భద్రాచలం : కొండగట్టు అంజన్నకు భద్రాచలం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం తరఫున కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు, స్వామివారికి ఇష్టమైన వడమాల.. అప్పాల మాలలు.ఈవో రమాదేవి గురువారం అందజేశారు. అర్చకులతో కలిసి ఆమె కొండగట్టులో హనుమత్ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, శేషమాలికలు కొండగట్టు ఆలయ అర్చకులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాలతో కొండగట్టు అర్చకులు స్వాగతం పలికారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
No comments:
Post a Comment