*ఖమ్మం.*
తేదీ: 17 - 02 - 2022
ప్రచురణార్ధం / ప్రసారార్ధం.
*తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన గులాబీ శ్రేణులు..
రఘునాధపాలెం మండలంలో నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నేత ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు 5000 మొక్కలను నాటిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గార్లు..
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ లు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కేక్ తినిపిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఎమ్మెల్సీ, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన గారి సూచనతో గౌరవ ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న దానాలు, భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..
*ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు మాట్లాడుతూ:-* తెలంగాణ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత కేటీఆర్ గారి పిలుపు మేరకు గత మూడు రోజుల నుండి ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఒక పండగ వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ స్థాయిలో సుభిక్షమైన పాలనను అందిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రానున్న రోజుల్లో పూర్తి ఆయురారోగ్యాలతో యావత్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
*రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ:-* తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన పథకాలను ప్రజల వద్దకే చేరుస్తున్న ఘనత కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని, కెసిఆర్ గారి తోనే యావద్దేశం ప్రగతిపథంలో నడుస్తోందని జాతీయ నాయకులు భావిస్తున్నారని, రానున్న రోజుల్లో యావత్ దేశ ప్రజలు తమ ఐక్యత చాటి కెసిఆర్ గారి బాటలో నడవాలని ఆకాంక్షించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి తోనే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఫలాలను చూడగలుగుతున్నారు అని వారు తెలిపారు.
ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు నిర్వహించారు. మరియు జిల్లా టిఆర్ఎస్ భవన్ ఆవరణంలో కార్పొరేటర్లు, జిల్లా నాయకులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అనుబంధ కమిటీ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్లు కూరాకుల నాగభూషణం, కమల్ రాజ్, కొండబాల కోటేశ్వర్లు, బచ్చు విజయ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్.జె.సి కృష్ణ, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment