Friday, 18 March 2022

ఏప్రిల్ 9నుండి ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

*ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు*

తిరుమల తిరుపతి దేవస్థానములు  ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 9 వతేది నుంచి 19 వ తేదీ వరకు జరగనున్నాయి 
9 వతేది శనివారం ఉదయం దీక్షా తిరుమంజనం సాయంత్రం అంకురార్పణ

10 వ తేదీ ఆదివారం ఉదయం ధ్వజారోహణం సాయంత్రం శేషవాహన సేవ

11 వతేది సోమవారం ఉదయం వేణుగాన అలంకారం స్నపన తిరుమంజనం సాయంత్రం హంస వాహన సేవ

12 వతేది మంగళవారం ఉదయం వటపత్రసాయి అలంకారం సాయంత్రం సింహ వాహన సేవ

13 వతేది బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారం సాయంత్రం హనుమంత వాహన సేవ

14 వతేది గురువారం ఉదయం మోహిని అలంకారం సాయంత్రం గరుడ సేవ

15 వతేది శుక్రవారం ఉదయం శివ ధనుర్భాణ అలంకారం సాయంత్రం సీతారామ కల్యాణోత్సవం గజావాహన సేవ

16 వతేది శనివారం రధోత్సవం
17 వతేది ఆదివారం ఉదయం కాళియ మర్దన అలంకారం సాయంత్రం అశ్వ వాహన సేవ

18 వతేది సోమవారం ఉదయం చక్రస్నానం

19 వ తేదీ మంగళవారం సాయంత్రం పుష్పయాగం 

దేవదేవుడు శ్రీకోదండరామస్వామి దర్శనం సర్వపాప హారణం బ్రహ్మోత్సవాలు తిలకించి తరించండి

No comments:

Post a Comment