Sunday, 27 March 2022

ఉత్సహంగా షీ టీమ్స్ రన్.... ముఖ్య అతిధిగా పువ్వాడ అజయ్. ఉత్సహం నింపిన కలేక్టర్ : గౌతమ్. సి.పి : విష్ణు వారియర్

ఖమ్మం :  తేది : 27.03.2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మహిళల భద్రత, జెండర్ ఈక్వాలటీ పై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన షీ-టీమ్స్ 2k,5k రన్ ను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గోని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా షీ-టీమ్ లు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. నేరగాళ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం  తీసుకున్న కఠినమైన నిర్ణయాలతో మహిళలపై ఆకతాయిలు, పోకిరీల అగాయిత్యలు, చోరీలు తగ్గిపోయాయని అన్నారు.ఖమ్మంకు పోలీస్ కమిషనరేట్ తీసుకురావాలని నాడు అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్ళి సాదించుకున్నామన్నారు. 
అభివృద్ధి దిశగా పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో... రక్షణ కోసం  ప్రధాన సంపత్తిగా మారిన సీసీ కెమెరాలతో ఒక పక్క నేరాలను అదుపు చేయడం.. మరో పక్క నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో తమ వంతు పాత్రను పోషిస్తూ.. ప్రజల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. 
మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మ‌హిళ‌ల‌కు నిరంత‌రం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జెండ‌ర్ ఈక్వాలిటీ కోసం ఈరోజు ర‌న్‌ను నిర్వ‌హించ‌డం అభినందనీయమన్నారు..
జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ మాట్లాడుతూ ఇటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ప్రజా భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ...ప్రజా సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో  ఉత్సాహంగా వామప్ ,రన్ లో పాల్గొన్నారని అన్నారు. 
పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ మాట్లాడుతూ .. నగరంలో 10 వేల సీసీ కెమెరాలతో నిఘా నీడల్లోకి తీసుకొచ్చి  ఇరవై నాలుగు గంటలూ మనం వేసే ప్రతి అడుగూ సీసీటీవి ఫుటేజీల్లో భద్రం అయ్యేలా ప్రణాళిక సిద్ధం  చేసి అమలు చేస్తున్నట్లు   తెలిపారు.
అనంతరం రన్ పూర్తి చేసిన వారిని మంత్రి పువ్వాడ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. 
కార్యక్రమంలో నగర మేయర్ నీరాజ, మున్సిపల్ కమిషనర్ ఆధర్శ్, కుడా చైర్మన్ విజయకుమార్, డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ గౌష్ అలమ్, సుభాష్ చంద్ర బోస్ ,కుమారస్వామి , ఏసీపీలు స్నేహ మెహ్రా ,రామోజీ రమేష్ ,అంజనేయులు, భస్వారెడ్డి, వేంకటేశ్, ప్రసన్న కుమార్ , రామనుజం, వేంకటస్వామి, విజయబాబు, సిఐ అంజలి పాల్గొన్నారు.

                

No comments:

Post a Comment