నా ప్రాణం ఉన్నంత వరకూ మీతోనే నేను... నన్ను కాపాడుకునే బాధ్యత మీదే .. ప్రజలకే నా జీవితం అంకితం అంటూ ఉద్వేగ భరితమయ్యారు ఖమ్మం పార్లమెంట్ బరాసా అభ్యర్థి నామ నాగేశ్వరరావు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలకేంద్రంలో రోడ్డు షోలో ఆయన మాట్లాడారు.
ప్రజద ఆశీస్సులు..ప్రజల దీవెనలతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అద్భుత విజయంతో చరిత్ర తిరగ రాయబోతున్నామని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ముదిగొండ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసందర్భంగా రోడ్డు షోకు ప్రజలు బ్రహ్మ రధం పట్టి,మీ నామ నాగేశ్వరరావు తదితరులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు... వారి సేవకే నా జీవితం అంకితం...25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా... వారి మధ్యలో ఉంటూ వారి సేవే పరమావధిగా పని చేస్తూ అండగా ఉంటున్నానని నామ పేర్కొన్నారు.తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఖమ్మం జిల్లా ప్రజలతోనే మమేకమై ఉంటానని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏకష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నానని, అలాగే తనను కూడా కాపాడుకోవాలని అన్నారు. ఈ జిల్లా రైతు బిడ్డను... పిలిస్తే పలుకుతాను...24 గంటలు నా ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయన్నారు. రెండు సార్లు పార్లమెంట్ కు వెళ్లి తెలంగాణా, జిల్లా ప్రయోజనాలు కోసం కేంద్రంతో కొట్లాడానని చెప్పారు. రైతు కు అండగా ఉండి,కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పోరాడి, తిప్పి కొట్టానని చెప్పారు.తాను ఎక్కడున్నా తన జిల్లా ప్రజల కోసమే తన ప్రాణం తాపత్రయ పడుతుందని తెలిపారు. నిత్యం ప్రజలతో ఉంటున్న తనను మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపితే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఓటు అడగడానికి వస్తున్న కాంగ్రెస్ వారిని ప్రజలు హామీల పై నిలదీయాలని, ఎందుకు మోసం చేశారో చెప్పాలని గర్జించాలని నామ అన్నారు.ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ మచ్చలేని నీతిమంతుడు నామ నాగేశ్వరరావు జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. అజాత శత్రువు నామ అని, ఆయన్ని గెలిపించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి కి అవకాశం కల్పించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, దుర్గ, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment