ఖమ్మం, మే 6: ఇవిఎం యంత్రాల కమీషనింగ్ ప్రక్రియ సోమవారం లోగా పూర్తగుతుందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం రిటర్నింగ్ అధికారి, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే తో కలిసి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవియం యంత్రాల, వివిపాట్ల కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన 355, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన 290 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్ లు, వివిప్యాట్ ల కమీషనింగ్ చేపడున్నట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ యూనిట్ల పొందికలో జాగ్రత్తలు వహించాలని, సంబంధిత సీలింగులు జాగ్రత్తగా చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారిణి ఎం. రాజేశ్వరి, అధికారులు, తదితరులు వున్నారు.
No comments:
Post a Comment