ఖమ్మం : శుక్రవారం ఖమ్మం నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన సెమినార్ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ “ప్రారంభంలో ఉండే ఆవేశం, తపన చివరి వరకూ కొనసాగేలా దృఢ చిత్తంతో ఉండాలి. చాలామంది పోటీ పరీక్షకు తయారయ్యేటప్పుడు మొదట్లో పెద్దఎత్తున కష్టపడతారు. కాలం గడుస్తున్న కొద్దీ లక్ష్యాన్ని మరిచిపోయి పక్కదోవలు పడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో... ఒక మానసిక ప్రణాళికను ప్రిపరేషన్ ప్రారంభ దశలోనే అనుభవజ్ఞుల సాయంతో రూపొందించుకోవాలి. రాబోయే అవరోధాల్ని అంచనా వేసుకుని పరిష్కారాలు ఆలోచించుకున్నపుడు ఆ అడ్డంకులు నిజంగా ఎదురైనపుడు వాటిని సమర్థంగా, సులువుగా అధిగమించవచ్చు. అలానే నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహించే తేదీకి మధ్య ఉన్న కాలాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు టైమ్ టేబుల్ షెడ్యూల్ ని పక్కాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ మార్కులు ఇవ్వగలిగిన సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ సమయం కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చే అంశాలకు తక్కువ సమయం కేటాయించాలి. ఇలా టైమ్ టేబుల్ షెడ్యూల్ రూపొందించుకోవాలి. పరీక్ష సిలబస్ కు సంబంధించిన అన్ని అంశాలూ తప్పనిసరిగా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి అని అన్నారు. ఎంతో మంది విద్యార్ధులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన రైట్ ఛాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి విద్యార్ది వారి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పోటీ పరీక్షా సమయంలో ఎక్కువ శ్రద్ధతో శ్రమించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి కోరారు. అనంతరం బైపాస్ రోడ్ లోని సప్తపది కళ్యాణ మండపంలో జరిగిన పొదిల చిన్న పాపారావు కుమార్తె వివాహమహోత్సవంలో పాల్గొని పెళ్లి జంటను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు కోసూరి శ్రీనివాసరావు, కిలారు మనోహర్, దుంపల రవికుమార్, మీగడ శ్రీను, రాయల పుల్లయ్య, దొడ్డపనేని రామారావు, కొణిజర్ల సర్పంచ్ రామారావు, పొట్లపల్ల శేషగిరి, ఏలూరి శ్రీనివాసరావు, కొనకంచి మోషే, కనగంటి రావు, గుడివాడ వెంకటేశ్వర్లు, శీలం వెంకట్రామిరెడ్డి, సురభి వెంకటప్పయ్య, తాళ్లూరి చిన్నపుల్లయ్య, ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు , గుండెబోయిన నర్సింహారావు, రంగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment