Monday, 7 February 2022

మేడారం జాతరకు సన్నద్దమైన టిఎస్ఆర్టీసి - పోస్టల్ శాఖలు... భక్తులకు నేరుగా ఇంటికే ప్రసాదం..

Hyderabad/07.02.2022 : 
*‘బంగారం' మొక్కు - ప్రతిఫలం దక్కు..* 
*- పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టి.ఎస్.ఆర్టీసీ.*
*- మొక్కును పార్శల్ ద్వారా మేడారంకు పంపే సౌలభ్యం.*
*- టి.ఎస్.ఆర్టీసీ, దేవాదాయ శాఖ సహకారంతో ఈ పవిత్ర కార్యానికి నాంది.*
- *మంత్రి పువ్వాడ సూచనలతో ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన అధికారులు.*
మేడారంలో సమక్క-సారలమ్మ  అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలనుకున్నారా? అయితే, అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించలేకపోతున్నారా ? 
దిగులెందుకు, పదండి, టి.ఎన్. ఆర్టీసీ కార్గో, పార్శల్ కౌంటర్ల ముందుకు. అదెలా అనే కదా సందేహం. 
ఇప్పటికే ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్న సంస్థ తాజాగా పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. *“బంగారం పంపించడం మీ వంతు -అమ్మ వారికి సమర్పించడం మా తంతు"* అనే తాజా నినాదంతో టి.ఎన్. ఆర్టీసీ ఈ సేవల్ని ప్రారంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదండోయ్, కోరుకుంటే మొక్కు బంగారాన్ని కూడా మేడారం చేర్చి అమ్మ వారికి సమర్పించనుంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆలోచనల మేరకు TSRTC అధికారులు ఈ ఆవిష్కరణ చేశారు. అయితే, వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా టి.ఎన్. ఆర్టీసీ పార్శల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా సమక్క-సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచనల మేరకు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, సంస్థ వి.సి అండ్ ఎం.డి వి.సి. సజ్జనార్ గారి అధ్వర్యంలో ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు అధికారులు. 
అంతేకాదండోయ్, అమ్మ వారికి భక్తులు బంగారాన్ని సమర్పించిన తరువాత ప్రసాదాన్ని కూడా తిరిగి అందించనున్నారు. లాభనష్టాల త్రాసులో చూడకుండా భక్తుల సౌకర్యార్థం ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం  జరిగిందని మంత్రి పువ్వాడ అన్నారు. 
సంస్థ ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలు తలపెట్టిందని, మేడారం భక్తులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని బన్ స్టేషన్ల నుంచి ఈ సేవల్ని భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. 
బస్ స్టేషన్లతో పాటు ముఖ్య కేంద్రాలలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. 
5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో అమ్మ వారికి సమర్పించడంతో పాటు మళ్లీ సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మ వారి పసుపు కుంకుమ, అమ్మ వారి ఫోటో కూడా అందజేయడం జరుగుతుందని, ఇందుకు గానూ 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. 
ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 
ఫోన్ ద్వారా సమాచారం అందిన తరువాత బంగారాన్ని బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందవచ్చన్నారు. 
ఇతరత్రా వివరాలకు టి.ఎన్. ఆర్టీసీ కాల్ సెంటర్ 040-30102829, 040-68153333లతో పాటు వెబ్సైట్ https://www.tsrtc.telangana.gov.in ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఇంటికే మేడారం ప్రసాదం:
ఆసియా(Asia)లోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara)కు ఏర్పాట్లు ఘనంగా చేసింది తెలంగాణ సర్కార్(Telangana Govt). ఇప్పటికే మేడారం జాతరకు సామాన్యులు, సెలబ్రేటీలు క్యూలు కడుతున్నారు. ఈ నేపధ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ వారి ప్రసాదంను ఆర్టీసీ, తపాలా శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు.
అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించు కోనున్నమని మంత్రి  తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి… భారత పోస్టల్ సర్వీసు , ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం- బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్లీ దాన్ని భక్తులకు అందేజేయనున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ లో మీ సేవ లేదా టీయాప్ ఫోలియో TAPP-FOLIO (మొబైల్ ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేసుకుని )లో బుక్​ చేసుకోవాలన్నారు. అనంతరం భక్తులకు పోస్టల్ సేవల ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్ కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో ను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఇంటికే ప్రసాదం అందించనున్నామని.. ఈ సేవలను భక్తులు నియోగించుకోవాలని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు.

No comments:

Post a Comment