ఖమ్మం : నగరంలో గోపాలపురం ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి నివాసముంటున్న జర్నలిస్ట్ ఇంద్రసేనకు శ్రీ నరాల సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయూతని అందించారు . తదనంతరం ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు & చైర్మెన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘకాలంలో మన తెలంగాణ , ప్రజాపక్షం పత్రికల్లో ఇంద్రసేన పని చేశారని , మీడియా రంగంలో ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తని , ఇంద్రసేనకు ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్ లో కాలు విరిగిందని , హైదరాబాదులో శస్త్రచికిత్స చేస్తే మూడున్నర లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపారు . తన వంతు సహాయంగా శ్రీ నరాల సేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు & చైర్మెన్ నరాల సత్యనారాయణ ప్రస్తుతం 5 వేల రూపాయలను ఆర్థిక సహాయం కింద అందించారని . అదేవిధంగా 30 వేల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు . ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్రస్ట్ ద్వారా బ్లడ్ క్యాంప్ లు , హెల్త్ క్యాంపులను నిర్వహించి , విద్యుత్ లేని గ్రామాలను , మంచి నీరు లేని గ్రామాలను దత్తత తీసుకోవడం జరుగుతుందన్నారు . అలాగే అనాధ శరణాలయాలను , వృద్దా శ్రమాలను సందర్శించి తగిన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తామన్నారు . పర్యావరణము , ప్రభుత్వ హాస్పిటల్స్ , ప్రభుత్వ కళాశాలలు , ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి వారికి ఆర్థిక చేయూత ఇవ్వడానికి ఈ ట్రస్టు సిద్ధం అవుతున్నారు . ఈ కార్యక్రమంలో ఇంద్రసేన కుటుంబ సభ్యులు , ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె వి కృష్ణారావు , నమా వినోద్ , ఫాసుద్దీన్ , రాజారత్నం కె అశోక్ తదితరులు పాల్గొన్నారు . శ్రీ నరాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు పొందాలి అనుకునే వారు ఈ క్రింది నంబర్ లను సంప్రదించ గలరు. 9440322840 ,9347189999 , ఖమ్మం జిల్లాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు త్వరలో మాస్క్ లు , శానిటైజర్ లు , నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు .
No comments:
Post a Comment