Saturday, 12 February 2022
మహాత్మా గాంధీ ఫౌండేషన్" సేవలు ప్రశంసనీయం- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కితాబు- కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కి పులిపాటి ఘన సన్మానం
మహాత్మా గాంధీ ఫౌండేషన్ పేరుతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశంసించారు. మహాత్మా గాంధీ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఖమ్మం స్టేషన్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ గడచిన పదేళ్లుగా మహాత్మా గాంధీ ఫౌండేషన్ పేరుతో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు ఖమ్మం నగర చరిత్రలో గుర్తుండి పోయేలా ఉన్నాయని కొనియాడారు. విద్య సాంస్కృతిక రంగాల్లో చేపట్టిన పలు కార్యక్రమాలు, అలాగే కరోనా లాక్డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని గుర్తు చేసుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్.. మంత్రి అజయ్ కుమార్ కు శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసన్నలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, 45వ డివిజన్ కార్పొరేటర్ బుడగం శ్రీనివాస్ లను పులిపాటి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవిత కళాశాల చైర్మన్ కిరణ్, జగన్నాథం గుప్తా, డాక్టర్ కావ్య చందన్ యాలముడి, గుమ్మడవెల్లి శ్రీనివాస్, రామకృష్ణ, ప్రతాప్, ప్రవీణ్, రాణి, మాధవి, జ్యోతి యాలముడి, రవీంద్ర తదితర పురప్రముఖులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment