Friday, 31 May 2024

తం సూర్యం ప్రణమామ్యహం అన్న మోడీ.‌.

తమిళనాడు : నడి వేసవి లో ప్రధాని నరేంద్ర మోడీ తం సూర్యం ప్రణమామ్యహం అన్నారు.. తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలో నిమగ్నమైన ప్రధాని నరేంద్ర మోదీ. కన్యాకుమారి సముద్రం వద్ద సూర్యోదయాన్ని వీక్షించి. సూర్యునికి అర్ఘ్యం ఇచ్చారు. ఇది జ్ఞానోదయం కోసం స్వామి వివేకానంద తన జీవిత అన్వేషణ.. అనుబంధం కోసం ఎంపిక చేసుకున్న ప్రదేశం. 45 గంటల సుదీర్ఘ ధ్యాన దీక్షలో మోడీ కొనసాగనున్నారు.జూన్ 1 సాయంత్రం వరకు ఆయన ఈ అభ్యాసంలో కొనసాగేందుకు దీక్ష చేపట్టారు ‌.కాగా 131 సంవత్సరాల క్రితం చికాగోలో ప్రపంచ సర్వ మత మహా సభలలో ప్రసంగానికి ముందు వివేకానంద ధ్యానం చేసిన పవిత్ర పుణ్యస్థలం లోనే ప్రస్తుతం నరేంద్ర మోదీ 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నారు. స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం హిందూ జీవన విధానానికి నూతన దిశను చూపించింది.

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రాముని మాలలు


భద్రాచలం :  కొండగట్టు అంజన్నకు భద్రాచలం.                 శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం తరఫున కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు,  స్వామివారికి ఇష్టమైన వడమాల.. అప్పాల మాలలు.ఈవో రమాదేవి గురువారం అందజేశారు. అర్చకులతో కలిసి ఆమె కొండగట్టులో హనుమత్​ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, శేషమాలికలు కొండగట్టు ఆలయ అర్చకులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాలతో కొండగట్టు అర్చకులు స్వాగతం పలికారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

బంగారు స్మాగ్లర్ అవతారం ఎత్తిన ఏయిర్ హోస్టేస్..


ఈ నెల 28న మస్కట్ నుంచి కన్నూరు‌ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం.బంగారంతో పట్టుబడిన ఎయిర్‌హోస్టెస్ సురభి ఖాతూన్గ తంలోనూ బంగారం స్మగ్లింగ్ చేసినట్టు అనుమానం.14 రోజుల కస్టడీకి కోర్టు ఆదేశం. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎయిర్ హోస్టెస్ దొరికిపోయింది. 960 గ్రాముల బంగారాన్ని ఆమె రహస్య అవయవాల్లో దాచుకుని వస్తుండగా కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తెలిపారు.నిందితురాలిని సురభి ఖాతూన్‌గా గుర్తించారు. ఈ నెల 28న విమానం మస్కట్ నుంచి కన్నూరు చేరుకుంది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల కస్టడీకి ఆదేశించారు. నిందితురాలు సురభి బంగారాన్ని అక్రమంగా తీసుకురావడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ పలుమార్లు ఇలా స్మగ్లింగ్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

Monday, 27 May 2024

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేయండి : సీఈసి రాజీవ్ కుమార్


ఖమ్మం, మే 27: లోకసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు గ్యానేష్ కుమార్, డా. సుక్ భీర్ సింగ్ సందు లతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా, ఖమ్మం నూతన కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెలువడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హల్ కు ఇవిఎం యంత్రాల తరలింపుకు అవసరమైన మేర సిబ్బంది ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే ప్రతి సిబ్బందికి వారు నిర్వహించాల్సిన విధులపై సంపూర్ణ శిక్షణ అందించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలని, వివిప్యాట్ లెక్కింపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో  అవసరమైన మేర కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి టేబుల్ వద్ద ప్రత్యేక బృందాలను నియమించాలని అన్నారు. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, కౌంటింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ వీడియో సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, జెడ్పి సిఇఓ వినోద్, డిఆర్డీవో సన్యాసయ్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

*నిబద్ధత గల నాయకుడు రాయల.. : నామ ఘన నివాళి*

 

 *ఖమ్మం, మే 27 :* డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశ దిన కర్మ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్ల మెంట్ సభ్యులు నామనాగేశ్వరరావు సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీకి ప్రజలకు చేసిన ఎనలేని సేవలను స్మరించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో పని చేసినప్పటి నుంచి రాయలతో తనకున్న అనుబంధాన్ని నామ ఈ సందర్భంగా  గుర్తు చేసు కున్నారు. రాయల నిబద్దత గల రాజకీయ నాయకుడని కొని యాడారు. వివిధ పదవుల ద్వారా రాయల ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి ఎంతో సేవ చేసి, తనదైన ముద్ర వేశారని అన్నారు. రాయల పార్టీకి ఎనలేని సేవలు అందిం చారని అన్నారు. ఎల్లప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని కార్య కర్తలకు సూచించారు. ఎన్టీఆర్ స్పూర్తితో టీడీపీలో చేరి వివిధ పదవుల ద్వారా రాయల శేషగిరిరావు ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. చనిపోయేంత వరకు రైతు పక్షపాతిగా ఉంటూ రైతాంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని, రైతుల కోసం ఎంతో శ్రమించారని చెప్పారు. టీడీపీలో ఉన్న ప్పుడు తల్లాడ మండలం గంగదేవిపాడు సొసైటీ అధ్యక్షునిగా రైతుల కోసం పాటుపడ్డారని చెప్పారు. డీసీసీబీ డైరెక్టర్ గా పని చేశారన్నారు. తర్వాత 2019 నుంచి 2023 వరకు డీసీఎంఎస్ చైర్మన్ గా పని చేసి, ప్రజలకు ఎనలేని సేవలు అందించిన నేత రాయల అని
నామ కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఆధ్యాంతం శ్రమించిన నాయకుడని  పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నట్లు నామ నాగేశ్వ రరావు పేర్కొన్నారు. శేషగిరిరావు చనిపోయిన రోజు కూడా అంత్యక్రియల్లో స్వయంగా పాడె మోసి, కడసారి కన్నీటి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Thursday, 23 May 2024

మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి తల్లి మృతికి ఎంపీ నామ సంతాపం - నివాళి


ఖమ్మం, మే 23 :  ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు రెడ్డిపాలెం లో గురువారం  మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తల్లి మోదుగుల ఆదిలక్ష్మీ దశ దిన కర్మ జరగగా, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  కార్యక్రమానికి హాజరయ్యారు, ఆమె  చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపి , ఘనంగా నివాలర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని దైవాన్ని ప్రార్ధించా రు నామ..

Saturday, 18 May 2024

భక్తుల విజయం.....

తిరుమల శ్రీవారి దర్శనం, సేవలకు సంబంధించి ఓ భక్తుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి మరీ సాధించుకున్నారు. టీటీడీపై పిటిషనద్ దాఖలు చేయగా.. తీర్పును వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన సుమిత్రా శెట్టి, ఆమె కుమారుడు హరీశ్‌ శెట్టి 2007 ఆగస్టు 21న తిరుమల శ్రీవారి మేల్‌చాట్ వస్త్రం (ఆర్జిత సేవ)లో పాల్గొనేందుకు రూ.12,500 చెల్లించారు. అలాగే హరీశ్‌శెట్టి 2008 డిసెంబర్ 17న తిరుమల శ్రీవారి తిరుప్పావడ సేవ నిమిత్తం రూ.5 వేలు చెల్లించారు.
2021 సెప్టెంబర్ 9న హరీశ్‌ శెట్టికి , 2021 సెప్టెంబర్ 10న సుమిత్రా శెట్టికి ఈ సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ ఖరారు చేసింది. ఆ తర్వాత కరోనా కారణంగా టీటీడీ దర్శనాలు, ఆర్జిత సేవల్ని రద్దు చేసింది. అయితే ఆ తర్వత కూడా సుమిత్రాశెట్టి అదనంగా మరో రూ.3,065 పంపించి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని టీటీడీని కోరారు. కానీ అదనంగా పంపించిన డీడీని తిరిగి వారికే టీటీడీ పంపించింది.సేవలకు వీలు కాదని టీటీడీ వారికి లేఖ రాసింది. దీంతో సుమిత్రాశెట్టి, హరీశ్‌ శెట్టి టీటీడీకి లీగల్‌ నోటీసులను పంపించారు.టీటీడీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారిద్దరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఇద్దరి ఫిర్యాదుపై టీటీడీ స్పందించి తమ కేసు కొట్టి వేయాలని కోరారు.. సుమిత్రా శెట్టి, హరీశ్‌ శెట్టి చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేస్తామని ఫోరాన్ని అడిగారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేసిన ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో మేల్‌చాట్ వస్త్రం, తిరుప్పావడ సేవల్లో పాల్గొనే అవకాశం వారిద్దరికి కల్పించాలని
 వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఒకవేళ కుదరని పక్షంలో రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఈ మేరకు వినియోగదారుల ఫోరం తీర్పును ఇటీవల వెల్లడించింది. మరి ఈ తీర్పుపై టీటీడీ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.. వారికి శ్రీవారి

Monday, 13 May 2024

క్యూలో నిలబడి ఓటు వేసిన కలేక్టర్ దంపతులు...


ఖమ్మం, మే 13:  కలెక్టర్క ఓటు సాంప్రదాయాన్ని పాటించారు ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా  కలెక్టర్ వి.పి. గౌతమ్ దంపతులు సామాన్యుల్లా క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం రిటర్నింగ్ అధికారి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య 195 లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  అనంతరం రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ,  లోకసభ సాధారణ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతున్నట్లు, జిల్లా అటవీ అధికారి కార్యాలయం పోలింగ్ కేంద్రంలో ఉన్న తమ ఓటు హక్కును తాము బాధ్యతగా వచ్చి వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు తమకు అందించిన పోలింగ్ స్లిప్పులతో పాటు ఓటర్ ఐ.డి. కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ఎన్నికల్లో మనమంతా భాగస్వామ్యం కావాలని, ప్రతి ఒక్క ఓటరు ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Sunday, 12 May 2024

ఎలక్షన్ సిబ్బందికి బొట్టు-హారతులతో స్వాగతం పలికిన ఓటర్లు...

