Wednesday, 30 March 2022

ఆర్యవైశ్య మెరిట్ విధ్యార్థులకు పసుమర్తి రామ్మోహన్ రావు చేయుత...

ఖమ్మం : మూడో పట్టణం గాంధీ చౌక్ నగరంలో ఉమెన్స్ కాలేజీ బ్యాక్ సైడ్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీ నీలం మౌనిక కు నిత్యావసర సరుకులు పంపిణీ , 
4 అంగన్ వాడీ స్కూళ్లకు 12 కుర్చీలు వితరణ , రాయల సతీష్ బాబు , ఈగ భరణి కుమార్ స్థాపించిన ఎంబీబీఎస్ కాలేజీలో మెరిట్ సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులు మైలవరపు పునీత , మైలవరపు రాగంజలి, బూతు కృష్ణసాయి , మద్ది ధరణి లను ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించారు . అనంతరం వారు మాట్లాడుతూ 45 మంది విద్యార్థులు ఒక చిన్న సంస్థ నుంచి మెడికల్ ఎం బి బి ఎస్ చేయడానికి గవర్నమెంట్ కాలేజీలో అర్హత సాధించినందుకు మనకు ఎంతో గర్వకారణం అన్నారు . ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకటేశ్వర్లు ,  గుంటుపల్లి దివాకర్ , ఆకుల సతీష్ , ఆత్మకురి రామారావు , గరాని రవి , వందనపు హరికృష్ణ , బచ్చు మురళీకృష్ణ , తిరుమల బుక్స్టాల్ హరి , డివిజన్ అధ్యక్షుడు పిల్లుట్ల కృష్ణ , నేరెళ్ల ఉపేందర్ , టీచర్లు అలివేలు , అంజూర , రాజ్యలక్ష్మి  , నాగమణి తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment