తిరుమల శ్రీవారి దర్శనం, సేవలకు సంబంధించి ఓ భక్తుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి మరీ సాధించుకున్నారు. టీటీడీపై పిటిషనద్ దాఖలు చేయగా.. తీర్పును వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన సుమిత్రా శెట్టి, ఆమె కుమారుడు హరీశ్ శెట్టి 2007 ఆగస్టు 21న తిరుమల శ్రీవారి మేల్‌చాట్ వస్త్రం (ఆర్జిత సేవ)లో పాల్గొనేందుకు రూ.12,500 చెల్లించారు. అలాగే హరీశ్‌శెట్టి 2008 డిసెంబర్ 17న తిరుమల శ్రీవారి తిరుప్పావడ సేవ నిమిత్తం రూ.5 వేలు చెల్లించారు.
2021 సెప్టెంబర్ 9న హరీశ్ శెట్టికి , 2021 సెప్టెంబర్ 10న సుమిత్రా శెట్టికి ఈ సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ ఖరారు చేసింది. ఆ తర్వాత కరోనా కారణంగా టీటీడీ దర్శనాలు, ఆర్జిత సేవల్ని రద్దు చేసింది. అయితే ఆ తర్వత కూడా సుమిత్రాశెట్టి అదనంగా మరో రూ.3,065 పంపించి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని టీటీడీని కోరారు. కానీ అదనంగా పంపించిన డీడీని తిరిగి వారికే టీటీడీ పంపించింది.సేవలకు వీలు కాదని టీటీడీ వారికి లేఖ రాసింది. దీంతో సుమిత్రాశెట్టి, హరీశ్ శెట్టి టీటీడీకి లీగల్ నోటీసులను పంపించారు.టీటీడీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారిద్దరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఇద్దరి ఫిర్యాదుపై టీటీడీ స్పందించి తమ కేసు కొట్టి వేయాలని కోరారు.. సుమిత్రా శెట్టి, హరీశ్ శెట్టి చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేస్తామని ఫోరాన్ని అడిగారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేసిన ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో మేల్‌చాట్ వస్త్రం, తిరుప్పావడ సేవల్లో పాల్గొనే అవకాశం వారిద్దరికి కల్పించాలని
వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఒకవేళ కుదరని పక్షంలో రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఈ మేరకు వినియోగదారుల ఫోరం తీర్పును ఇటీవల వెల్లడించింది. మరి ఈ తీర్పుపై టీటీడీ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.. వారికి శ్రీవారి
No comments:
Post a Comment