Khammam/06.03.2022
---------------------------
మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మహిళాబంధుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 6,7,8 తేదీల్లో చేపట్టే కార్యక్రమాల్లో మహిళల కోసం చేపడుతున్న పథకాల గురించి తెలియజేస్తూ, మహిళాబంధుగా కేసిఆర్ గారికి రాఖీలు కడుతూ వేడుకలు పెద్ద ఎత్తున చేపట్టాలని, మహిళలంతా ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8వ తేదీన పురస్కరించుకుని మూడు రోజుల పాటు వేడుకలు చేపట్టాలని రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటిఆర్ గారి పులుపు మేరకు ఖమ్మంలో మహిళా కమిటి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క రోజే మహిళల రోజు కాదు.. ప్రతి రోజు మహిళా రోజే అని అన్నారు.
భగవంతుడు అంతటా ఉండలేక తన రూపంలో మహిళను సృష్టించాడని పేర్కోన్నారు.
సమాజంలో సగ భాగం మహిళలు అని, వారి కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారు అనే గొప్ప సంప్రదాయం మనది.. పూజించబడేదానిలో అత్యధికంగా శక్తి స్వరూపులైన దేవతలు ఉన్న సంప్రదాయం మనది అని అన్నారు.
ఎందెందు వెతికినా అందందు మహిళ ఉంది.. మహిళలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని సీఎం కేసిఆర్ గారు నమ్మి అలాంటి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలు మహా రాణులు. అని వ్యాఖ్యానించారు.
మంచి నీళ్లు అందించే దగ్గర నుంచి అద్భుతాలు సృష్టించే వరకు వారికి ఈ ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది.
మహిళ కుటుంబంలో, సమాజంలో అన్ని రకాలుగా వివిధ స్థాయిల్లో తన పాత్ర అద్వితీయంగా పోషిస్తుందని, గత ప్రభుత్వాల్లో మహిళ అనుకున్న పురోగతి సాధించలేదు అని గుర్తించిన సీఎం కేసిఆర్ గారు మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.
మహిళలు సాధించిన అభివృద్ధి, వికాసం కొలమానంగానే సమాజం సాధించిన ప్రగతిని నేను అంచనా వేస్తానన్న.. అన్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ గారి మాటలను అనుసరించి సీఎం కేసిఆర్ గారు ఆడపిల్ల పుడితే తెలంగాణలోనే పుట్టాలి అన్న విధంగా ఇక్కడ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారని, వాటి ఫలితాలు నేడు మనం అనుభవిస్తున్నామన్నారు.
మహిళల రక్షణ, పోషణ కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యం అని నమ్మి ఆరోగ్య లక్ష్మి, భరోసా కేంద్రాలు, షి-టీమ్స్ పథకాలు నడిపిస్తున్నామని..
ఆడపిల్ల గురించి ముందు తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన సీఎం కేసిఆర్ గారికి రుణపడి ఉంటామన్నారు.
మహిళా దినోత్సవం ఒక్క రోజు చాలదు.. మూడు రోజులు జరుపుకోవాలి అని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు చెప్పారు.. ఆ మేరకు ప్రణాళిక రూపొందించి మూడు రోజుల కార్యక్రమాలను జరుపుకోవాలని తలచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపకుంటామన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకోవాలని కొరారు.
మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేశారని, మహిళలు ఎంతటి సవాళ్లను అయినా ఎదుర్కొని భవిష్యత్ ను బంగారు బాటగా మార్చుకోవాలని కోరారు.
మహిళలు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాల గురించి ఈ దినోత్సవం జరుపుకుంటున్నమని, సమాజం అభివృద్ధి జరగాలంటే మహిళలు, పురుషులు సమానంగా ఉండాలన్నారు.
సీఎం కేసిఆర్ గారు మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు... వాటిని సద్వినియోగం చేసుకుని నిరూపించాలని కోరారు.
మహిళల రక్షణ కోసం ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్ గారు భరోసా కేంద్రాలు, షి-టీమ్స్ పెట్టారని, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించారన్నారు.
గృహ హింస చట్టం, పోక్సో చట్టం, నిర్భయ చట్టం, తప్పనిసరి వివాహ నమోదు చట్టం, లింగా నిర్దారణ నిషేధ చట్టం ఉన్నాయని, వీటిపై చైతన్యం పెంచుకుని వాటిని వినియోగించుకోవాలని
కోరారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా సీఎం కేసిఆర్ మహిళలకు లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం, మమత ఆసుపత్రి మైదానంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక లక్ష 116 గాజులతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి భారీ చిత్రాన్ని రూపొందించారు.
అనంతరం మానవహారంగా భారీ చిత్రం చుట్టూ మహిళలు నిలబడి కేసీఆర్ జయహో, థాంక్యూ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.