 ఆకర్ణణగా నిలిచిన దేవాపూర్ మహిళా పోలింగ్ స్టేషన్ 

-- బెల్లంపల్లి ఏ ఆర్వో రాహుల్ ఐ ఏ యస్ చొరవతో 13వ పోలింగ్ స్టేషన్  కు ప్రత్యేక అలంకరణ.

సోమవారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది సంబంధిత ప్రాంతాలకు చేరుకున్నారు.దేవాపూర్ లోని 13వ పోలింగ్ స్టేషన్ మహిళా పోలింగ్ స్టేషన్ గా ప్రకటించారు. ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలోని పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఘన స్వాగతం పలికారు.బొట్టు పెట్టి హారతులు ఇచ్చి పూల బొకేలతో ప్రత్యేక స్వాగతం పలికి సిబ్బందిని సంతోషపెట్టారు. దింసా నృత్యం, సన్నాయి మేళ తాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సిబ్బంది దేవాపూర్ లోని పోలింగ్ స్టేషన్లో అన్నింటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేల తాళాలు తో పోలింగ్ సిబ్బందికి ఘన స్వాగతం పలకడంతో పాటు వారికి షర్బత్ అందించి ఉత్తమ పోలింగ్ నిర్వహించవలసిందిగా ఆహ్వానం పలికారు. చక్కటి ఏర్పాట్లను చూసిన పోలింగ్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దేవాపూర్ రెండవ సెక్టార్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ లలో సౌకర్యాలు చాలా చక్కగా ఏర్పాటు చేయడం పట్ల సెక్టార్ ఆఫీసర్ ఐనాల సైదులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Saturday, 11 May 2024

సైలెన్స్ పిరియడ్.... ఇహ ప్రచారం వంద మీటర్ల పరిథిలోనే... ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేదం....


ఖమ్మం, మే 11: లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 13వ తేదీన పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, ఎన్నికల ఏర్పాట్లు, సైలెన్స్ పీరియడ్ పై మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ,  కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ సమయం ఒక గంట పొడిగించిందని, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయవచ్చని అన్నారు.   ఖమ్మం పార్లమెంట్ పరిథిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి మొత్తం 16 లక్షల 31 వేల 39 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 7 లక్షల 87 వేల 160 మంది పురుషులు, 8 లక్షల 43 వేల 749 మంది స్త్రీలు, 130 మంది ట్రాన్సజెండర్లు ఉన్నారన్నారు.  30,389 మంది దివ్యాంగులు, 10,318 మంది సీనియర్ సిటీజేన్స్ ఉన్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 27 ఎఫ్ఎస్టీ, 21 ఎస్ఎస్టీ, 31 ఎంసిసి బృందాలు, 203 మంది సెక్టార్ అధికారులు, 6 రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటుచేసినట్లు, వీటికి అదనంగా 5 ఎఫ్ఎస్టీ టీములు శుక్రవారం నుండి నిఘాకు వుంచినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే సినియర్ సిటిజెన్స్, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాలలో వసతులు కల్పించడం జరిగిందని, వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుతో ఓటింగ్ కొరకు పోలింగ్ కేంద్రానికి రావడానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి రవాణా సౌకర్యానికి సాక్ష్యం యాప్ ద్వారా దరఖాస్తు చేయాలని, ఇప్పటికి 15 వేల మంది దరఖాస్తు చేసినట్లు ఆయన అన్నారు. పోలింగ్ రోజున సెక్టార్ అధికారులతో పాటు పోలీసు ఎస్కార్ట్ తో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం జరుగుతుందని, అలాగే సెక్టార్ ఆఫీసర్ల వద్ద 2 చొప్పున రిజర్వు ఇవిఎం యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు, ఎక్కడైనా సమస్య వస్తే రిజర్వు ఇవిఎం యంత్రాలను వాడడం జరుగుతుందని తెలిపారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంటులకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో, మధిర అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్  కాలేజీలో, వైరా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి సత్తుపల్లి లోని జ్యోతి నిలయం హైస్కూల్ లో, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి అశ్వారావుపేట లోని వ్యవసాయ కళాశాలలో ఇవిఎం స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇవిఎం యంత్రాలకు సంబంధించి కమీషనింగ్ చేసి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పోలింగ్ విధుల పట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, 7-ఏ ద్వారా పోలింగ్ కేంద్రం బయట అభ్యర్ధుల లిస్ట్, 12 రకాల గుర్తింపు కార్డుల వివరాలు, పోలింగ్ కేంద్రంలో చేయదగినవి, చేయకూడని వివరాలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఓటర్లకు ఓటరు ఇన్పర్మేషన్ స్లిప్  ల పంపిణీ పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. ఇట్టి స్లిప్ లో వారి పోలింగ్ కేంద్రం పేరు, సంఖ్య, వారి ఓటరు వరుస సంఖ్య, ఓటరు గైడ్ ఉంటాయని, అవి ఓటరుకు సహాయకారిగా ఉంటాయని, జిల్లాలో ఇప్పటి వరకు 98 శాతం స్లిప్పులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారని, పంపిణీ కాక మిగిలిన వాటిని ఎ.ఎస్.డి. జాబితా తయారుచేసి, సంబంధిత పోలింగ్ కేంద్రాలకు అందజేయడం జరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో భాగంగా హోమ్ ఓటింగ్ సంబంధించి  మందికి గాను 2728 మంది ఓటు వేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 86 లక్షల, 26 వేల రూపాయల విలువ గల బహుమతులు, రూ. 3 కోట్ల 47 లక్షల 31 వేల నగదు, రూ. ఒక కోటి 6 లక్షల 40వేల విలువ గల లిక్కర్, రూ. 24 లక్షల 39 వేల విలువ గల గంజాయి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సీ విజిల్, 1950 ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని, పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తామని ఆయన అన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ గా పరిగణించి ప్రచార కార్యక్రమాలపై, లౌడ్ స్పీకర్లపై నిషేధం ఉంటుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థికి ఒక వాహనం అనుమతితో పాటు నలుగురు వ్యక్తులకు అనుమతి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రం వంద మీటర్ల పరిథిలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు అయినా నిషేధమని, అలాగే ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ నిషేధించినట్లు, తెలిపారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు డ్రైడేగా ప్రకటించడం జరిగిందని, 11 వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 13 వ తేదీ పోలింగ్ పూర్తయ్యేంత వరకు వైన్స్ షాప్స్, బార్లు బంద్ చేయడం జరుగుతుందని తెలిపారు. 12 వ తేదీన పోలింగ్ పార్టీలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి అన్ని రకాల మెటీరియల్ తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజున సాయంత్రం 6.00 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన వారికి చివరి నుండి స్లిప్పులు ఇచ్చి పోలింగ్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగడానికి స్వీప్ ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, యువ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, వేసవి ఎండల దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నీడ, త్రాగునీటి సదుపాయం, టాయిలెట్స్, మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తదితర వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని, పారదర్శకమైన ఏర్పాట్లతో ప్రశాంత వాతావరణంలో అర్పత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని, ఓటింగ్ శాతం పెరగడంలో సహకరించాలని మీడియా ముఖంగా విజప్తి చేస్తున్నట్లు ఆయన అన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం పోలింగ్ ముగిసే వరకు వైన్స్, బార్ లు మూసివేయుటకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. బల్క్ ఎస్ఎంఎస్ లు దృష్టికి వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టామన్నారు. జిల్లాకు సంబంధించి 1459 పోలింగ్ కేంద్రాలకు గాను 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 86 లోకేషన్లలో ఉన్నట్లు, ఈ కేంద్రాలలో సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వు ఫోర్సు నియమించామన్నారు.   కొత్త వారు, బయట వారు జిల్లాలో ఉంటే పంపిస్తామని అన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు సెలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఈ సందర్భంగా గోదాములు, ఫంక్షన్ హాల్సు, రిసార్ట్స్, ఫామ్ హౌజ్ లు తదితర చోట్ల నిఘా టీములు రైడ్స్ జరుపుతాయని, ప్రయివేటు పార్టీలకు అనుమతి లేదని, పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతి లేదని ఆయన తెలిపారు. 2391 మంది పోలీసులు, 6 కంపెనీల సిఐపీఎఫ్ బలగాలు బందోబస్తు విధుల్లో ఉంటాయన్నారు. 20 ప్రత్యేక టీములని శాంతిభద్రతల, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు తక్షణ చర్యలకు ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని, అందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ అన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.

Friday, 10 May 2024

ఓటు"హక్కు" వినియోగించుకోండి....


ఖమ్మం, మే 10: ఓటుహక్కు వున్న ప్రతిఒక్కరు తమ ఓటుహక్కును ఈ నెల 13న వినియోగించుకోవాలని ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే అన్నారు. శుక్రవారం ఖమ్మం లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర నంద్ మిశ్రా లతో కలిసి స్వీప్ కార్యాచరణ లో భాగంగా ఓటరు చైతన్యం కొరకు ఐడిఓసి లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని నూతన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీలో రిటర్నింగ్ అధికారి తో పాటు, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీ శ్రీ సర్కిల్, జెడ్పి సర్కిల్ గుండా ప్రధాన రహదారి వెంట కొనసాగి, పెవిలియన్ గ్రౌండ్ వద్ద ముగిసింది. దారిపొడవునా ప్రజాస్వామ్యం, ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ సాగిన ర్యాలీలో జెడ్పి సెంటర్ వద్ద యువత దేశభక్తి గేయాలకు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ర్యాలీ ముగింపు సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ వద్ద రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 13న పోలింగ్ విషయమై ప్రతి ఒక్కరిని చైతన్య పరచాలన్నారు. జిల్లాలో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, జనాభాలో 140 కోట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న భారతదేశం అని అన్నారు. 96 కోట్ల ఓటర్లు ఉన్న భారతదేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అని ప్రపంచదేశాల చూపు మనపైనే ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారు పాలకులుగా శాసనాలు చేస్తారని, ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయని, ఓటు వేయకుంటే మనం ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగలో ప్రతిఒక్కరు తమ ఓటు వేయాలని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా జరుగుతున్నట్లు, దీనిని మేధావులు ఆలోచించాలని, దయచేసి ఓటుహక్కు ఉన్న వారు, తమ ఓటుహక్కు ఎక్కడ ఉంటే అక్కడ తప్పక వినియోగించుకోవాలని అన్నారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ 96 శాతం పూర్తి చేసినట్లు, ఓటరు స్లిప్పు తీసుకొనని వారు, తమ ఓటు పోలింగ్ కేంద్రంలో నమోదై ఉంటే చాలని, వెళ్లి ఓటు వేయవచని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.

Thursday, 9 May 2024

కీలక దశలోకి చేరాం:...కౌంట్ డౌన్ షురూ...


ఖమ్మం, మే 9: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చివరి 72గంటలు చాలా కీలకమైనవని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర నంద్ మిశ్రా లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏసీపీలతో పోలింగ్ కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ లో చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ,  పోలింగ్ కు 48 గంటల ముందు చాలా కీలకమని అన్నారు. మైకులు, డీజేలునిషేధించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 11వ తేది సాయంత్రం 6 గంటలకు ముగించాలని తెలిపారు. అయితే ఐదుగురితో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకోవచ్చుని అన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజు పాటించాల్సిన నియమాల గురించి వివరించారు. కరపత్రాలు, పోస్టర్ల పంపిణీ చేయరాదని తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో జిల్లా వ్యాప్తంగా సీఆర్‌పీసీ 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ప్రచార ప్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఉంచరాదని తెలిపారు. అలాగే లౌడ్‌స్పీకర్లను వాడరాదని చెప్పారు. ఈ సమయం తర్వాత నియోజకవర్గానికి బయట వ్యక్తులు ఉండరాదని తెలిపారు. అన్ని లాడ్జీలు, హోటళ్ళు కళ్యాణమండపాలు, అతిధిగృహాలను తనిఖీలు చేయాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి 48 గంటల ముందు నుండి మద్యం షాపులను మూసివేయాలని తెలిపారు. ఫంక్షన్ హాళ్ళల్లో కులసంఘాలు, ప్రొఫెషనల్ సంఘాల సమావేశాలు జరగకుండా చూడాలన్నారు. టివిల్లో ఇంటర్వ్యూలు నిషేధం ఉంటాయన్నారు. ప్రింట్ మీడియాలో పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు ఎంసిఎంసి కమిటీ అనుమతి పొందిన యాడ్ లు మాత్రమే ప్రచురించాలన్నారు. ఎక్సైజ్ శాఖ మద్యం నియంత్రణ కు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఓటింగ్ వంద శాతం జరిగేలా స్వీప్ కార్యాచరణ క్రింద కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. నేడు సాయంత్రం నూతన కలెక్టరేట్ నుండి పెవిలియన్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. మే 13 న పోలింగ్ లో పాల్గొని ఓటు వేయాలని కోరుతూ బల్క్ ఎస్ఎంఎస్ లు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ పూర్తిచేసినట్లు ఆయన అన్నారు. ఓటరు సమాచార స్లిప్పులతో పాటు, ఓటర్ గైడ్ అందజేసి, సి విజిల్ యాప్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. స్వచ్ఛ ఆటోలు, వాహనాల ద్వారా విస్తృత ప్రచారంతో ఓటర్లలో చైతన్యానికి చర్యలు చేపట్టామన్నారు. దివ్యాoగులు, వయోవృద్ధుల కొరకు పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఇట్టి వాహనాలను పోలింగ్ కేంద్రం కారిడార్ వరకు అనుమతించాలన్నారు. పోటీ అభ్యర్థులు, ఏజెంట్లు గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రం లోనికి అనుమతించాలన్నారు. మీడియా వారికి ఎన్నికల సంఘముచే జారీచేసిన అథారిటీ పాసులు ఉన్నవారికి పోలింగ్ కేంద్రం లోకేషన్ కి అనుమతించాలన్నారు. ఫిర్యాదులను వెంటనే స్పందించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో, రిషిప్షన్ కేంద్రం ఖమ్మం శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్ల లో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, ప్రలోభాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన పై దృష్టి పెట్టాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు పెంచాలన్నారు. ప్రతి వాహనం తనిఖీ చేయసలన్నారు. స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల కు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, వేణుగోపాల్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, సిఐఎస్ఎఫ్ అధికారులు మల్కీత్ సింగ్, మనోజ్ కుమార్, ఎస్డీసి రాజేశ్వరి, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, మధు, ఏఎస్పీలు, డిఎస్పీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 8 May 2024

పోలింగ్ సిబ్బందికి సామాగ్రితో పాటు వెల్ఫేర్ కిట్ : జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్


ఖమ్మం, మే 8: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలింగ్ అధికారుల విధుల నిర్వహణపై ఉపాధ్యాయ యూనియన్లతో  రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద శాతం పోలింగ్ సిబ్బంది పోలింగ్ విధులకు హాజరు కావాలన్నారు. పోలింగ్ సామాగ్రి తీసుకొనుటకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో, రిషిప్షన్ కేంద్రాల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన అన్నారు. చల్లని త్రాగునీరు, అల్పాహారం, భోజన సౌకర్యం కల్పించామన్నారు. పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ కేంద్రం నుండి రిషిప్షన్ కేంద్రానికి, తిరిగి ప్రధాన కార్యస్థానానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, ఇడిసి లు జారీచేసినట్లు, వీటిద్వారా తమ ఓటుహక్కు ను వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారితోషకం చెల్లిస్తామన్నారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ తో పాటు, వెల్ ఫెర్ కిట్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బంది సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, డిఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ, పిఆర్టియు ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఎస్టీయూ ప్రతినిధులు మాధవరావు, ఎస్కె. కరామత్ అలీ, టీఎస్ టీటీఎఫ్ ప్రతినిధులు పాపాలాల్, మంగ్యా నాయక్, టీఎస్ యూటీఎఫ్ ప్రతినిధులు రంజాన్, జీవిఎన్ఎం రావు, ఎస్టీఎఫ్ ప్రతినిధులు యాదగిరి, మన్సూర్, టీపిటీఎఫ్ ప్రతినిధులు విజయ్, నాగేశ్వరరావు, ఆర్యుపిపిటీఎస్ ప్రతినిధులు సుచరిత, ఉమాదేవి, టీఎస్జీహెచ్ఎంఏ ప్రతినిధులు వీరస్వామి, పీఆర్టియుటీఎస్ ప్రతినిధులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప ఆశీస్సులు అందుకున్న నామ... ఆలయంలో ప్రత్యేక పూజలు...

ఖమ్మం : బీఆర్ఎస్  ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఉదయం ఖమ్మం నగరంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో నామ గారికి స్వాగతం పలికి, పూజా కార్యక్రమాలు నిర్వహించి, నామ గారిని ఆశీర్వదించి, దీవించారు. ఈ  కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చిల్లంచర్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాయపూడి వెంకట రమణ ( వెంకట్ బీ) , కోశాధికారి పసుమర్తి రంగారావు, ఉపాధ్యక్షులు మేళ్ళచెర్వు వెంకటేశ్వరరావు, అర్వపల్లి అశోక్ కుమార్, కటకం రఘు, పార్టీ రఘునాధపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్, నామ సీతయ్య,మోరంపూడి ప్రసాద్, జి. వీరభద్రం, చీకటి రాంబాబు, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 7 May 2024

ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ రోడ్ షో.... RRRను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి..

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రామసాయం రఘురాం రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ సినిమా యాక్టర్ దగ్గుపాటి వెంకటేష్ గారు ఖమ్మంలో మయూరి సెంటర్ నుంచి,  జెడ్పీ సెంటర్ మీదుగా ఖమ్మం జిల్లా కోర్టు వరకు రోడ్డు షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రేణుక చౌదరి తదితరులతో కలిసి వెంకటేష్ రోడ్ షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారి చేతి గుర్తుకి,  ఈనెల 13వ తారీకున జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  వెంకటేష్ ని చూడటానికి పట్టణంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చాలామంది యువత,  మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,  సీనియర్ నాయకులు మానుకొండ రాధా కిషోర్,  ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ / రాష్ట్ర అధికార ప్రతినిధి డా//  మద్ది శ్రీనివాస్ రెడ్డి,  కమర్తపు మురళి, జావేద్, పోటు అభిలాష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.                                            

Monday, 6 May 2024

వేసవి వేడితో వన్యప్రాణుల విల విల... ఎండల తీవ్రతకు చిరుత మృతి*

నారాయణపేట జిల్లా:మే 06
తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. 
ఓవైపు రోజురోజుకు పెరుగు తోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ ఎండలకు తట్టుకోలేక ప్రజలు వడదెబ్బలకు గురవుతున్నారు.మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, పెరుగుతోన్న ఎండలకు జంతువులు కూడా మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదవరావుపల్లిలో చిరు తపులి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరులోని కాలిపోయిన వరి పొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. వృక్షసంపద లేని ప్రాంతం కావడంతో.. వన్యప్రాణులు తలదాచకునేందుకు కనీసం నీడ కూడా లేదంంట. 
దీంతో జంతువుల మనుగడ పెను సవాలుగా మారిందని నారాయణపేట డీఎఫ్‌వో వీణ్ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు రెవెన్యూ భూమి లో కనీసం నాలుగు చిరుత లు ఉంటాయని, ఇవి నివసించే గుట్టల్లో చెట్లు లేకపోవడంతో వేడిగాలు లతో విపరీతంగా ఇబ్బం దులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వేడి తట్టుకోలేక చిరుతపులి మృతి చెందింది.

అరుణగిరిలో రమణుల ఐక్యం... నేడు భగవాన్ రమణుల తిరు ఆరాధనోత్సవం...

భగవాన్ ఏప్రిల్ 14, 1950 నైట్ 8.47 కి శివెక్యము చెందారు , అందరూ చూస్తూ ఉండగానే ఒక కాంతి పుంజము భగవాన్ శరీరములో నుంచి వచ్చి అరుణాచలము చుట్టూ ప్రదిక్షణ చేసి అ కొండ లోనే కలిసిపోయింది ( కొన్ని వేల మంది దాన్ని చూసి తరించారు , ఇప్పటికీ కొంత మంది చూసిన వాళ్లు బ్రతికి ఉన్నారు , ఫారినర్స్ కెమెరాస్ లో బంధించారు ) … తిథి ప్రకారం ఈ రోజు 74 వ ఆరాధన కార్యక్రమము అరుణాచలము రమణాశ్రమము లో తెల్లవారుజామున నుంచి చాలా ప్రశాంతంగా జరుగుతుంది…అపర సుబ్రహ్మణ్యుడి అవతారము , అచ్చము పళని లో ఎలా ఉంటారో దేవుడు అలానే అ గోచీ తోనే భగవాన్ చివరివరకు బ్రతికారు .. అందుకే అందరూ సుబ్రమణ్యస్వామి అవుతారము గా కొలుస్తారు (అందుకే ఆశ్రమం లో ఎటు చూసిన నెమళ్లతో నిండి ఉంటుంది … అక్కడ జంతు వైరము ఉండదు ) .. దేవుడు భూమి మీదకి వచ్చి మనిషి ఎలా బ్రతకాలో , దేన్ని వదులుకోవాలో మనకు దారి చూపించి వెళ్లారు ….. 
మన శరీరము కి మాత్రమే మరణము .. ఆత్మ కి మరణము లేదు అని చెప్పారు , ఆత్మస్వరూపుడు స్వామి ,  నిజమే భగవాన్ ఇప్పటికీ అక్కడ కూర్చునట్టే ఉంటారు , మనము చెప్పేవి అన్ని మౌనంగా వింటారు ( తన తత్వమే మౌనము కద) ఎంతో ప్రశాంతతని ఇస్తారు .. నిన్ను ముందు నువ్వు ఎవరో తెలుసుకో నేనే నేనే నాదే అన్న పదాలకి ముందు నువ్వు అన్న ఐడెంటిటీ ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోమని ఎంతోమంది జీవితాలకు దారి చూపిన భగవాన్ రమణ మహర్షి గురుంచి ఎంత చెప్పినా తక్కవే అరుణాచల రమణ మీకు నా శతకోటి ప్రణామాలు ప్రత్యేక పూజలు టీవీ లైవ్ లో చూస్తుంటేనే అద్భుతంగా ఉంది .. ఈ రోజు అక్కడే ఉండి దగ్గరగా చూసే వాళ్లు ఇంక ఎంత అదృష్టవంతులో 😇.. తిరువణ్ణామలై నుంచి నిహారిక రెడ్డి సౌజన్యంతో 
Bhagavan Sri Ramana Maharshi’s 74th ARADHANA - 06.05.2024 
Bhagavan's profound words echoed throughout the gathering, reminding all of his eternal presence: “They say that I am dying, but I am not going away. Where could I go? I am here.” He elucidated further in his teachings, emphasizing the essence of the Guru beyond the physical form: "You mistake the body for the Guru. But the Guru does not think so himself.He is the formless Self. That is within you; he appears without only to guide you."On this day of remembrance, let us reflect on Bhagavan’s profound wisdom: "The Self can be reached only by 'dying'; but (this) dying does not consist in destruction of the body; one should understand that true death is the extinction of the ideas 'I' and 'mine.'"
@ Niharika Reddy... Tiruvannamalai 

ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ వీపీ గౌతమ్


ఖమ్మం, మే 6: ఇవిఎం యంత్రాల కమీషనింగ్ ప్రక్రియ సోమవారం లోగా పూర్తగుతుందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం రిటర్నింగ్ అధికారి, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే తో కలిసి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవియం యంత్రాల, వివిపాట్ల కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన 355, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన 290 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్ లు, వివిప్యాట్ ల కమీషనింగ్ చేపడున్నట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ యూనిట్ల పొందికలో జాగ్రత్తలు వహించాలని, సంబంధిత సీలింగులు జాగ్రత్తగా చేయాలని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారిణి ఎం. రాజేశ్వరి, అధికారులు, తదితరులు వున్నారు.

నా ప్రాణం వున్నంత వరకు మీతోనే... ఎన్నికల ప్రచారంలో నామ ఉద్వేగం...

నా ప్రాణం ఉన్నంత వరకూ మీతోనే నేను... నన్ను కాపాడుకునే బాధ్యత మీదే .. ప్రజలకే నా జీవితం అంకితం అంటూ ఉద్వేగ భరితమయ్యారు ఖమ్మం పార్లమెంట్ బరాసా అభ్యర్థి నామ నాగేశ్వరరావు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలకేంద్రంలో రోడ్డు షోలో ఆయన మాట్లాడారు.
 ప్రజద ఆశీస్సులు..ప్రజల దీవెనలతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అద్భుత విజయంతో చరిత్ర తిరగ రాయబోతున్నామని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ముదిగొండ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఈసందర్భంగా రోడ్డు షోకు ప్రజలు బ్రహ్మ రధం పట్టి,మీ నామ నాగేశ్వరరావు తదితరులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ  ప్రజలే దేవుళ్ళు... వారి సేవకే నా జీవితం అంకితం...25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా... వారి మధ్యలో ఉంటూ  వారి సేవే పరమావధిగా పని చేస్తూ అండగా ఉంటున్నానని నామ పేర్కొన్నారు.తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఖమ్మం జిల్లా ప్రజలతోనే మమేకమై ఉంటానని చెప్పారు.  కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏకష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నానని, అలాగే తనను కూడా కాపాడుకోవాలని అన్నారు. ఈ జిల్లా రైతు బిడ్డను... పిలిస్తే పలుకుతాను...24 గంటలు నా ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయన్నారు. రెండు సార్లు పార్లమెంట్ కు వెళ్లి తెలంగాణా, జిల్లా ప్రయోజనాలు కోసం కేంద్రంతో కొట్లాడానని చెప్పారు. రైతు కు అండగా ఉండి,కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పోరాడి, తిప్పి కొట్టానని చెప్పారు.తాను ఎక్కడున్నా తన జిల్లా ప్రజల కోసమే తన ప్రాణం తాపత్రయ పడుతుందని తెలిపారు. నిత్యం ప్రజలతో ఉంటున్న తనను మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపితే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఓటు అడగడానికి వస్తున్న కాంగ్రెస్ వారిని ప్రజలు హామీల పై నిలదీయాలని, ఎందుకు మోసం చేశారో చెప్పాలని గర్జించాలని నామ అన్నారు.ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ మచ్చలేని నీతిమంతుడు నామ నాగేశ్వరరావు జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. అజాత శత్రువు నామ అని, ఆయన్ని గెలిపించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి కి అవకాశం కల్పించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో  జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు,  దుర్గ, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Friday, 3 May 2024

పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి.. నిబంధనలు పాటించండి.. కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, మే 3 : భారత ఎన్నికల కమీషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించాలని, అందుకు పూర్తిగా సన్నద్ధం కావాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం రిటర్నింగ్ అధికారి, స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలల్లో పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై అవగాహన కలిగి, సమస్య ఉత్పన్నమైతే అనుసరించాల్సిన విధి, విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ అధికారులు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ ఏజెంట్లు రాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసి తర్వాత మాక్ పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందజేయాలని,  పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఇవిఎం యంత్రాలపై పీవో, ఏపీవో, ఓపివో లందరికి హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించినట్లు, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, తహశీల్దార్లు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Thursday, 2 May 2024

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ


సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ ప్రారంభించిన ‘బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమంలో భాగంగా వారితో చర్చలు జరిపినట్లు నడ్డా తెలిపారు.
Bhartiya Janata party president JP nadda call them a meeting and Had an engaging discussion on BJP's election campaign strategies and the overall electoral process with representatives of eighteen political parties from ten countries at the BJP HQ. It was a part of our 'Know BJP' initiative. This initiative isn't just about sharing our achievements; it's about inspiring others by showcasing the contributions and sacrifices BJP has made for nation-building.

లక్ష్యం కోసం ప్రణాళికతో ముందుకు సాగండి : కలెక్టర్ వి.పి.గౌతమ్

ఖమ్మం, మే 2: ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఎస్ఎస్ సి- 2024 వార్షిక ఫలితాలలో 10  కి 10 జిపీఏ సాధించిన 16 మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను గురువారం నూతన కలెక్టరేట్ లో విద్యాశాఖచే నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, విద్యార్థులను అభినందించి, శాలువా తో సత్కరించి, జ్ఞాపిక ను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులు ప్రోత్సహించి, వారు ఎంచుకున్న లక్ష్య సాధనకు సహకరించాలన్నారు. విద్యార్థులు పరీక్షకు ఎలా సంసిద్ధమయ్యారు, వారి కుటుంబ నేపథ్యం, వారి భవిష్యత్ ప్రణాళికలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆ లక్ష్యసాధనకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. దీనికోసం విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ తరఫున తగిన మార్గదర్శనం చేయాలని ఆయన తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిఈఓ సోమశేఖర శర్మ, సిఎంఓ రాజశేఖర్, డిసీఈబి కార్యదర్శి నారాయణ, ఆర్ సి ఓ లు ప్రత్యూష, అంజలి, విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.