ఖమ్మం : బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఉదయం ఖమ్మం నగరంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో నామ గారికి స్వాగతం పలికి, పూజా కార్యక్రమాలు నిర్వహించి, నామ గారిని ఆశీర్వదించి, దీవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చిల్లంచర్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాయపూడి వెంకట రమణ ( వెంకట్ బీ) , కోశాధికారి పసుమర్తి రంగారావు, ఉపాధ్యక్షులు మేళ్ళచెర్వు వెంకటేశ్వరరావు, అర్వపల్లి అశోక్ కుమార్, కటకం రఘు, పార్టీ రఘునాధపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్, నామ సీతయ్య,మోరంపూడి ప్రసాద్, జి. వీరభద్రం, చీకటి రాంబాబు, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment