Wednesday, 23 March 2022

జస్ట్ పర్ లివింగ్ సంస్థకు అడిషనల్ ఎస్పీ ప్రశంసలు.. .ఐదు సూత్రాలు పాటిస్తే విజయం మీదే నంటూ విధ్యార్థులకు సూచనలు...


 జస్ట్ పర్ లివింగ్ సంస్థకు మహాబూబాబాద్ #అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్..* *#TUWJ(IJU) మహాబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్..లతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
 * నిట్ లో 321ర్యాంక్ సాదించిన *పావణికి రూ.15వేల ఆర్ధికసహాయంతో పాటు డోర్నకల్బ్బై ప్రభుత్వ హైస్కూలు పదవతరగతి విధ్యార్థులకు ప్యాడ్ లు, పెన్నులు సంస్థ సమకూర్చగా  అడిషనల్ ఎస్పీ  పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడారు...తాను బీహార్ లో హాస్టల్ లో వుండి చదువుకున్నరోజులను యోగేష్ విధ్యార్థులతో ప్రస్తావించారు.. హాష్టల్లో వున్న సమయంలో ఓ గురువు తమకు చెప్పిన కధను ఆయన గుర్తు చేసుకున్నారు.. కాకి లాగా లక్ష్యం సాదించేందుకు కృషి చేయాలని చెబుతూ కడవ అడుగున  నీటిని పైకి తెచ్ఛేందుకు కాకి ..చెపల వేటలో కొంగలు చూపిన తెలివిని విధ్యార్థులు కలిగి వుండాలన్నారు..ఐదు గుణాలను విధ్యార్థులు కలిగి వుంటే విజయం వారికి సొంతం అని నొక్కి చెప్పారు..వివరాల్లోకి వెళితే
 *సాటిమనిషికి సహాయం చేయాలనే సంకల్పంతో జస్ట్ పర్ లివింగ్ సంస్థను నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గండి సీతరాంగౌడ్-గీత దంపతులు అభినందనీయులని మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ అభినందించారు.*  నిట్ లో 321వ ర్యాంక్ సాదించి పీజులు చెల్లించేందుకు ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కుంటున్న *మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంకు చెందిన గోళి పావణి విషయం తెలుసుకున్న జస్ట్ పర్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు గండి సీతరాంగౌడ్-గీత దంపతులు స్పందించారు..* పావణిని డోర్నకల్ కు ఆహ్వనించి ఘనంగా  సత్కరించారు.  *రూ.15వేల ఆర్థికసహాయాన్ని అందజేసారు.* డోర్నకల్ ప్రభుత్వ పాఠశాలలో *పదవతరగతి చదువుతున్న సుమారు డెబ్బైమంది విద్యార్థులకు పరీక్షల కోసం ప్యాడ్, పెన్నులను ఈ..సందర్భంగా అందజేశారు.* ఈ..కార్యక్రమంలో *ముఖ్యఅతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ విద్యార్ధులను ఉద్దేశించి స్పూర్తిదాయక ప్రసంగం చేసారు.* పదవతరగతి విద్యార్థులందరితో మాట్లాడి సరదాగా వారితో గడిపారు. పావణి చదువు విషయంలో ఖచ్చితంగా తమవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ..కార్యక్రమంలో డోర్నకల్ సిఐ శ్రీనివాస్,  సినీయర్ జర్నలిస్ట్ కొమ్కమార్, పాఠశాల ప్రదానోపాద్యాయురాలు, ఉపాద్యాయబృందం పాల్గొన్నారు.

No comments:

Post a Comment