ఖమ్మం : గుట్టల బజారు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవ్యాలయంలో బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఉదయం నుండి మంగళవాయిద్యలు మరియు సుప్రభాతంతో గోపూజ , విశేష పంచామృతాభిషేకం , క్షీరాభిషేకం , లలిత సహస్రనామ పారాయణము , నిత్యార్చన , నీరాజన మంత్రపుష్పము , సామూహిక కుంకుమార్చన , లక్షమల్లెల నీరాజనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు . అనంతరం ప్రత్యేక అలంకరణతో అమ్మవారిని అలంకరించి , వచ్చిన భక్తులకు మంగళహారతులిచ్చి తీర్థప్రసాదాలు అందించారు . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేళ్ళచెరువు వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , కోశాధ్యక్షులు కొత్తమాసు హేమసుందర రావు మరియు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం కమిటి సభ్యులు , భక్తులు అత్యధిక సంఖ్యలలో పాల్గొన్నారు .
No comments:
Post a Comment