ఖమ్మం : నగరంలో మంగళవారం మూడవ పట్టణం గాంధీ చౌక్ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద 36వ డివిజన్ కార్పోరేటర్ పసుమర్తి రాంమోహన్ రావు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచన మేరకు మొదటిరోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మేయర్ పూనుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , ఎస్.బీ.ఐటి , ఆర్జేసీ విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ లు పాల్గొని హమాలీలకు , నిరుపేదలకు , వివిధ పనుల మీద గాంధీచౌక్ ప్రాంతానికి వచ్చిపోయే వారికి సుమారుగా 300 మందికి వస్త్రాలు పంపిణీ చేశారు . తదనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులు మన కేసీఆర్ అని , వివిధ కుల వృత్తుల వరకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని , నిరుపేదలకు అండగా నిలిచిన నాయకులని కొనియాడారు . కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి , రుద్రగాని ఉపేందర్ , తోట వీరభద్రం , గజ్జల లక్ష్మీ - వెంకన్న , డోనావన్ రవి , నగర యువజన విభాగం అధ్యక్షులు దైవభక్తిని కిషోర్ , టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు షకీనా , పాషా , డివిజన్ అధ్యక్షులు వేములపల్లి వెంకన్న , సెక్రటరీ పిల్లుట్ల కృష్ణా , మామిళ్ల తిరుమలరావు , గుంటుపల్లి దివాకర్ గుప్తా , ఆకుల సతీష్ , ఏవీ రామారావు , పిల్లుట్ల వెంకన్న , గౌవ్రోజు వసంత బాబు , మిట్టపల్లి రవి , కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment