Monday, 30 May 2022

*ఉత్తమ జర్నలిస్ట్‌ పురస్కారాన్ని అందుకున్న ‘వనం..


ఖమ్మం-మే30
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు వనం వెంకటేశ్వర్లు రాష్ట్ర 
 స్ధాయి ఉత్తమ జర్నలిస్ట్  పురస్కారాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా   హైదరాబాదులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు 
.సీనియర్ జర్నలిస్ట్ ,మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమీషన్ సభ్యులు ఆర్. సత్యనారాయణ స్ధాపించిన ‘ఆర్ ఎస్ ఎన్  సేవా ఫౌండేషన్ ’ సమాజ హితాన్ని కాంక్షిస్తూ  కలాలను పదునెక్కిస్తున్న పాత్రికేయులను ప్రోత్సహించడానికి ,పత్రికల్లో రోజు రోజుకు తగ్గిపోతున్న మానవీయ కథనాలను పెంచడానికి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ   కథనాలను ఆహ్వానించి అందులో మానవీయ కథనాలను రాసిన వారిని ఉత్తమ జర్నలిస్ట్ లుగా ఎంపిక చేశారు.  ఈ అవార్డును సోమవారం హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు 
చేతుల మీదుగా అందుకున్నారు
ఈ కార్యక్రమంలో  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు)జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి,
తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు డా నందిని సిద్దారెడ్డి,టిపిఎస్ సి మెంబర్ కారం రవీందర్ రెడ్డి,తెలంగాణ బేవరేజెస్ మాజీ చైర్మన్ జి దేవిప్రసాద్ రావు,టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఆర్ ఆర్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ చైర్మన్ ఆ సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ హైదరాబాద్  ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్ 
టీయూడబ్ల్యూజే నాయకులు శంకర్
దితరులు పాల్గొన్నారు 
 ‘మన తెలంగాణ ’ దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ గా కొనసాగుతున్న వనం 
వనం వెంకటేశ్వర్లు తన జర్నలిజం కేరిర్ లో ఇప్పటికి పలు మార్లు ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపికయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం చే మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు.2003లో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రజాశక్తి దిన పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు మోటూరు హన్మంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్  అవార్డును అందుకున్నారు.అదేవిధంగా 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చే 
బి. నాగేశ్వర్ రావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు(రూ.2లక్షల క్యాష్ అవార్డు)ను,2008లో  రాష్ట్ర ప్రభుత్వం చే  ఎం. నర్సింగరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు(రూ.1లక్ష క్యాష్ అవార్డు)ను,2012లో విశాఖ పట్టణంలోని ఆర్పిత స్వచ్చంద సేవా సంస్ధ చే ‘ఆంధ్ర రత్న’ అవార్డును,2013 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం పర్యటక శాఖ చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు.అదేవిధంగా 2007 లో ‘వార్త’ దిన పత్రిక యాజమాన్యంచే ఖమ్మం జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును,1989లో నల్లగొండ జిల్లాలో ప్రజాపోరు సాయంకాల దినపత్రిక యాజమాన్యంచే బెస్ట్ జర్నలిస్ట్ అవార్డును,1994లో నల్లగొండలోని గాంధి సేవా సమితి చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు  వార్త దినపత్రికలో ఖమ్మం,హైద్రాబాద్,న్యూఢిల్లీ ,సూర్యాపేటలోపనిచేశారు.నల్లగొండ లో ఆంధ్రభూమి,ఈనాడు,ప్రజాపోరులో పనిచేశారు .దాదాపు 20 ఏళ్ల పాటు వార్త దిన పత్రికలో ప పనిచేసిన ఆయన ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రికకు ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. ఇటివలనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యు జె  ఐజెయు)ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు

Friday, 27 May 2022

ఆ కానిస్టేబుల్ జీవుడిలో దేవుని చూశాడు.. ఆ బాలుడు బతుకు జీవుడా అనుకున్నాడు....


దేహో దేవాలయే..జీవోదేవో సనాతనః అన్నారు.. దానిని ఆ కానిస్టేబుల్ చేతల్లో చూపాడు..
నేల మండుతోంది, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.
నా దగ్గర బూట్లు ఉన్నాయి, వచ్చి నా పాదాలపై అడుగు పెట్టు.
-- సెల్యూట్ రంజిత్ .
ఈ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పేరు రంజిత్ సింగ్. ఇద్దరు పిల్లలు రోడ్డు దాటుతుంటే సిగ్నల్ ఆఫ్ చేయబడింది   ఇద్దరు పిల్లల్లో ఒకరికి చెప్పులు లేవు పాదాలు కాలిపోతున్నాయి. పిల్లవాడు చెప్పాడు -  పాదాలు  కాలిపోతున్నాయి,  రంజిత్ అన్నాడు - ట్రాఫిక్ ఆగే వరకు నా  బూట్లు మీద నిలబడు  అన్నారు..
 రంజిత్ సింగ్ తన ఫేస్‌బుక్‌లో ఇలా వ్రాశాడు - ఆ పిల్లవాడు నా పాదాలపై అడుగు పెట్టగానే, దేవుడు నాపై అడుగు పెట్టినట్లు అనిపించింది. చెప్పులు కొని ఇచ్చాను కానీ ఈనాటి అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది..!!


Wednesday, 25 May 2022

హనుమాన్ జయంతి సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలు : పాల్గొన్న ట్రాఫిక్ సీఐ అంజలి...పంచామృతంతో స్వామివారికి అభిషేకం అనంతరం మహా అన్నదానం*


ఖమ్మం : బుధవారం ప్రభావత్ టాకీస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న భక్త ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు ,  పూజలు నిర్వహించారని , అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారని , ప్రత్యేక అలంకరణతో స్వామివారు వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు గట్టు హరీష్ శర్మ పేర్కొన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ సీఐ అంజలి మేడం పాల్గొని మాట్లాడారు స్వామి వారికి అంగరంగ వైభవంగా సింధూరార్చన , సహస్రనాగవల్లి దళార్చన , తమలపాకుల పూజ , మంగళహారతి , మంత్రపుష్పంలతో స్వామివారికి పూజలు చేపట్టారని , శివుని అంశ వాయు పుత్రుడు , అర్జునుడికి ప్రియ సఖుడు , శ్రీరామదాసుడుకి ఎర్రని కన్నులుగలవాడు , సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు , సాగరాన్ని దాటినవాడు , లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు అని అన్నారు .ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గట్టు హరీష్ శర్మ మాట్లాడుతూ మహా అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 3500మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారన్నారు . బుద్ధిర్బలం , యశోధైర్యం , నిర్భయత్వం , అరోగతా అజాడ్యం , వాక్పటుత్వం గలవాడు హనుమంతుడని తెలిపారు .

Monday, 23 May 2022

తిరుమల శ్రీవారికి కర్ణాటక వారు లారీ విరాళం

తిరుమల శ్రీవారికి కూరగాయల రైతులు లారీని విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని ముళబాగల్ మాజీ ఎమ్మెల్యే జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని తిరుమల,తిరుమపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి అందజేశారు

. ఈ మేరకు లారీ తాళంచెవులను ఆయనకు అందజేశారు.టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కార్యక్రమంలో టీటీడీ అన్నప్రసాదం, దాతల విభాగం డిప్యూటీ ఈఓ పద్మావతి, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Friday, 20 May 2022

పద్మావతి అమ్మవారికి పుట్టింటి చీరే - సారే సమర్పించిన పద్మశాలీయులు..


*చిత్తూరు జిల్లా, నారాయణవనంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా... జరుగుతున్న కల్యాణోత్సవాన్ని  పురస్కరించుకొని... ఈరోజు అనగా 20 మే 2022 శుక్రవారం రోజున... పద్మశాలీయుల  ఆడపడుచు అయిన పద్మావతి అమ్మవారికి "తిరుమల తిరుపతి దేవస్థానం" వారి అధికార లాంఛనాలతో భావనారుషి దేవస్థానం నుండి ఊరేగింపుగా  మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఆనందోత్సవాల మధ్య పద్మశాలీయులు చీరె - సారే సమర్పించారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన... ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, ప్రముఖ వస్త్ర వ్యాపారి శ్రీ.నక్కా వెంకటేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సేవా సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వెంకటగిరి మున్సిపల్ 6 వ వార్డు కౌన్సిలర్ శ్రీ. మాడా జానకిరామయ్య, డాక్టర్ శ్రీ.ఎస్.వి.  ప్రసాద్,శ్రీ. మడతనపల్లి, ఓబుళపతి,  ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి. విజయలక్ష్మి, శ్రీమతి సరళాదేవి,  శ్రీ.పడిదం మోహన్, శ్రీ. నూకల శ్రీనివాసులు, పద్మశాలీయుల ఆడపడుచులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.*
✍🏼
*కె.రమాకాంత్,*              
*సీనియర్ జర్నలిస్ట్,*           *వెంకటగిరి సామాన్యుడు,*                   *సోషల్ మీడియా,*          *ఆంధ్రప్రదేశ్.*

సమాజం స్వఛ్చమైన పాత్రీకేయాన్ని కోరుకుంటోంది : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి.



ఖమ్మం మే 20 : అవినీతి అన్ని రంగాల్లో వున్నాప్పటికి సమాజం పత్రిక రంగం స్వచ్ఛతను కోరుకుంటున్నట్లు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. వ్యవస్ధలో నాల్గవ స్ధంభంగా వున్న ప్రతి జర్నలిస్ట్ పై మోయలేనంత నిందలు మోపుతున్నారని ఆయన అన్నారు.దీనికి ప్రభుత్వాలే కారణమంటూ  పలు అంశాలను ఆయన  ప్రస్తావించారు..
టియుడబ్ల్యుజె ఐజెయు ఖమ్మం జిల్లా మూడవ మహాసభ శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం లోని టి సి వి రెడ్డి ఫంక్షన్ హాల్లో అమర్ నాథ్ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు నర్వనేని వెంకట్రావ్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలను కె శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ జర్నలిజంపై ప్రజల్లో,అధికారుల్లో,రాజకీయనేతల్లో ఉన్న భావనలను గమనంలోకి తీసుకున్నప్పుడు అందరివేలు జర్నలిస్టుల వైపే ఎందుకు చూపుతున్నారనే అంశంపై పాత్రికేయులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం నేడు ఏర్పడిందన్నారు . సద్వివిమర్శను స్వీకరించే ధైర్యం లేకపోతే ఈ వ్రతిలో కొనసాగలేమన్నారు.అయితే మిగిలిన మూడు స్ధంబాలైన కార్యనిర్వహక   ,న్యాయవ్యవస్ధలో అవినీతి లేదా అంటే ఖచ్చితంగాఉందని కాని అందరి వేలు జర్నలిస్టులవైపు ఎందుకు చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.ఇది ఉద్దేశ్యపూర్వకంగా ,వ్యూహాత్మకంగా జరుగుతున్న కుట్ర అని ఆయన అన్నారు
జర్నలిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం వేతన చట్టాన్ని తీసుకోచ్చిందని దాని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని , ఈచట్టం అమలవుతే జర్నలిస్టులపై ఉన్న నింద పడే అవకాశం ఉండదన్నారు.ఇటివల కార్మిక  శాఖ అధికారిని జర్నలిస్టుల వేతన చట్టం అమలు శాతం ఎంత అని అడిగితే 22శాతం మాత్రమే అమలవుతుందని సమాదానం ఇచ్చారని ఆయన అన్నారు.వేతన చట్టాలు అమలు కాకపోతే జర్నలిస్టులు  ఏం తిని బ్రతకాలని ఆయన ప్రశ్నించారు.అందుకేజర్నలిస్టులపై వచ్చే నిందలకు ప్రభుత్వాలే కారణమన్నారు.మరోవిధంగా పత్రికాయజమాన్యాలు కూడా కారణమవుతున్నాయన్నారు.మీడియా స్వేచ్చకు రాజ్యంగంలో ఏమి పొందపర్చలేదా అంటే లేదనాలి దీనికి కారణం కూడా ఉందన్నారు. మీడియా అంటే ప్రజల భావాలను ప్రతిబింబించేలా వార్తలు రాసేది అలాంటి దాని విషయంలో రాజయంగంలో స్వేఛ్చ కోసం పొందు పర్చితే మళ్ళీ దానిపై అజమాయిషి చేసేందుకు మరోవ్యవస్ధ్యను ఏర్పాటు చేయాల్సి వస్తుందని చేయలేదన్నారు. అలా చేస్తే అధికారంలో పార్టీలు దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని రాజ్యంగ నిపుణులు ఆలోచించినట్లు ఉందన్ని అయితే
ప్రాథమిక హక్కుల్లో చేర్చారని ఆయన తెలిపారు. ఆర్టికల్ 119 లో భావ ప్రకటన స్వేఛ్చ అంటే ప్రజల మనోభావాలు ప్రతిబింబించే వార్తలు రాయలన్నారు. అవినీతి రోపణలు రాకుండా మనం మారాలన్నారు.1954.56లో వర్కింగ్ జర్నలిస్టు యాక్ట్ తెచ్చారని పేర్కొన్నారు. కేంద్రం 40 కార్మిక చట్టాలను  వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని రద్దు చేసిందన్నారు. కొత్తగా 40 మంది సభ్యులతో కమిటీ వేశఆరని  సబ్ కమిటీ సిఫారస్ లమేరకు అమల్లోకి తెస్తామమంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడ్తూ జర్నలిస్టుల ఇళ్ళ సమస్య పరిష్కరానికి తన వంతుగా క్రషి చేస్తానని హామి ఇచ్చారు.జర్నలిస్టులకు రాజీవ్ స్వగ్రహ ఇళ్ళ కేటాయింపు తోపాటు జర్నలిస్టుల హెల్త కార్డుల విషయాన్ని తాను ముఖ్యమంత్రి ద్రష్టికి తీసుకేళ్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు విద్యా,వైద్య సౌకర్యాలు ప్రభుత్వ సంస్ధలో పొందేవిధంగా ప్రజలను పాత్రికేయులు చైతన్యవంతులను చేయాలని కోరారు.మారుమూల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వహాయంలో విద్యా,వైద్య రంగంలో విప్లవాత్మక మార్పలు వచ్చాయని వాటిని ప్రజలు సద్వీనియోగం చేసుకునే విధంగా వార్త కధనాలు రావాలని కోరారు.దీని వల్ల ప్రజల ఆర్ధిక భారం నుంచి కాపాడినవారంఅవుతామని ఆయన అభిప్రాయపడ్డారు.
సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ మాట్లాడ్తూ జర్నలిస్టుల సమస్యల సాధనకు తన వంతుగా క్రషిచేస్తామన్నారు. ఇళ్ళ స్ధలాలు,హెల్త కార్డులు,అక్రిడేషన్  కార్డులకోసం జర్నలిస్టులు చేసే ఉద్యమంలో తాము కూడాపాలు పంచుకుంటామన్నారు.
ఎమ్మెల్సీ జిల్లా టిఆర్ ఎస్ అధ్యక్షులు తాతా మధు మాట్లాడ్తూ ఇళ్ళ స్ధలాల కేటాయింపు విషయాన్ని ముఖ్యమంత్రి ద్రష్టికి తీసుకేళ్తానని హామి ఇచ్చారు.
టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనారాయణ మాట్లాడ్తూ జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో జర్నలిస్టులంతా కీలకంగా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు.
   ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు,నగర మేయర్ పునుకొల్లు నీరజ,సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్,ఐజెయి జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి క్రష్ణారెడ్డి,రాష్ట్ర చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు,సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లు ప్రసంగించగా ,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్,టియుడబ్ల్యుజె జిల్లా  కార్యదర్శి ఖాదార్ బాబ,నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంధ్ర శేషు,బుచ్చిరెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్,నగర కమిటి అధ్యక్ష కార్యదర్శులు మైసా పాపారావు,చెరుకుపల్లి శ్రీనివాసరావు,జిల్లా ఎలక్ర్టానిక్ మీడియా అధ్యక్షులు గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా నాయకులు ఆవుల శ్రీనివాస్,జనార్ధనచారి,శివానందా,వై మాధవరావు,మామిడాల భూపాల్ రావు,కె సైదులు,టౌన్ ఉపాధ్యక్షులు , రాంబాబు,శీలం శ్రీనివాస్,కోశాధికారి బసవేశ్వర్ రావు,ఏలూరి వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్బంగా వివిధ సమస్యలపై పలువురు సీనియర్ పాత్రికేయులు ప్రవేశ పెట్టిన తీర్మాణాలను సభ ఏకగ్రీవంగా అమోదించింది.ఈ సందర్బంగా టియుడబ్యుజె ఐజెయు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Thursday, 19 May 2022

.రూ.10.34 కోట్లతో ఖమ్మం మార్కెట్‌ నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి..

.
తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్న ఖమ్మం మార్కెట్ లో మొత్తం 15 పనులకు గాను రూ.10.35 కోట్లతో పలు అభివృధ్ది పనులకు గాను మంజూరు అయిన నిధులతో శంకుస్ధాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .రోల్ మోడల్ గా రాష్ట్రంలో 2వ అతిపెద్ద మార్కెట్ గా నిలువనుందని పేర్కొన్నారు

వైభవంగా వర ప్రదాత షిరిడి సాయికి వైశాఖ మాస పూజలు.-లక్ష మల్లెలతో స్వామివారికి ప్రత్యేక అర్చన.-పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు, అన్నప్రసాద వితరణ.


ఖమ్మం కల్చరల్, మే 19.
స్థానిక గాంధీ చౌక్ లోనే వర ప్రదాత శిరిడి సాయి మందిరంలో గురువారం వైశాఖ మాస పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి లక్ష పూలతో ప్రత్యేకంగా అర్చన చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై లక్ష మల్లెపూల అర్చనలో పాల్గొన్నారు. స్వామివారి విగ్రహం వద్ద  గులాబి పూలతో సాయి రామ్ అక్షరాలను రూపొందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. భక్తులు భజనలు, కీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కల్లోలం వలన గత రెండు సంవత్సరాలలో లక్ష మల్లెపూలు అర్చన నిర్వహించలేక పోయామని ఈసారి వైశాఖ మాసంలో  ఈ ఉత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ వేడుకలలో ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావుతో పాటు ఆలయ ప్రధాన కార్యదర్శి అరవపల్లి నిరంజన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ వేడుకలన్నింటిని ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.

దిశ నిర్థేశం మీదైతే..రేపటి విజేతలూ మీరే

మీ విజయాలకు కారకులు మీరే
*దిశా నిర్దేశం చేసిన అట్లూరి
సంకల్పబలంతో నిరంతరం తపిస్తే విజయాలను అందిపుచ్చుకోగలుగుతామని, రేపటి భవిష్యత్తులో విజేతలు అవ్వటానికి మీకు మాత్రమే అవకాశం ఉందని ఆ వైపుగా నిబద్ధత ఏకాగ్రత అకుంఠిత దీక్షతో కష్టపడాలని ప్రముఖ కవి రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణుడు అట్లూరి వెంకటరమణ స్పష్టం చేశారు..
నయాబజార్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.గాయత్రి అధ్యక్షతన జరిగిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ ఒకసారి లభించే ఈ జన్మలో మీదైన ముద్ర సంతకం శాశ్వతంగా ఈ ప్రపంచం పై ఉండాలంటే పట్టుదల, ఆకాంక్ష, నిజాయితీ, నేను మాత్రమే సాధించగలననే
ధీమా నిరంతరం మనసులో ఉండాలని నిర్దేశించారు.
ప్రపంచంలో సాధించే విజయాలకు ప్రథమంగా సంతోషించేవారు తల్లిదండ్రులని, తాము ఏ స్థితిలో ఉన్న మీ మీ చదువు కోసం భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తూ మీరే వారి ఊపిరిగా జీవిస్తున్నారని అటువంటి వారిని సంతోష పెట్టే విధంగా గెలుపే లక్ష్యంగా మార్చుకోవాలని కోరారు.గత పది సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో విద్యనభ్యసించిన మీకు ఆనాటి నుండి ఈనాటి వరకు చదువు చెప్పిన ప్రతి గురువును స్మరించుకుని వారి ఆశీస్సులతో పదవ తరగతి పరీక్షల్లో అద్భుత విజయాన్ని అందుకోవాలని అట్లూరి ఆకాంక్షించారు..
రేపటి సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన
గురుతర బాధ్యత మీ మీద ఉందని విద్యార్థులకు అట్లూరి కర్తవ్యబోధ చేశారు..అనంతరం విద్యార్థులకు పెన్నులు, రైటింగ్ పాడ్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి కిషోర్, గోవిందరెడ్డి, జి వెంకటేశ్వర్లు,శ్రీ హర్ష విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Wednesday, 18 May 2022

శతాధిక వృద్దురాలు.. అడవిని కన్న తల్లి పద్మశ్రీ తిమ్మక్కకు కెసిఆర్ సత్కారం...

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు,ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి సీఎం స్వయంగా తోడ్కొని వెళ్లి పద్మశ్రీ తిమ్మక్క గారిని, సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఉన్న ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. వారందరి సమక్షంలో సీఎం శ్రీ కేసీఆర్ ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. 
సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పద్మశ్రీ తిమ్మక్క అన్నారు. సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క గారు సీఎంకు తెలుపడం, పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క గారు పడుతున్న తపన,సమావేశం లో పాల్గొన్న వారిలో స్ఫూర్తిని నింపింది.
పద్మశ్రీ తిమ్మక్క గారి వివరాలు:
--------------------------------
పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బిబిసి ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి, మొక్కలే పిల్లలుగా, పచ్చదనం పర్యావరణ హితం కోసం తాను పనిచేస్తున్నారు. తిమ్మక్క అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

పుస్తకావిష్కరణ:
----------------
పచ్చదనం పెంపొందించే దిశగా, అడవుల సంరక్షణ మొక్కల పెంపకంపై తెలంగాణ ప్రభుత్వ కృషి, హరితహారం కార్యక్రమం, దాని స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరీ గౌరీశంకర్ సంపాదకత్వంలో, పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం.. ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తొలి కాపీని పర్యావరణ పరిరక్షకురాలు పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క గారికి సీఎం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మొక్క నాటడమనేది ఒక కార్యక్రమం కాదని, అది మనల్ని, మన భవిష్యత్తు తరాలను బ్రతికించే మార్గమని అన్నారు. ఆ భాద్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ తిమ్మక్క గారిని మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మంచి పని లో నిమగ్నమైతే, గొప్పగా జీవించ వచ్చని, మంచి ఆరోగ్యం తో ఉంటారనటానికి పద్మశ్రీ తిమ్మక్క గారు నిలువెత్తు నిదర్శనమని, అందరూ ఆ బాటలో నడవాలని సీఎం ఆకాంక్షించారు.

హామాలీల బందు సమంజసం కాదు

ఖమ్మం మే 18 గాంధీ చౌక్ లో హమాలీలు చేయని పనికి కూలి అడగటం సమంజసం కాదని వర్తక సంఘం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణ రావు మాట్లాడుతూ హమాలీలు నిబంధనలకు విరుద్ధంగా పని బందు చేయడం విచారించదగ్గ విషయం అన్నారు లేబర్ యాక్ట్ ప్రకారం చేసిన పనికి కూలీ తీసుకోవాలని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. హోల్ సేల్ రిటైల్ వ్యాపారస్తులు హమాలి వర్కర్ల వల్ల వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు ఎగుమతికి పనిచేయని హమాలీలు ఇన్వాయిస్ ప్రకారం డబ్బులు కట్టాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు అందువల్ల ఈ భారం వ్యాపారస్తుల పై వినియోగదారులపై పడుతుందని సంబంధిత అధికారులు ఈ సమస్యని పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణ రావు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు గొడవర్తి శ్రీనివాసరావు రాము శ్రీనివాసరావు రాయపూడి వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

Monday, 16 May 2022

బాలయ్య చేతుల మీదగా ఎన్టీఆర్ శతజయంతి..


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించనున్నారు.నటుడిగా, రాజకీయ నేతగా ఎన్నో కోట్ల మంది మదిలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మే28న ఉదయం నిమ్మకూరులో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున మధ్యాహ్నం గుంటూరు, సాయంత్రం తెనాలిలో జరగనున్న కార్యక్రమాలకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుకల నిమిత్తం ఆయా ప్రాంతాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇక, ఈ ఏడాది పొడవునా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు జరగనున్నాయి.

Sunday, 15 May 2022

సమర్థ యాజమాన్యంతో ముందుకు సాగుతున్న ఎస్.బి.ఐ.టి.: సక్సస్ మీట్ లో మంత్రి పువ్వాడ అభినందనలు


ఖమ్మం నగరం లోని ఎస్.బి. ఐ.టి.ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పలు బహుళ జాతి కంపెనీల్లో ఈ విద్యా సంవత్సరం లో ఇప్పటి వరకు దాదాపు 225 మంది ఉద్యోగాలు సాధించినందుకు కళాశాల మైదానం లో ది.14.05.22 న సాయంత్రం కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరైయ్యారు..
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి కృష్ణ తో పాటు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెట్ జి. ధాత్రీ గారికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు రూపొందించిన sbittpo.com అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు.ఇందులో ప్లేస్ మెంట్ సాధించిన విద్యార్థులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు సాధించారాన్న పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచారు.
అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సమర్థ యాజమాన్యంతో ముందుకు సాగుతున్న ఎస్.బి.ఐ.టి.విద్యార్థులు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై న అజయ్ కుమార్ గారికి కృష్ణ గారు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. చివరిగా ఆయన్నుశాలువాతో గౌరవప్రదంగా సన్మానించారు...
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఖమ్మం కార్పోరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ డి.లక్ష్మీ ప్రసన్న, టీఆర్ఎస్ పార్టీ నగర అద్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ లు కమర్తపు మురళీ, బిక్కసాని ప్రశాంత లక్ష్మీ, పసుమర్తి రామ్మోహన్, కళాశాల ప్రిన్సిపాల్ జి.రాజ్ కుమార్, అకడమిక్ డైరెక్టర్లు శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్ గార్ల తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, అధికారులు, స్థానిక పెద్దలు , అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....

కవర్లకోసం రాలే కవరేజ్ కోసం వచ్ఛాం... అధికారులకు కొయంబత్తుర్ విలేకరుల ఝలక్..



‘కొయంబత్తుర్ జర్ననలిస్టులు తాము కాసుల కవర్లకోసం కాదు..వార్తల కవరేజ్ కోసమే వచ్ఛామంటూ చెప్పటంతో అవాక్కవడం యూనివర్సిటీ అధికారుల వంతైంది. స్నాతకోత్సవాలు కవర్‌ చేయడానికి వచ్చిన విలేకరులకు కవర్‌లో కరెన్సీ నోట్‌ పెట్టి ఇచ్చారు.దీనిని జర్నలిస్టులంతా తీవ్రంగా వ్యతిరేకించారు.


డబ్బులకు అక్షరాలను అమ్ముకునే వాళ్లలా కనిపిస్తున్నామా అని, పాత్రికేయాన్ని అవమానించిన ఆ యూనివర్సిటీ వారిని నిలదీశారు. జర్నలిస్టులకు సారీ చెప్పాలని ప్రెస్‌క్లబ్‌ డిమాండ్‌ చేసింది.’’  ఇలాంటి వార్తని మీరు అసలు ఊహించి ఉండరు. నిజానికి రేపటి పత్రికల్లో బ్యానర్‌గా రావాల్సిన వార్తే కానీ రాదు. సింగిల్‌ కాలమ్‌ వస్తే గొప్ప!తమిళనాడు లోని  భారతీయర్‌ యూనివర్సిటీలో జరిగింది.
జర్నలిజం విలువలు కాపాడిన కోయంబత్తూర్‌ ప్రెస్‌క్లబ్‌  మోబైల్ నెంబర్ : 9894300104

Friday, 13 May 2022

ఖమ్మం నగరంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి


ఖమ్మం : శుక్రవారం ఖమ్మం నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన సెమినార్ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ “ప్రారంభంలో ఉండే ఆవేశం, తపన చివరి వరకూ కొనసాగేలా దృఢ చిత్తంతో ఉండాలి. చాలామంది పోటీ పరీక్షకు తయారయ్యేటప్పుడు మొదట్లో పెద్దఎత్తున కష్టపడతారు. కాలం గడుస్తున్న కొద్దీ లక్ష్యాన్ని మరిచిపోయి పక్కదోవలు పడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో... ఒక మానసిక ప్రణాళికను ప్రిపరేషన్ ప్రారంభ దశలోనే అనుభవజ్ఞుల సాయంతో రూపొందించుకోవాలి. రాబోయే అవరోధాల్ని అంచనా వేసుకుని పరిష్కారాలు ఆలోచించుకున్నపుడు ఆ అడ్డంకులు నిజంగా ఎదురైనపుడు వాటిని సమర్థంగా, సులువుగా అధిగమించవచ్చు. అలానే నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహించే తేదీకి మధ్య ఉన్న కాలాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు టైమ్ టేబుల్ షెడ్యూల్ ని పక్కాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ మార్కులు ఇవ్వగలిగిన సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ సమయం కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చే అంశాలకు తక్కువ సమయం కేటాయించాలి. ఇలా టైమ్ టేబుల్ షెడ్యూల్ రూపొందించుకోవాలి. పరీక్ష సిలబస్ కు సంబంధించిన అన్ని అంశాలూ తప్పనిసరిగా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి అని అన్నారు. ఎంతో మంది విద్యార్ధులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన రైట్ ఛాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి విద్యార్ది వారి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పోటీ పరీక్షా సమయంలో ఎక్కువ శ్రద్ధతో శ్రమించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి కోరారు. అనంతరం బైపాస్ రోడ్ లోని సప్తపది కళ్యాణ మండపంలో జరిగిన పొదిల చిన్న పాపారావు కుమార్తె వివాహమహోత్సవంలో పాల్గొని పెళ్లి జంటను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు కోసూరి శ్రీనివాసరావు, కిలారు మనోహర్, దుంపల రవికుమార్, మీగడ శ్రీను, రాయల పుల్లయ్య, దొడ్డపనేని రామారావు, కొణిజర్ల సర్పంచ్ రామారావు, పొట్లపల్ల శేషగిరి, ఏలూరి శ్రీనివాసరావు, కొనకంచి మోషే, కనగంటి రావు, గుడివాడ వెంకటేశ్వర్లు, శీలం వెంకట్రామిరెడ్డి, సురభి వెంకటప్పయ్య, తాళ్లూరి చిన్నపుల్లయ్య, ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు , గుండెబోయిన నర్సింహారావు, రంగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

గీతాంజలిలో ఘనంగా పదవ తరగతి విద్యార్ధుల వీడ్కోలు వేడుక...


ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్ లోని గీతాంజలి విద్యానికేతన్  పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి,రచయిత,వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ అట్లూరి.వెంకటరమణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని శ్వాసించి ధ్యానించాలని నిత్యం గెలవాలనే ఆలోచనతో సహజీవనం చేస్తే విజయం తధ్యమన్నారు..
తల్లిదండ్రుల నిరంతర ఆలోచన విద్యార్ధులే అని అందుకే పిల్లల ఎదుగుదలను తమ గమ్యం చేసుకుంటారని అటువంటి తల్లిదండ్రులకు మంచి ఫలితాలను బహుమతిగా ఇవ్వాలని కోరారు..జాతీయ పతాకాన్ని నిరంతరం ప్రకాశింప చేయాలని స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ టి.వి.అప్పారావు,డైరెక్టర్లు టి.పద్మ,టి.అరుణ్ ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి...

Thursday, 12 May 2022

ఇహపై మదార్సాలలో జనగణమణ

లక్నో: యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత‍్తర్వులు గురువారం జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
 ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు.

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు ...


ఖమ్మం : గుట్టల బజారు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవ్యాలయంలో బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఉదయం నుండి మంగళవాయిద్యలు మరియు సుప్రభాతంతో గోపూజ , విశేష పంచామృతాభిషేకం , క్షీరాభిషేకం , లలిత సహస్రనామ పారాయణము , నిత్యార్చన , నీరాజన మంత్రపుష్పము , సామూహిక కుంకుమార్చన , లక్షమల్లెల నీరాజనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు . అనంతరం ప్రత్యేక అలంకరణతో అమ్మవారిని అలంకరించి ,  వచ్చిన భక్తులకు మంగళహారతులిచ్చి తీర్థప్రసాదాలు అందించారు . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేళ్ళచెరువు వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , కోశాధ్యక్షులు కొత్తమాసు హేమసుందర రావు మరియు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం కమిటి సభ్యులు , భక్తులు అత్యధిక సంఖ్యలలో పాల్గొన్నారు .

Sunday, 8 May 2022

అభిమానులకు మహేష్ బాబు లేఖ...

అభిమానులు ధియేటర్ లోనే సర్కారు వారి పాట చూడండి అంటూ ఫ్యాన్స్ కు మహేష్ బాబు లేఖ రాశారు... ఇటీవలే కుటుంబంతో కలసి ఫారిన్ ట్రిప్ చేసిన మహేష్ బాబు.సర్కార్ వారిపాట సినిమా విడుదల ప్రమోషన్ లో పాల్గొన్నారు.. సినిమా ను ధియేటర్ లలో చూడండంటూ అభిమానులకు ఆయన లెటర్ రాశారు..

Thursday, 5 May 2022

- *స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన :- ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్

Dt : 05/05/2022
Khammam
. ఖమ్మం నగరంలోని పెవిలన్ గ్రౌండ్ నందు ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  హాజరై ప్రారంభించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.

- అనంతరం ముఖ్య అతిథులకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం తెలియజేశారు...

- ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మాట్లాడుతూ: గత రెండు సంవత్సరాలు కరొన కోవిడ్ వల్ల ఎగ్జిబిషన్లు వంటివి ఏర్పాటు చేయలేదన్నారు.ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం  పిల్లల ఆటల కొరకు ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేసిన వారి బృందాని అభినందించారు.ఎగ్జిబిషన్ నందు చిన్న పెద్ద పిల్లల ఆటల వస్తువులు మరియు 50 రకాల వస్త్రాల దుకాణాలు,స్టాల్స్ ఏర్పాటు చేయడం,ఎగ్జిబిషన్ నేటి 05/05/2022 నుండి 45 రోజుల వరకు ఉంటుంది,ఎగ్జిబిషన్ సమయం ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది.కావున నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ 
బుడిగం శ్రీనివాస్,పాలెపు విజయ వెంకటరమణ,ఎగ్జిమిషన్ నిర్వాహకులు అప్పీ రెడ్డి,బాలా శౌరి,వాసు,అచ్చయ్య,నాయకులు గౌరీ నాథ్,పసుపులేటి వెంకటేశ్వర్లు,డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Tuesday, 3 May 2022

అకట్టుకుంటున్న సురభి నాటకాలు... పౌరాణిక ఇతివృత్తాలకు సేవలందిస్తున్న కొండపల్లి జగన్ను సన్మనించిన కళాపరిషత్..

ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో మంగళవారం శ్రీ సాయి సంతోషి surabhi నాట్యమండలి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన మాయాబజార్ నాటకం అందరినీ ఆకట్టుకుంది వివిధ సన్నివేశాలలో నటీనటులు తమ నటనకు పట్టాభిషేకం చేశారు సురభి సంతోష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కళాపోషకులు గోపాలకృష్ణ సాయి నటులు kutumbaka కృష్ణ ప్రసాద్ కొండపల్లి జగన్ మోహన్ రావు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు నాటకోత్సవ నిర్వహణకు భూరి విరాళాలు అందజేశారు.. ఖమ్మం నగర పౌరాణిక కళాకారులు, ఖమ్మం జిల్లా న్యాయస్థానాల సహాయ పౌరన్యాయవాది కొండపల్లి జగన్ నిర్వహకులకు తన వంతు వితరణగా 25వేలు అందజేశారు...

Monday, 2 May 2022

అక్షయ తృతీయ వినియోగదారులకు స్వాగతం అంటున్న "జోయ్ ఆలుకాస్"

అక్షయ తృతీయ పురస్కరించుకొని ఖమ్మంలోని జోయాలుకాస్ బంగారు నగల దుకాణంలో వినియోగదారుల కోసం అన్ని రకముల బంగారు ఆభరణాలను సిద్ధం చేశామని జోయ్ అలుకాస్ బంగారు ఆభరణాల దుకాణం నిర్వాహకులు ఫ్లోర్ ఇన్చార్జ్ కోటేశ్వరరావు తెలియజేశారు తమ దుకాణంలో వివాహాది శుభకార్యములకు కోసం ప్రత్యేక నగలను రూపొందించామని తెలియజేశారు కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ఈసారి బంగారు ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు రెండు సంవత్సరముల తర్వాత ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఇంచార్జ్ కిరణ్ అసిస్టెంట్ మేనేజర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు