ఖమ్మం: స్థానిక కన్యకాపరమేశ్వరి దేవ్యాలయములో జరిగిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ఆదివారం ఉ. 9గం.ల నుండి సా.4 గం.ల వరకు కొనసాగాయి. తొలిసారిగా జిల్లా లో జరుగుతున్న ఆర్యవైశ్య జిల్లా అధ్యక్ష పదవికి ప్రత్యక్ష ఎన్నికలలో అత్యధిక ఓట్లు పోలవడం సంచలన విషయం గా జిల్లా వాసులు పేర్కొంటున్నారు.. ముఖ్యంగా అధ్యక్ష పదవికి అయిదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నా, వనమా వేణుగోపాల రావు మరియు కొదుమూరి మధుసూధన్ మధ్యనే విజయం దోబూచు లాడి, చివరకు ఓట్ల మెజార్టీతో వనమాను వరించింది. రాజకీయంగా, సామాజిక సేవా పరంగా ఎంతో అనుభవం కలిగిన వనమా వేణు గారు ఈ ఎన్నికల సమయంలో, వయసును కూడా లెక్క చేయకుండా జిల్లా వ్యాప్తంగా కలియతిరిగి ఓటర్లను కలిశారు. తాను చేసిన సేవలను, గెలిచిన తరువాత చేయబోయే కార్య క్రమాలను జిల్లా ఓటర్లకు అర్థమయేటట్లు చెప్పగలగడం విశేషం. స్థానిక వాసవి జర్నలిస్ట్ ఫోరమ్ నిర్వహించిన, అభ్యర్థుల ముఖాముఖి కార్యక్రమంలో ధైర్యంగా పాల్గొని, విలేఖరులు సంధించిన పలు ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పారు. జీవితాంతం తాను ఆర్యవైశ్యుల అభివృద్ధికై కృషి చేస్తానని చెప్పిన మాటలే ఈ రోజు వారి గెలుపుకు దోహదం చేశాయి.
*అభ్యర్ధుల ఓట్ల వివరాలు..*
----------------------------------------
1 వనమా వేణుగోపాల రావు..193
2 కొదుమూరి మధుసూధన్.. 183
3 కొదుమూరి జగన్నాథం........ 63
4 పెనుగొండ ఉపేందర్ ............17
5 కుంచం కృష్ణా రావు............. 17
🟥©️🟨©️🟫©️🟥©️🟨©️🟫©️
No comments:
Post a Comment