పేరుకు ఫోర్త్ ఎస్టేట్ …. ఎమర్జన్సీ డ్యూటీ , వేతనాలు లేని ఉద్యోగం ,భద్రత లేని బతుకులు , ఇళ్లస్థలాలు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు … చెల్లుబాటు కానీ హెల్త్ కార్డులు , అరకొరగా అక్రిడేషన్ లు స్థూలంగా చెప్పాలంటే జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని టీయూడబ్ల్యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె .రాంనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు . అందువల్ల సమస్యల సాధనకోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు . దీనిపై రాష్ట్ర నాయకత్వం చర్చించి కార్యాచరణ ప్రకటిస్తుందని అన్నారు
. హక్కుల సాధనకోసం జర్నలిస్ట్ లోకం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు . ఇళ్లస్థలకోసం అనేక మంది జర్నలిస్టులు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని చూస్తున్నారని ,తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నా వాగ్దానం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది విమర్శించారు . ఇటీవల మీడియా సమావేశంలో కేసీఆర్ మరోసారి జర్నలిస్టుల ప్రస్తావన తెచ్చి త్వరలోనే మీకు ఎమ్మెల్యేలాలు ఇళ్ల స్థలాల సమస్య తీరబోతుంది ప్రకటించారని అదే జరిగితే కేసీఆర్ కు తప్పకుండ కృతజ్నతలు చెబుతామని రానియెడల ప్రతి నియోజవర్గ కేంద్రంలో టెంట్లు వేసి ప్రభుత్వ వాగ్దానాల సాధనకోసం ఉద్యమిస్తామని అన్నారు. ఇందుకోసం పౌరసమాజం మద్దతు కూడా కోరతామని వెల్లడించారు. సమాజహితం కోరి ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టులకు నిలవనీడకోసం ప్రభుత్వం ఇంటి జాగా ఇచ్చేందుకు తాత్సరం చేయడం దుర్మార్గమని అన్నారు .
No comments:
Post a Comment