ఆకర్ణణగా నిలిచిన దేవాపూర్ మహిళా పోలింగ్ స్టేషన్
-- బెల్లంపల్లి ఏ ఆర్వో రాహుల్ ఐ ఏ యస్ చొరవతో 13వ పోలింగ్ స్టేషన్ కు ప్రత్యేక అలంకరణ.
సోమవారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది సంబంధిత ప్రాంతాలకు చేరుకున్నారు.దేవాపూర్ లోని 13వ పోలింగ్ స్టేషన్ మహిళా పోలింగ్ స్టేషన్ గా ప్రకటించారు. ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలోని పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఘన స్వాగతం పలికారు.బొట్టు పెట్టి హారతులు ఇచ్చి పూల బొకేలతో ప్రత్యేక స్వాగతం పలికి సిబ్బందిని సంతోషపెట్టారు. దింసా నృత్యం, సన్నాయి మేళ తాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సిబ్బంది దేవాపూర్ లోని పోలింగ్ స్టేషన్లో అన్నింటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేల తాళాలు తో పోలింగ్ సిబ్బందికి ఘన స్వాగతం పలకడంతో పాటు వారికి షర్బత్ అందించి ఉత్తమ పోలింగ్ నిర్వహించవలసిందిగా ఆహ్వానం పలికారు. చక్కటి ఏర్పాట్లను చూసిన పోలింగ్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దేవాపూర్ రెండవ సెక్టార్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ లలో సౌకర్యాలు చాలా చక్కగా ఏర్పాటు చేయడం పట్ల సెక్టార్ ఆఫీసర్ ఐనాల సైదులు సంతృప్తి వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment