16:02:2022 :: Hyderabad
తెరాస అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో సుపరిపాలన సాగిస్తున్న సీఎం కేసిఆర్ మరో మహాత్ముడని మంత్రి అజయ్ కొనియాడారు.
ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా జనరంజక పాలనను అందిస్తూ అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా సీఎం కేసీఆర్ ఎదిగారని పేర్కొన్నారు. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజల గుండెల్లో సీఎం కేసిఆర్ నిలిచారన్నారు.
దేశానికి నేడు తెలంగాణ దిక్సూచిగా మారిందంటే దానికి సృష్టికర్త, రూపశిల్పి ముఖ్యమంత్రి కేసీఆరేనని, "మొదట పట్టించుకోరు ఆ తర్వాత చూసి నవ్వుతారు. ఆపై యుద్ధానికి దిగుతారు అంతిమంగా మీరే విజయం సాధిస్తారని" మహాత్మాగాంధీ చెప్పిన సూక్తి సీఎం కేసీఆర్ పోరాటస్ఫూర్తికి సరిగ్గా సరిపోతుందన్నారు.
సబ్బండ వర్ణాల సమగ్ర జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం నుంచే సంక్షేమ యజ్ఞం చేస్తున్నారని ఎన్నో పథకాలను అమలుచేస్తూ ఒక పేద కుటుంబం మెరుగైన జీవితం గడిపేందుకు భరోసా కల్పిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ గడపకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని తెలంగాణ బిడ్డలు తల్లి గర్భం నుంచి భూ తల్లి ఒడిలోకి చేరే జీవిత చక్రంలోని ప్రతీ దశలోనూ సీఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాయముందన్నారు.
గర్భంలో పడ్డప్పుడు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం; 104, 108 సేవలు, ప్రసూతి దవాఖానలు, కేసీఆర్ కిట్, మగబిడ్డ అయితే రూ. 12 వేలు, ఆడబిడ్డ అయితే 13 వేల సాయం, పాలు మరిచిన క్షణం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు భోజనవసతి నడక నేర్చిన తర్వాత నాణ్యమైన ఉచిత ప్రాథమిక విద్య ఐదో తరగతి వచ్చిన తర్వాత ఉచిత గురుకుల విద్య పదో తరగతి తర్వాత ఉచిత కళాశాల విద్య, ఉపకార వేతనాలు, 12 పాసైతే ఉచిత ఉన్నత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల కళాశాలలు, ఉచిత యూనివర్సిటీ విద్య, 18 ఏండ్లు నిండి ఆడబిడ్డ పెండ్లయితే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, 21 ఏండ్ల వయస్సులో ఉచిత వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ, టాస్క్ ద్వారా విదేశాల్లో చదువంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ తదితర విషయాల్లో ప్రజలకు సీఎం కేసిఆర్ అండగా నిలిచారని అన్నారు.
పల్లె మొదలు పట్టణం దాకా వితంతువులకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు, రైతన్నకు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ఉచిత, నాణ్యమైన కరెంటు, సబ్సిడీ యంత్ర పరికరాలు, భూసార పరీక్షలు, సాదా బైనామా, నేతన్నకు సబ్సిడీ యంత్రాలు, గీత, మత్స్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, గొర్ల పంపిణీ; ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు, రుణాలు, తాజాగా దళితుల అభ్యున్నతికి దళితబంధు.. ఇలా అన్నిపక్షాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం దేశం లో ఎక్కడాలేదని, కేవలం రాష్ట్రంలోనే ఉందని ఘంటాపథంగా చెప్పవచ్చునని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.
No comments:
Post a Comment