ఖమ్మం, మే 13: కలెక్టర్క ఓటు సాంప్రదాయాన్ని పాటించారు ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ దంపతులు సామాన్యుల్లా క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం రిటర్నింగ్ అధికారి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య 195 లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, లోకసభ సాధారణ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతున్నట్లు, జిల్లా అటవీ అధికారి కార్యాలయం పోలింగ్ కేంద్రంలో ఉన్న తమ ఓటు హక్కును తాము బాధ్యతగా వచ్చి వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు తమకు అందించిన పోలింగ్ స్లిప్పులతో పాటు ఓటర్ ఐ.డి. కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ఎన్నికల్లో మనమంతా భాగస్వామ్యం కావాలని, ప్రతి ఒక్క ఓటరు ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment