Monday, 21 March 2022

ఘనంగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ జన్మదిన వేడుకలు...

Dt:21/03/2022
Khammam.
ఖమ్మం మున్సిపల్ కమిషనర్,సుడా వైస్ చైర్మన్ ఆదర్శ్ సురభి IAS జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఖమ్మంలోని మేయర్ ఛాంబర్ లో మేయర్ పునుకొల్లు నీరజ కేక్ కట్ చేసి కమిషనర్ కు మిఠాయిలు తినిపించారు...మహాత్మాగాంధీ ఫౌండేషన్ అద్యక్షులు, సుడా డైరెక్టర్ డాక్టర్ పులిపాటి ప్రసాద్ కమిషనర్ ఆదర్శ్ సురభికి శాలువా కప్పి బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార లు కూడా  కమిషనర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరి,కార్పొరేటర్లు రావూరి కరుణ,దోరేపల్లి శ్వేత,రుద్రగాని శ్రీ దేవీ,పల్లెపు విజయ,పాకలపాటి విజయనిర్మల,దాదే అమృతా,మక్బుల్,పసుమర్తి రామ్మోహన్,సుడా డైరెక్టర్లు జీకొల్లు పద్మ,ముక్తార్, సంజీవరెడ్డి,నాయకులు శౌకత్ అలి,రుద్రగని ఉపేందర్,జని తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment