Monday, 28 March 2022

నెల నెల వెన్నెల పునః ప్రారంభం... అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు...

ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి  ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున నెల నెలా వెన్నెల సాంస్కృతిక వేడుక పునః ప్రారంభమైంది. ఆర్గనైజర్లు అన్నాబత్తుల సుబ్రమణ్య కుమార్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు వి వి అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  ఖమ్మం కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగబత్తినరవి , రవి మారుత్, దేవేంద్రం, సదానందం, ప్రముఖ జానపద గాయకులు మోదుగు గోవిందు పాల్గొన్నారు. సభానంతరం కుమార్ మీనా బృందం నృత్యాలు, జరుగుతున్న కథ నాటక ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.

No comments:

Post a Comment