ ప్రారంభించామని ఆయన తెలిపారు. భక్తులు ఈ ఆలయాల్లో గోపూజ చేసుకునే ఏర్పాట్లు చేశామని,  అదేవిధంగా, టిటిడి అనుబంధ ఆలయాల్లో వేదాశీర్వచనం ప్రారంభించామని తెలిపారు.

           ప్రపంచమానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నిరంత‌రంగా పారాయణ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. హైందవ సాంప్రదాయాల పట్ల, సనాతన ధర్మం పట్ల యువతలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆయా మాసాలకు సంబంధించిన విశేష కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేస్తున్నామ‌ని వివ‌రించారు. విరాట‌ప‌ర్వం, ఆదిప‌ర్వం లాంటి విశేష కార్య‌క్ర‌మాల‌ను మొద‌టిసారిగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని, తద్వారా కోట్లాది మంది భ‌క్తులు ప‌ర‌వ‌శించిపోయార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల్లో భ‌క్తిత‌త్వాన్ని పెంపొందించేందుకు, హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించేందుకు ఎస్వీబీసీ హిందీ, క‌న్న‌డ ఛాన‌ళ్ల‌ను 2021, అక్టోబ‌రు 11న ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఎస్వీబీసీలో నాలుగు భాష‌ల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి సేవ‌లు, ఉత్స‌వాలు, విశేష కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయ‌డం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.

             ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను శస్త్రచికిత్సల ద్వారా సరిచేసేందుకు 2021, అక్టోబరు 11న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంను ప్రారంభించామని ఆయన వివరించారు. పేద కుటుంబాల వారికి ఈ ఆసుపత్రి ఎంతో ఆసరాగా నిలుస్తోంది.  ఇప్పటివరకు 100 శస్త్రచికిత్సలు జరిగాయనీ, వీటిలో 50 శాతానికి పైగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు కాగా మిగతావి క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారా చేశారని ఆయన చెప్పారు. మరో అడుగు ముందుకేసి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థలసేకరణ పూర్తి చేశామని, ఇందుకు సంబంధించిన డిపిఆర్, డిజైన్లు ఖరారు చేశామని చైర్మన్ చెప్పారు.

             మహిళల ప్రసూతి కాన్పు సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఏర్పడిన సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడే చిన్నపిల్లలకు బర్డ్‌ ఆసుపత్రిలో తగిన వైద్యం, శిక్షణ అందించి వారిని పూర్తిస్థాయి వికాసవంతులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి కట్టుబడి ఉన్నామని, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆరోపణలు చేసే వారి విమర్శలకు భయపడి ఈ కార్యక్రమాల అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

----------------------------------------------------------------

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Thursday, 17 February 2022

ఖమ్మం జిల్లాలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు....

*ఖమ్మం.*
తేదీ: 17 - 02 - 2022
ప్రచురణార్ధం / ప్రసారార్ధం.
*తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పుట్టినరోజు సందర్భంగా  ఖమ్మం జిల్లాలో ఘనంగా  పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన గులాబీ శ్రేణులు..
రఘునాధపాలెం మండలంలో నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నేత ఐటీ  మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు 5000 మొక్కలను నాటిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గార్లు..
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ లు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కేక్ తినిపిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఎమ్మెల్సీ, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన గారి సూచనతో గౌరవ ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న దానాలు, భారీగా మొక్కలు  నాటే కార్యక్రమాన్ని నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..
*ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు మాట్లాడుతూ:-* తెలంగాణ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత కేటీఆర్ గారి పిలుపు మేరకు గత మూడు రోజుల నుండి ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఒక పండగ వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ స్థాయిలో  సుభిక్షమైన పాలనను అందిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రానున్న రోజుల్లో పూర్తి ఆయురారోగ్యాలతో యావత్ దేశాన్ని అభివృద్ధి  పథంలో నడిపించే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

*రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ:-* తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన పథకాలను ప్రజల వద్దకే  చేరుస్తున్న ఘనత కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని, కెసిఆర్ గారి తోనే యావద్దేశం ప్రగతిపథంలో నడుస్తోందని జాతీయ నాయకులు భావిస్తున్నారని, రానున్న రోజుల్లో యావత్ దేశ ప్రజలు తమ ఐక్యత చాటి కెసిఆర్ గారి బాటలో నడవాలని ఆకాంక్షించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి తోనే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఫలాలను చూడగలుగుతున్నారు అని వారు తెలిపారు.
ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో  వర్ధిల్లాలని పూజలు నిర్వహించారు. మరియు జిల్లా టిఆర్ఎస్ భవన్ ఆవరణంలో కార్పొరేటర్లు, జిల్లా నాయకులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అనుబంధ కమిటీ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్లు కూరాకుల నాగభూషణం, కమల్ రాజ్, కొండబాల కోటేశ్వర్లు, బచ్చు విజయ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్.జె.సి కృష్ణ, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కెసిఆర్_కప్_2022 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్స్ లో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర ( గాయత్రి రవి )*


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా #కెసిఆర్_కప్_2022 ఎల్బి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల మరియు మహిళల వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్స్ లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత, హోమ్ మంత్రి మహమ్మద్ ఆలీ , మంత్రి శ్రీనివాస్ గౌడ్ , 
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి ).
అనంతరం భారీ కేక్ కట్ చేసిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు

Wednesday, 16 February 2022

సీఎం కేసిఆర్ కు మంత్రి అజయ్ జన్మదిన శుభాకాంక్షలు

16:02:2022 :: Hyderabad
తెరాస అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో సుపరిపాలన సాగిస్తున్న సీఎం కేసిఆర్ మరో మహాత్ముడని మంత్రి అజయ్ కొనియాడారు. 
ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా జనరంజక పాలనను అందిస్తూ అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా సీఎం కేసీఆర్ ఎదిగారని పేర్కొన్నారు. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజల గుండెల్లో సీఎం కేసిఆర్ నిలిచారన్నారు. 
దేశానికి నేడు తెలంగాణ దిక్సూచిగా మారిందంటే దానికి సృష్టికర్త, రూపశిల్పి ముఖ్యమంత్రి కేసీఆరేనని, "మొదట పట్టించుకోరు ఆ తర్వాత చూసి నవ్వుతారు. ఆపై యుద్ధానికి దిగుతారు అంతిమంగా మీరే విజయం సాధిస్తారని" మహాత్మాగాంధీ చెప్పిన సూక్తి సీఎం కేసీఆర్‌ పోరాటస్ఫూర్తికి సరిగ్గా సరిపోతుందన్నారు. 
సబ్బండ వర్ణాల సమగ్ర జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆవిర్భావం నుంచే సంక్షేమ యజ్ఞం చేస్తున్నారని ఎన్నో పథకాలను అమలుచేస్తూ ఒక పేద కుటుంబం మెరుగైన జీవితం గడిపేందుకు భరోసా కల్పిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ గడపకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని తెలంగాణ బిడ్డలు తల్లి గర్భం నుంచి భూ తల్లి ఒడిలోకి చేరే జీవిత చక్రంలోని ప్రతీ దశలోనూ సీఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాయముందన్నారు. 
గర్భంలో పడ్డప్పుడు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం; 104, 108 సేవలు, ప్రసూతి దవాఖానలు, కేసీఆర్‌ కిట్‌, మగబిడ్డ అయితే రూ. 12 వేలు, ఆడబిడ్డ అయితే 13 వేల సాయం, పాలు మరిచిన క్షణం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు భోజనవసతి నడక నేర్చిన తర్వాత నాణ్యమైన ఉచిత ప్రాథమిక విద్య ఐదో తరగతి వచ్చిన తర్వాత ఉచిత గురుకుల విద్య పదో తరగతి తర్వాత ఉచిత కళాశాల విద్య, ఉపకార వేతనాలు, 12 పాసైతే ఉచిత ఉన్నత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, గురుకుల కళాశాలలు, ఉచిత యూనివర్సిటీ విద్య, 18 ఏండ్లు నిండి ఆడబిడ్డ పెండ్లయితే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, 21 ఏండ్ల వయస్సులో ఉచిత వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ, టాస్క్‌ ద్వారా విదేశాల్లో చదువంటే ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ తదితర విషయాల్లో ప్రజలకు సీఎం కేసిఆర్ అండగా నిలిచారని అన్నారు.
 పల్లె మొదలు పట్టణం దాకా వితంతువులకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు, రైతన్నకు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ఉచిత, నాణ్యమైన కరెంటు, సబ్సిడీ యంత్ర పరికరాలు, భూసార పరీక్షలు, సాదా బైనామా, నేతన్నకు సబ్సిడీ యంత్రాలు, గీత, మత్స్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, గొర్ల పంపిణీ; ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు, రుణాలు, తాజాగా దళితుల అభ్యున్నతికి దళితబంధు.. ఇలా అన్నిపక్షాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం దేశం లో ఎక్కడాలేదని, కేవలం రాష్ట్రంలోనే ఉందని ఘంటాపథంగా చెప్పవచ్చునని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.

పంచ భావనారాయణ క్షేత్రాలు...

ఎండకాలంలో చల్లగా, చలి కాలంలో వేడిగా ఉండే గర్భగుడిని సందర్శించారా?

ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ దేవాలయంలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది.
నమో భావదేవాయ
ఇక ఈ దేవాలయంలో విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న మరో మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇక మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం పూర్తి వివరాలు మీ కోసం...
అత్యంత ప్రాచీన దేవాలయం:
భావనారాయణ స్వామి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారత దేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాలు. వీటి నిర్మాణం దాదాపు 1500 ఏళ్లకు పూర్వం జరిగిందని తెలుస్తోంది.

పంచ భావన్నారాయణ దేవాలయాలు
భావనారాయణ స్వామి దేవాలయాలు మొత్తం ఐదు. అందువల్లే వీటిని పంచ భావన్నారాయ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల, పొన్నూరు, భావరేవరపల్లి, సర్పవరం, పట్టిసీమ.

భావన్నారాయణుడి వల్ల భావపురి
మరికొంతమంది ఇందులో ప్రకాశం జిల్లాలోని పెద గజాం కూడా ఉందని చెబుతారు. వీటిలో ముఖ్యమైనది బాపట్ల. ఇక్కడ నెలకొన్న భావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదట భావపురి అని పిలిచేవారు.
అటు పై బాపట్ల కాలక్రమంలో భావపురిగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడితో పాటు పరివార దేవతలైన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవారు, ఆళ్వారులు ఉన్నారు.

కాలి వేళ్ల పై నిలబడి:
ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుందిం. ఇలా ఓ దేవతా మూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు.

చలికాలంలో వెచ్చగా:
ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం.

చేప ఆకారంలో:
ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 594లో భావనారాయణుడి సూచనమేరకు చోళ రాజైన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్లు చెబుతారు.

దేవరాయులు:
ఇతని తర్వాత చోళ భూపాల దేవుడు, వీర ప్రతాప శూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళదేవరాజు, గజపతులు, దేవరాయులు అటుపై అచ్చుత దేవరాయులు, సదాశివరాయులు ఈ ఆలయం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.

పునాదులు:
ఇదిలాఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగ అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు.

పురోహితులు:
అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు.

జ్వాలా నరసింహుడు:
దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు. ఇక జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.

ఎలా చేరుకోవాలి
బాపట్లకు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుంచి నిత్యం నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని చాలా నగరాల నుంచి రైలు సౌకర్యాలు ఉన్నాయి. బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి భావనారాయణ స్వామి దేవాలయం కేవలం అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఆటోలు అందుబాటులో ఉంటాయి.
సేకరణ....

Tuesday, 15 February 2022

ఎ.పి.సి.ఎం జగన్మోహన్ రెడ్డికి నందమూరి అభిమానుల కృతజ్ఞత..

*15.02.2022*
*అమరావతి*


*అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతామంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నందమూరి కుటుంబ సభ్యులు

*ఈ సమావేశంలో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళీ, పలువురు స్ధానికులు*.

36వ డివిజన్ కార్పోరేటర్ పసుమర్తి రాంమోహన్ రావు ఆధ్వర్యంలో 300 మందికి వస్త్రాలు పంపిణీ .



ఖమ్మం : నగరంలో మంగళవారం మూడవ పట్టణం గాంధీ చౌక్ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద 36వ డివిజన్ కార్పోరేటర్ పసుమర్తి రాంమోహన్ రావు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచన మేరకు మొదటిరోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మేయర్ పూనుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , ఎస్.బీ.ఐటి , ఆర్జేసీ విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ లు పాల్గొని హమాలీలకు , నిరుపేదలకు , వివిధ పనుల మీద గాంధీచౌక్ ప్రాంతానికి వచ్చిపోయే వారికి సుమారుగా 300 మందికి వస్త్రాలు పంపిణీ చేశారు . తదనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులు మన కేసీఆర్ అని , వివిధ కుల వృత్తుల వరకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని , నిరుపేదలకు అండగా నిలిచిన నాయకులని కొనియాడారు . కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి ,  రుద్రగాని ఉపేందర్ , తోట వీరభద్రం , గజ్జల లక్ష్మీ - వెంకన్న , డోనావన్ రవి , నగర యువజన విభాగం అధ్యక్షులు దైవభక్తిని కిషోర్ , టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు షకీనా , పాషా , డివిజన్ అధ్యక్షులు వేములపల్లి వెంకన్న , సెక్రటరీ పిల్లుట్ల కృష్ణా , మామిళ్ల తిరుమలరావు , గుంటుపల్లి దివాకర్ గుప్తా , ఆకుల సతీష్ , ఏవీ రామారావు , పిల్లుట్ల వెంకన్న , గౌవ్రోజు వసంత బాబు , మిట్టపల్లి రవి , కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు .

మేడారంలో ప్ర‌తి యేటా ట‌న్నుల కొద్ది బంగారం... రహస్యమేంటి..?


గిరిజన సంస్కృతి, సాంప్రదాయ పద్దతిలో జరిగే మేడారం జాతరకు, బెల్లానికి సంబంధం ఏమిటి.? మేడారంలో బెల్లాన్ని ‘బంగారం’ అని ఎందుకంటారు.? దాన్ని నైవేద్యంగా ఎందుకు సమార్పిస్తారు.? తల్లుల గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లం తీసుకెళ్లినా ఎందుకు తాపత్రయ పడుతారో అంటే ఇక్కడ బెల్లమే ఆ తల్లుల దీవెన.. ఆ తల్లుల వరంగా భావిస్తారు.కాకతీయుల కాలం నుంచే ఇది జరుగుతోంది. పూర్వం సుదూరాల నుంచి మైళ్లకొద్ది ప్రయాణించి తల్లుల దరికి చేరుకునేవారు భక్తులు. మేడారానికి చేరుకొని దాదాపు వారంరోజులు గడిపేవారు. ఈ క్రమంలో ఆకలైనప్పుడు త్వరితశక్తి(ఇన్‌స్టాంట్‌ ఎనర్జీ)ని అందించే స్వభావం కలిగిన బెల్లం పానకంతో తయారుచేసే ఆహారపదార్ధాలను తినేవారు. బెల్లం పానకంలో పల్లిగింజలు, పుట్నాలు వేసి తయారుచేసే ముద్దలను ఇష్టంగా తినేవారు. అప్పటి నుంచి బెల్లం ప్రాశస్త్యం బాగా పెరిగిపోయి.. మొక్కుబడులుగా మారాయి

Monday, 14 February 2022

శ్రీ నరాల సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఇంద్రసేన కు ఆర్థిక సహాయం ...


ఖమ్మం : నగరంలో గోపాలపురం ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి నివాసముంటున్న జర్నలిస్ట్ ఇంద్రసేనకు శ్రీ నరాల సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయూతని అందించారు . తదనంతరం ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు & చైర్మెన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘకాలంలో మన తెలంగాణ , ప్రజాపక్షం పత్రికల్లో ఇంద్రసేన పని చేశారని , మీడియా రంగంలో ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తని , ఇంద్రసేనకు ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్ లో కాలు విరిగిందని , హైదరాబాదులో శస్త్రచికిత్స చేస్తే మూడున్నర లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపారు . తన వంతు సహాయంగా శ్రీ నరాల సేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు & చైర్మెన్ నరాల సత్యనారాయణ ప్రస్తుతం 5 వేల రూపాయలను ఆర్థిక సహాయం కింద అందించారని . అదేవిధంగా 30 వేల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు . ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్రస్ట్ ద్వారా బ్లడ్ క్యాంప్ లు , హెల్త్ క్యాంపులను నిర్వహించి , విద్యుత్ లేని గ్రామాలను , మంచి నీరు లేని  గ్రామాలను దత్తత తీసుకోవడం జరుగుతుందన్నారు . అలాగే అనాధ శరణాలయాలను , వృద్దా శ్రమాలను సందర్శించి తగిన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తామన్నారు . పర్యావరణము , ప్రభుత్వ హాస్పిటల్స్ , ప్రభుత్వ కళాశాలలు , ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి వారికి ఆర్థిక చేయూత ఇవ్వడానికి ఈ ట్రస్టు సిద్ధం అవుతున్నారు . ఈ కార్యక్రమంలో ఇంద్రసేన కుటుంబ సభ్యులు , ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె వి కృష్ణారావు , నమా వినోద్ , ఫాసుద్దీన్ , రాజారత్నం కె అశోక్ తదితరులు పాల్గొన్నారు . శ్రీ నరాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు పొందాలి అనుకునే వారు ఈ క్రింది నంబర్ లను సంప్రదించ గలరు. 9440322840 ,9347189999 , ఖమ్మం జిల్లాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు త్వరలో మాస్క్ లు , శానిటైజర్ లు , నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు .

Saturday, 12 February 2022

కార్పొరేట్ హంగులతో కావ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం...



ఖమ్మం నగరం స్టేషన్ రోడ్ నందు  నూతనంగా ఎర్పాటు చేసిన కావ్య హాస్పిటల్ ను  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు..ఖమ్మం వాస్తవ్యురాలు  డాక్టర్ కావ్యచంద్ యలమూడీ, మెనేజింగ్ డైరెక్టర్ & సి.ఇ.ఓ. గా వున్న ఏమర్జేన్సీ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వివిధ రకాల రోగాలకు ఆధునాతన వైధ్య సాంకేతిక పరిజ్ఞానం తో చికిత్సలు నిర్వహించనుంది..
ఈసందర్భంగా డాక్టర్ కావ్యచంద్ తాను ఖమ్మం, విశాఖ పట్నం, విజయవాడలలో కార్పొరేట్ వైధ్యశాలల్లో బాధ్యతలు నిర్యహించినట్లు తెలిపారు.తమ హాస్పిటల్ ద్వారా.24x7 వైధ్యసేవలు అందుబాటులో వుంటాయని, వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాదులతో  పాటు అన్ని రకాల వైధ్యసేవలు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.. ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్ఛిన  మంత్రి అజయ్ కుమార్,.. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసన్నలక్ష్మి,పులిపాటి ప్రసాద్, 
 టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, 45వ డివిజన్ కార్పొరేటర్ బుడగం శ్రీనివాస్ లకు డాక్టర్ కావ్యచంద్ కృతజ్ఞతలు తెలిపారు.

మహాత్మా గాంధీ ఫౌండేషన్" సేవలు ప్రశంసనీయం- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కితాబు- కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కి పులిపాటి ఘన సన్మానం

 మహాత్మా గాంధీ ఫౌండేషన్ పేరుతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశంసించారు. మహాత్మా గాంధీ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఖమ్మం స్టేషన్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ గడచిన పదేళ్లుగా మహాత్మా గాంధీ ఫౌండేషన్ పేరుతో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు ఖమ్మం నగర చరిత్రలో గుర్తుండి పోయేలా ఉన్నాయని కొనియాడారు. విద్య సాంస్కృతిక రంగాల్లో చేపట్టిన పలు కార్యక్రమాలు, అలాగే కరోనా లాక్డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని గుర్తు చేసుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్.. మంత్రి అజయ్ కుమార్ కు శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసన్నలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, 45వ డివిజన్ కార్పొరేటర్ బుడగం శ్రీనివాస్ లను పులిపాటి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవిత కళాశాల చైర్మన్ కిరణ్, జగన్నాథం గుప్తా, డాక్టర్ కావ్య చందన్ యాలముడి, గుమ్మడవెల్లి శ్రీనివాస్, రామకృష్ణ, ప్రతాప్, ప్రవీణ్, రాణి, మాధవి, జ్యోతి యాలముడి, రవీంద్ర తదితర పురప్రముఖులు పాల్గొన్నారు.

Thursday, 10 February 2022

రాజమండ్రిలో మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు

10:02:2022 :: Rajamundry (AP)
____________________________
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీమతి వసంత లక్ష్మిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి) గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద ఖమ్మం నగర తెరాస యువజన విభాగం అధ్యక్షుడు, సుడా పాలకవర్గ సభ్యుడు దేవభక్తుని కిషోర్ బాబు అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సుఖసంతోషాలతో జీవించాలని, జిల్లాను సుభిక్షంగా అభివృద్ది చేసే శక్తి సామర్ధ్యాలు ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. 
అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, కేక్ కట్ చేసి మంత్రి పువ్వాడకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బత్తుల మురళి ప్రసాద్, పైడిపల్లి సత్యనారాయణ, కూరాకుల వలరాజు, బిక్కసాని జేశ్వంత్, పులిపాటి ప్రసాద్, కూర్ర భాస్కర్ రావు, మోతారపు సుధాకర్, అంజి రెడ్డి, సిరిపురపు సుదర్శన్, శిద్దారెడ్డి పవన్ రెడ్డి, రామోజీ, రాము, మధు, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 8 February 2022

సూర్యప్రభవాహనంపై శ్రీమన్నారాయణుడు# తిరుమలలోశాస్త్రోక్తంగారథసప్తమి

తిరుమల :  సూర్య జయంతిని పురస్కరించుకొని మంగ‌ళ‌వారంనాడు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా  వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించనున్నారు.

ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.  
సూర్యప్రభ వాహనం - (ఉదయం 6 నుండి 8 గం||ల వరకు 
రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. ఈ ఏడాది శ్రీ‌వారి ఆల‌యంలోని ధ్వ‌జ మండ‌పం ముందు శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై వేంచేపు చేశారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.43 గంట‌ల‌కు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు.
#ఆయురారోగ్య‌ప్రాప్తి :
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి
.అనంతరం.. చిన్న శేషవాహనం..గరుడ, హనుమంత వాహనాలతో పాటు..సర్వభూపాల పెద్ద శేషవాహనం, సింహ వాహనాలపై 

Monday, 7 February 2022

అంగరంగవైభవంగా కన్యకాపరమేశ్వరి దేవాలయంలో. గాలి గోపురం , కలశ ప్రతిష్ఠాన , గీతా మందిరము , శ్రీ కృష్ణ విగ్రహము ఆవిష్కరణ .* *పూర్ణాహుతి , హోమాలు , మహా అన్నదాన .*

ఖమ్మం కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గాలి గోపురం , కలశ ప్రతిష్ఠాన , గీతా మందిరము , శ్రీ కృష్ణ విగ్రహము  ఆవిష్కరణ,*పూర్ణాహుతి , హోమాలు , మహా అన్నదాన కార్యక్రమాలు అంగరంగవైభవంగా నిర్వహించారు.
విశిష్ట అతిథులు భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామి పాల్గొని ఆశీస్సులు అందజేయగా..
 *భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి .* 
 *గరికపాటి నరసింహారావు పుణ్య దంపతులు.కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచారు.
ఖమ్మం నగరంలోని గుట్టల బజారులో కొలువుదీరి, భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతున్న విశ్వమాత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ఉదయం నుండి వేద పారాయణము , గణపతి పూజ , పుణ్యాహవాచనము , గర్తన్యాసము , రత్నన్యాసము , బీజన్యాసము , ధాతున్యాసము తదుపరి గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి వారు గాలి గోపురం , కలశ ప్రతిష్ఠానకు శ్రీకారం చుట్టి ప్రసంగించారు . మానవజీవి తనలో ఉన్న పరమాత్మను విగ్రహరూపంలో ప్రతిష్టించి , అర్చించుటకు సంకల్పం చేసినాడని . గాలి గోపురమునకు దండం పెట్టి లోనికి వెళ్ళాలని , పాదాది | కేశపర్యంతం పరమాత్మను సేవించుట సాంప్రదాయం . కాన దేవాలయమున గాలి గోపురమునకు చాలా విశిష్టత ఉందన్నారు . రామ మందిరము , గీతా మందిరము మరియు శ్రీ కృష్ణ విగ్రహ ఆవిష్కరణను భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి ప్రారంభించి మాట్లాడారు . కృష్ణ పరమాత్మునికి ప్రధమ పూజ , కలాన్యాసము , నేత్రోన్మీలనము , దృష్టిధేను దర్శనము , దృష్టి కుంభము , కుంభాభిషేకము , మహాపూర్ణాహుతి , మంటప ఉద్వాసన , ప్రధాన కలశ ఉద్వాసన , శిఖరాభిషేకము , బ్రాహ్మణ ఆశీర్వచనము , స్వస్తి  అన్నారుతదుపరి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . అత్యధిక సంఖ్యలలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు . సాయంకాలం విజయోత్సవం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన   గరికపాటి నరసింహారావు పుణ్య దంపతులకు ఆలయ పాలకమండలి పక్షాన ఆత్మీయ సత్కారం చేశారు . అనంతరం వారు ప్రసంగించారు . తదుపరి అంతర్జాతీయ వైద్య ప్రముఖులు , శ్వాసకోస నిపుణులు డాక్టర్‌ గెల్లా విశ్వనాధ్ కు ఆలయ నిర్వాహకులు సన్మాన పుష్పమాలికలు అందించారు . ఈ సందర్బంగా ఆలయ పాలకమండలి చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి భారతీయ ఆర్ష , ధర్మ ప్రవర్తకులు , సనాతన వైదిక , ధర్మ పరిరక్షకులుగా శ్రీ కమలానంద భారతీ స్వామి వారి ముద్ర అగ్రగణ్యం . హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపక ధీశాలిగా, దేవాలయ సంస్కృతీ పరిరక్షణ ధురీణులుగా , ఎనిమిది వేలకు పైగా గ్రామాలను పర్యటించి , నడిచే ధర్మరక్షణ చేస్తున్న దేవుడు , మన ధార్మిక వ్యవస్థను పటిష్ఠం చేసుకునేందుకు మనమంతా స్వామి వారి అనుగ్రహ భాషణం కావాలన్నారు . విశ్వజనీనమైన భగవద్గీతను సంగీతభరితంగా , తాత్పర్యసహితంగా , పలుభాషలలో రికార్డుచేసి , గీతాప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన “గీతాగాన తపస్వి" బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి అని కొనియాడారు . అవధాన ప్రసంగ ప్రవచన మధుదారలతో సాహితి సరస్వతికి మంగళాభిషేకం చేసిన పండిత శ్రేష్టులు , కవివరేణ్యులు , ప్రవచన కిరీటి , తెలుగు కవి , మహాసహస్రావధాని శ్రీమాన్ గరికపాటి వారి ప్రసంగం ఆస్వాదించటం మన సుకృతమని , జాతిని జాగృతం చేస్తున్న భారతీయ మహాజ్ఞాన సింహం , శ్రీ గరికపాటి నరసింహం వారి ప్రవచన సౌరభాలను అమ్మసన్నిధిలో ఆస్వాదిద్దాం మనందరి అదృష్టమన్నారు . ఈ కార్యక్రమంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ , దేవాలయ కమిటీ గౌరవ సలహా దారులు చెరుకూరి కృష్ణమూర్తి , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు , దేవాలయ పాలకమండలి కోశాధికారి కొత్తమాసు హేమసుందర రావు , ఉపాధ్యక్షులు బిజ్జాల ఈశ్వరరావు , గెల్లా అమర్నాథ్ , ఆర్గనైజింగ్ సెక్రెటరీలు చెరుకూరి నంతోష్ కుమార్ , దేవరశెట్టి పూర్ణచందర్రావు , కుమ్మరి కుంట్ల శ్రీనివాసరావు , సహాయ కార్యదర్శులు దుగ్గి శ్రీనివాస రావు , చెరుకూరి వెంకట శ్రీనివాసరావు , అనుమోలు రమేష్ , తదితరులు పాల్గొన్నారు .

యాదాద్రిలో తెలంగాణ సి.ఎం...ఆలయ నిర్మాణ పనులు పరిశీలన...

ముఖ్య‌మంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకుని ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం పూజలు చేశారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందజేశారు. 
దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు.

కళ్యాణ కట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని  75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలను సీఎం పరిశీలించారు.

మరి కాసేపట్లో అలయ నిర్మాణం తుది దశ పనులు, సుదర్శన యాగం నిర్వహణ కోసం ఏర్పాట్లుపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

సీఎం వెంట మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మేల్యేలు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి, శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, శ్రీ పైళ్ళ శేఖర్ రెడ్డి, శ్రీ గాదరి కిషోర్, శ్రీ చిరుమర్తి లింగయ్య, చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, కలెక్టర్ తదితరులున్నారు.

పేరుకే 4th ఎస్టేట్..జర్నలిజం స్థితి దుర్భరం : టీయూడబ్ల్యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె .రాంనారాయణ ఆవేదన

పేరుకు ఫోర్త్ ఎస్టేట్ …. ఎమర్జన్సీ డ్యూటీ , వేతనాలు లేని ఉద్యోగం ,భద్రత లేని బతుకులు , ఇళ్లస్థలాలు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు … చెల్లుబాటు కానీ హెల్త్ కార్డులు , అరకొరగా అక్రిడేషన్ లు స్థూలంగా చెప్పాలంటే జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని టీయూడబ్ల్యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె .రాంనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు . అందువల్ల సమస్యల సాధనకోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు . దీనిపై రాష్ట్ర నాయకత్వం చర్చించి కార్యాచరణ ప్రకటిస్తుందని అన్నారు

. హక్కుల సాధనకోసం జర్నలిస్ట్ లోకం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు . ఇళ్లస్థలకోసం అనేక మంది జర్నలిస్టులు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని చూస్తున్నారని ,తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నా వాగ్దానం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది విమర్శించారు . ఇటీవల మీడియా సమావేశంలో కేసీఆర్ మరోసారి జర్నలిస్టుల ప్రస్తావన తెచ్చి త్వరలోనే మీకు ఎమ్మెల్యేలాలు ఇళ్ల స్థలాల సమస్య తీరబోతుంది ప్రకటించారని అదే జరిగితే కేసీఆర్ కు తప్పకుండ కృతజ్నతలు చెబుతామని రానియెడల ప్రతి నియోజవర్గ కేంద్రంలో టెంట్లు వేసి ప్రభుత్వ వాగ్దానాల సాధనకోసం ఉద్యమిస్తామని అన్నారు. ఇందుకోసం పౌరసమాజం మద్దతు కూడా కోరతామని వెల్లడించారు. సమాజహితం కోరి ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టులకు నిలవనీడకోసం ప్రభుత్వం ఇంటి జాగా ఇచ్చేందుకు తాత్సరం చేయడం దుర్మార్గమని అన్నారు .


మేడారం జాతరకు సన్నద్దమైన టిఎస్ఆర్టీసి - పోస్టల్ శాఖలు... భక్తులకు నేరుగా ఇంటికే ప్రసాదం..

Hyderabad/07.02.2022 : 
*‘బంగారం' మొక్కు - ప్రతిఫలం దక్కు..* 
*- పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టి.ఎస్.ఆర్టీసీ.*
*- మొక్కును పార్శల్ ద్వారా మేడారంకు పంపే సౌలభ్యం.*
*- టి.ఎస్.ఆర్టీసీ, దేవాదాయ శాఖ సహకారంతో ఈ పవిత్ర కార్యానికి నాంది.*
- *మంత్రి పువ్వాడ సూచనలతో ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన అధికారులు.*
మేడారంలో సమక్క-సారలమ్మ  అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలనుకున్నారా? అయితే, అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించలేకపోతున్నారా ? 
దిగులెందుకు, పదండి, టి.ఎన్. ఆర్టీసీ కార్గో, పార్శల్ కౌంటర్ల ముందుకు. అదెలా అనే కదా సందేహం. 
ఇప్పటికే ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్న సంస్థ తాజాగా పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. *“బంగారం పంపించడం మీ వంతు -అమ్మ వారికి సమర్పించడం మా తంతు"* అనే తాజా నినాదంతో టి.ఎన్. ఆర్టీసీ ఈ సేవల్ని ప్రారంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదండోయ్, కోరుకుంటే మొక్కు బంగారాన్ని కూడా మేడారం చేర్చి అమ్మ వారికి సమర్పించనుంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆలోచనల మేరకు TSRTC అధికారులు ఈ ఆవిష్కరణ చేశారు. అయితే, వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా టి.ఎన్. ఆర్టీసీ పార్శల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా సమక్క-సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచనల మేరకు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, సంస్థ వి.సి అండ్ ఎం.డి వి.సి. సజ్జనార్ గారి అధ్వర్యంలో ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు అధికారులు. 
అంతేకాదండోయ్, అమ్మ వారికి భక్తులు బంగారాన్ని సమర్పించిన తరువాత ప్రసాదాన్ని కూడా తిరిగి అందించనున్నారు. లాభనష్టాల త్రాసులో చూడకుండా భక్తుల సౌకర్యార్థం ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం  జరిగిందని మంత్రి పువ్వాడ అన్నారు. 
సంస్థ ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలు తలపెట్టిందని, మేడారం భక్తులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని బన్ స్టేషన్ల నుంచి ఈ సేవల్ని భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. 
బస్ స్టేషన్లతో పాటు ముఖ్య కేంద్రాలలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. 
5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో అమ్మ వారికి సమర్పించడంతో పాటు మళ్లీ సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మ వారి పసుపు కుంకుమ, అమ్మ వారి ఫోటో కూడా అందజేయడం జరుగుతుందని, ఇందుకు గానూ 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. 
ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 
ఫోన్ ద్వారా సమాచారం అందిన తరువాత బంగారాన్ని బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందవచ్చన్నారు. 
ఇతరత్రా వివరాలకు టి.ఎన్. ఆర్టీసీ కాల్ సెంటర్ 040-30102829, 040-68153333లతో పాటు వెబ్సైట్ https://www.tsrtc.telangana.gov.in ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఇంటికే మేడారం ప్రసాదం:
ఆసియా(Asia)లోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara)కు ఏర్పాట్లు ఘనంగా చేసింది తెలంగాణ సర్కార్(Telangana Govt). ఇప్పటికే మేడారం జాతరకు సామాన్యులు, సెలబ్రేటీలు క్యూలు కడుతున్నారు. ఈ నేపధ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ వారి ప్రసాదంను ఆర్టీసీ, తపాలా శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు.
అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించు కోనున్నమని మంత్రి  తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి… భారత పోస్టల్ సర్వీసు , ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం- బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్లీ దాన్ని భక్తులకు అందేజేయనున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ లో మీ సేవ లేదా టీయాప్ ఫోలియో TAPP-FOLIO (మొబైల్ ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేసుకుని )లో బుక్​ చేసుకోవాలన్నారు. అనంతరం భక్తులకు పోస్టల్ సేవల ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్ కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో ను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఇంటికే ప్రసాదం అందించనున్నామని.. ఈ సేవలను భక్తులు నియోగించుకోవాలని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు.

Sunday, 6 February 2022

ఘనంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవీ మహోత్సవాలు

                                                                                  ఖమ్మం నగరంలోని గుట్టల బజారులో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.   .వేడుకలలో భాగంగా వేద పారాయణము, హెూమాలు, సూర్యనమస్కారాలు, మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, క్షీరాబ్ది వాసము, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అహింసా పరమో ధర్మ: అనే సిద్ధాంతాన్ని ఆచరించి శ్రీ వాసవీమాత ప్రపంచ మానవాళికి గొప్ప సందేశం అందించారని పలువురు పేర్కొన్నారు. ధర్మరాజు, సత్యహరిశ్చంద్రుడు  తదితరులు మహాత్ములుగా నిలిచేందుకు ఆచరించిన అహింస అనే ఆయుధము శ్రీ వాసవీమాత ఆచరించి చూపారని గుర్తుచేశారు. ఆనాడు అమ్మవారు అహింసను పాటించి విశ్వమాతగా అవతరించగా కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్, భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్, దేవాలయ కమిటీ గౌరవ సలహా దారులు చెరుకూరి కృష్ణమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, దేవాలయ పాలకమండలి కోశాధికారి కొత్తమాసు హేమసుందర రావు, ఉపాధ్యక్షులు బిజ్జాల ఈశ్వరరావు, గెల్లా అమర్నాథ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు చెరుకూరి నంతోష్ కుమార్, దేవరశెట్టి పూర్ణచందర్రావు, కుమ్మరి కుంట్ల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు దుగ్గి శ్రీనివాస రావు, చెరుకూరి వెంకట శ్రీనివాసరావు, అనుమోలు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 2 February 2022

మహాత్మ గాంధీ పౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ


 ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో గెలిచిన 45 వ డివిజన్ కార్పొరేటర్  బుడిగం  శ్రీనివాసరావు అధ్వర్యంలో మహాత్మ గాంధీ పౌండేషన్ చైర్మన్  డాక్టర్ పులిపాటి ప్రసాద్ 45వ డివిజన్ ఖమ్మం నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికుల సేవలు గుర్తించి 25 మందికి నూతన వస్త్రాలు తో పాటు రగ్గులు శానిటైజర్లు మాస్క్ లు పంపిణీ చేసి వారిని ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యములో కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్ మాట్లాడుతూ నా మిత్రుడైన పులిపాటి ప్రసాద్ మంచి సేవ గుణం వ్యక్తి పేదవారికి అన్నం పెట్టేవాడు ఆపదలో ఉన్నవారిని అదుకొవటంలో ముందుటారని అలాంటి వ్యక్తి నాకు మిత్రుడు గా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను.ఈ సంధర్బంగా పులిపాటి మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ డివిజన్ అభివృద్దికి కృషి చేస్తున్న బుడిగం శ్రీనీవాస్ కు  శాలువతో సత్కారం చేసి మెమొంటో ని బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహత్మగాంధీ పౌండేషన్ సభ్యులు పుర ప్రముఖులు పాల్గోన్నారు.

Tuesday, 1 February 2022

భారత్ @ బడ్జెట్ 2022..

*Union Budget 2022: బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం*

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికాసేపట్లో లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. కరోనా మూడో ఉద్ధృతి, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌పై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోనందుకు ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక వేతనజీవులకు కొంతమేర ఉపశమనం లభించొచ్చని తెలుస్తోంది. అంతకుముందు నిర్మలమ్మ బృందం పద్దుల ట్యాబ్‌తో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ను వివరించారు

 బడ్జెట్ ‌2022-23ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌..

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్‌ను ఆమె సమర్పించారు.

వచ్చే 25ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది..

వచ్చే 25ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభివర్ణించారు. బడ్జెట్‌ 2022-23ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా ఉపయోగపడిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంతో టీకా కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.
ఆర్థికంగా కోలుకున్నాం
ఆరోగ్యరంగంలో మౌలిక సౌకర్యాలు.. టీకాలు.. ఆర్థిక రంగ విస్తరణలో కీలక పాత్ర పోషించాయి. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వం బదలాయించింది. త్వరలోనే ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకొస్తాం. 2021-22లో ఆర్థికంగా కోలుకున్నాం. ఈ బడ్జెట్‌ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.

 *పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది*

పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే 25ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు ఉన్నాయి. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుంది. నీలాంచల్‌ నిస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రైవేటుపరం చేశాం. వచ్చే ఐదేళ్లలో 13లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు’’ అని అన్నారు.

*100 వందే భారత్‌ రైళ్లు: నిర్మలా సీతారామన్‌*

రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘పీఎం గతిశక్తి పథకంలో సంతులిత అభివృద్ధి. మేకిన్‌ ఇండియా పథకంలో 6 మిలియన్ల ఉద్యోగాలు.100 వందే భారత్‌ రైళ్లు. 100 గతిశక్తి టెర్మినల్స్‌. వచ్చే 25ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపకల్పన. జాతీయ రహదారులు మరో 25వేల కి.మీ. విస్తరణ’ చేయనున్నట్లు తెలిపారు.

 *చిరుధాన్యాల సంవత్సరంగా 2023*

2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానానికి శ్రీకారానికి పెద్ద పీట వేస్తాం’’ అని చెప్పారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని తెలిపారు

*7 రంగాలపై దృష్టి*

తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత.

*డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపన*

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్య రంగంపై దృష్టిసారించినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా డిజిటల్‌ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. ‘‘పీఎం విద్యలో భాగంగా 200 టీవీ ఛానళ్ల ఏర్పాటు. ఈ-కంటెంట్‌లో నాణ్యత పెంపు. డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపన

*నారీశక్తికి ప్రాధాన్యం*

మహిళా, శిశు సంక్షేమశాఖను పునర్‌ వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మిషన్‌ శక్తి, మిషన్‌ వాత్సల్య, మిషన్‌ అంగద్‌ పథకాలు. ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారెంట్‌ పథకం. ఇందుకోసం  రూ.2లక్షల కోట్ల ఆర్థిక నిధులు’’


*నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌*

మొదటి సూత్రం-ప్రధాని గతిశక్తియోజన
రెండో సూత్రం- సమీకృత అభివృద్ధి
 మూడో సూత్రం- అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు
 నాలుగో సూత్రం- పరిశ్రమలకు ఆర్థిక ఊతం..

*వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపుకోసం స్టార్టప్‌లు*

‘‘ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్‌ఫాం. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థికసాయం. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం. ఈశాన్య రాష్ట్రాల్లో యువత, మహిళల అభివృద్ధికి నిధులు. 2లక్షల అంగన్వాడీల ఆధునీకీకరణ. పీఎం ఆవాస్‌ యోజన పథకం ద్వారా 80లక్షల గృహాల నిర్మాణం’’