ఖమ్మం, మే 8: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలింగ్ అధికారుల విధుల నిర్వహణపై ఉపాధ్యాయ యూనియన్లతో రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద శాతం పోలింగ్ సిబ్బంది పోలింగ్ విధులకు హాజరు కావాలన్నారు. పోలింగ్ సామాగ్రి తీసుకొనుటకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో, రిషిప్షన్ కేంద్రాల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన అన్నారు. చల్లని త్రాగునీరు, అల్పాహారం, భోజన సౌకర్యం కల్పించామన్నారు. పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ కేంద్రం నుండి రిషిప్షన్ కేంద్రానికి, తిరిగి ప్రధాన కార్యస్థానానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, ఇడిసి లు జారీచేసినట్లు, వీటిద్వారా తమ ఓటుహక్కు ను వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారితోషకం చెల్లిస్తామన్నారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ తో పాటు, వెల్ ఫెర్ కిట్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బంది సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, డిఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ, పిఆర్టియు ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఎస్టీయూ ప్రతినిధులు మాధవరావు, ఎస్కె. కరామత్ అలీ, టీఎస్ టీటీఎఫ్ ప్రతినిధులు పాపాలాల్, మంగ్యా నాయక్, టీఎస్ యూటీఎఫ్ ప్రతినిధులు రంజాన్, జీవిఎన్ఎం రావు, ఎస్టీఎఫ్ ప్రతినిధులు యాదగిరి, మన్సూర్, టీపిటీఎఫ్ ప్రతినిధులు విజయ్, నాగేశ్వరరావు, ఆర్యుపిపిటీఎస్ ప్రతినిధులు సుచరిత, ఉమాదేవి, టీఎస్జీహెచ్ఎంఏ ప్రతినిధులు వీరస్వామి, పీఆర్టియుటీఎస్ ప్రతినిధులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment