Tuesday, 8 March 2022

సస్పెన్షన్ ఎత్తివేసి సీఎం క్షమాపణలు చెప్పాలి



ఖమ్మం : నగరంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దొడ్డ అరుణ బడ్జెట్ మాట్లాడుతూ సమావేశాలకు రాష్ట్ర ప్రథమ మహిళ గవర్నర్ ను ఆహ్వానించకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నందుకు గాను  క్షమాపణలు చెప్పి , వెంటనే  బిజెపి శాసన సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు . విపక్షం లేకుండా ఏకపక్షంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం నిరంకుశ పాలనను తలపిస్తుంది అన్నారు . మహిళా దినోత్సవం సందర్భంగా నే మహిళా గవర్నర్ అవమానపరచడం సిగ్గుచేటన్నారు . ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి , సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు .అన్ని రంగాలలో మహిళను ముందంజలో నడిపిస్తానని చెబుతూ మహిళల అభివృద్ధికి కొరకు పాటుపడుతుందని కల్లబొల్లి కబుర్లు చెబుతూ మహిళను మోసం చేస్తున్నారని  ఆరోపించారు . బడ్జెట్ సమావేశాలలో ప్రథమ మహిళ గవర్నర్నే గౌరవించలేని కెసిఆర్ గారు అంతర్జాతీయ మహిళను ఏ విధంగా గౌరవిస్తారని విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు . ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి అనిత , మహిళా మోర్చా ఇంచార్జీ గెంట్యాల విధ్య సాగర్ , మహిళా మోర్చా సొషల్ మీడియా జిల్లా కన్వీనర్ దొడ్డా భవాని , మహిళా మోర్చా అర్బన్ అధ్యక్షురాలు సుగుణ , జిల్లా కార్యవర్గ సభ్యురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment