Sunday, 6 February 2022
ఘనంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవీ మహోత్సవాలు
ఖమ్మం నగరంలోని గుట్టల బజారులో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. .వేడుకలలో భాగంగా వేద పారాయణము, హెూమాలు, సూర్యనమస్కారాలు, మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, క్షీరాబ్ది వాసము, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అహింసా పరమో ధర్మ: అనే సిద్ధాంతాన్ని ఆచరించి శ్రీ వాసవీమాత ప్రపంచ మానవాళికి గొప్ప సందేశం అందించారని పలువురు పేర్కొన్నారు. ధర్మరాజు, సత్యహరిశ్చంద్రుడు తదితరులు మహాత్ములుగా నిలిచేందుకు ఆచరించిన అహింస అనే ఆయుధము శ్రీ వాసవీమాత ఆచరించి చూపారని గుర్తుచేశారు. ఆనాడు అమ్మవారు అహింసను పాటించి విశ్వమాతగా అవతరించగా కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్, భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్, దేవాలయ కమిటీ గౌరవ సలహా దారులు చెరుకూరి కృష్ణమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, దేవాలయ పాలకమండలి కోశాధికారి కొత్తమాసు హేమసుందర రావు, ఉపాధ్యక్షులు బిజ్జాల ఈశ్వరరావు, గెల్లా అమర్నాథ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు చెరుకూరి నంతోష్ కుమార్, దేవరశెట్టి పూర్ణచందర్రావు, కుమ్మరి కుంట్ల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు దుగ్గి శ్రీనివాస రావు, చెరుకూరి వెంకట శ్రీనివాసరావు, అనుమోలు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment