Monday, 7 February 2022

అంగరంగవైభవంగా కన్యకాపరమేశ్వరి దేవాలయంలో. గాలి గోపురం , కలశ ప్రతిష్ఠాన , గీతా మందిరము , శ్రీ కృష్ణ విగ్రహము ఆవిష్కరణ .* *పూర్ణాహుతి , హోమాలు , మహా అన్నదాన .*

ఖమ్మం కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గాలి గోపురం , కలశ ప్రతిష్ఠాన , గీతా మందిరము , శ్రీ కృష్ణ విగ్రహము  ఆవిష్కరణ,*పూర్ణాహుతి , హోమాలు , మహా అన్నదాన కార్యక్రమాలు అంగరంగవైభవంగా నిర్వహించారు.
విశిష్ట అతిథులు భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామి పాల్గొని ఆశీస్సులు అందజేయగా..
 *భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి .* 
 *గరికపాటి నరసింహారావు పుణ్య దంపతులు.కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచారు.
ఖమ్మం నగరంలోని గుట్టల బజారులో కొలువుదీరి, భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతున్న విశ్వమాత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ఉదయం నుండి వేద పారాయణము , గణపతి పూజ , పుణ్యాహవాచనము , గర్తన్యాసము , రత్నన్యాసము , బీజన్యాసము , ధాతున్యాసము తదుపరి గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి వారు గాలి గోపురం , కలశ ప్రతిష్ఠానకు శ్రీకారం చుట్టి ప్రసంగించారు . మానవజీవి తనలో ఉన్న పరమాత్మను విగ్రహరూపంలో ప్రతిష్టించి , అర్చించుటకు సంకల్పం చేసినాడని . గాలి గోపురమునకు దండం పెట్టి లోనికి వెళ్ళాలని , పాదాది | కేశపర్యంతం పరమాత్మను సేవించుట సాంప్రదాయం . కాన దేవాలయమున గాలి గోపురమునకు చాలా విశిష్టత ఉందన్నారు . రామ మందిరము , గీతా మందిరము మరియు శ్రీ కృష్ణ విగ్రహ ఆవిష్కరణను భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి ప్రారంభించి మాట్లాడారు . కృష్ణ పరమాత్మునికి ప్రధమ పూజ , కలాన్యాసము , నేత్రోన్మీలనము , దృష్టిధేను దర్శనము , దృష్టి కుంభము , కుంభాభిషేకము , మహాపూర్ణాహుతి , మంటప ఉద్వాసన , ప్రధాన కలశ ఉద్వాసన , శిఖరాభిషేకము , బ్రాహ్మణ ఆశీర్వచనము , స్వస్తి  అన్నారుతదుపరి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . అత్యధిక సంఖ్యలలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు . సాయంకాలం విజయోత్సవం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన   గరికపాటి నరసింహారావు పుణ్య దంపతులకు ఆలయ పాలకమండలి పక్షాన ఆత్మీయ సత్కారం చేశారు . అనంతరం వారు ప్రసంగించారు . తదుపరి అంతర్జాతీయ వైద్య ప్రముఖులు , శ్వాసకోస నిపుణులు డాక్టర్‌ గెల్లా విశ్వనాధ్ కు ఆలయ నిర్వాహకులు సన్మాన పుష్పమాలికలు అందించారు . ఈ సందర్బంగా ఆలయ పాలకమండలి చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి భారతీయ ఆర్ష , ధర్మ ప్రవర్తకులు , సనాతన వైదిక , ధర్మ పరిరక్షకులుగా శ్రీ కమలానంద భారతీ స్వామి వారి ముద్ర అగ్రగణ్యం . హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపక ధీశాలిగా, దేవాలయ సంస్కృతీ పరిరక్షణ ధురీణులుగా , ఎనిమిది వేలకు పైగా గ్రామాలను పర్యటించి , నడిచే ధర్మరక్షణ చేస్తున్న దేవుడు , మన ధార్మిక వ్యవస్థను పటిష్ఠం చేసుకునేందుకు మనమంతా స్వామి వారి అనుగ్రహ భాషణం కావాలన్నారు . విశ్వజనీనమైన భగవద్గీతను సంగీతభరితంగా , తాత్పర్యసహితంగా , పలుభాషలలో రికార్డుచేసి , గీతాప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన “గీతాగాన తపస్వి" బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి అని కొనియాడారు . అవధాన ప్రసంగ ప్రవచన మధుదారలతో సాహితి సరస్వతికి మంగళాభిషేకం చేసిన పండిత శ్రేష్టులు , కవివరేణ్యులు , ప్రవచన కిరీటి , తెలుగు కవి , మహాసహస్రావధాని శ్రీమాన్ గరికపాటి వారి ప్రసంగం ఆస్వాదించటం మన సుకృతమని , జాతిని జాగృతం చేస్తున్న భారతీయ మహాజ్ఞాన సింహం , శ్రీ గరికపాటి నరసింహం వారి ప్రవచన సౌరభాలను అమ్మసన్నిధిలో ఆస్వాదిద్దాం మనందరి అదృష్టమన్నారు . ఈ కార్యక్రమంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ , దేవాలయ కమిటీ గౌరవ సలహా దారులు చెరుకూరి కృష్ణమూర్తి , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు , దేవాలయ పాలకమండలి కోశాధికారి కొత్తమాసు హేమసుందర రావు , ఉపాధ్యక్షులు బిజ్జాల ఈశ్వరరావు , గెల్లా అమర్నాథ్ , ఆర్గనైజింగ్ సెక్రెటరీలు చెరుకూరి నంతోష్ కుమార్ , దేవరశెట్టి పూర్ణచందర్రావు , కుమ్మరి కుంట్ల శ్రీనివాసరావు , సహాయ కార్యదర్శులు దుగ్గి శ్రీనివాస రావు , చెరుకూరి వెంకట శ్రీనివాసరావు , అనుమోలు రమేష్ , తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment