Friday, 31 May 2024
తం సూర్యం ప్రణమామ్యహం అన్న మోడీ..
తమిళనాడు : నడి వేసవి లో ప్రధాని నరేంద్ర మోడీ తం సూర్యం ప్రణమామ్యహం అన్నారు.. తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలో నిమగ్నమైన ప్రధాని నరేంద్ర మోదీ. కన్యాకుమారి సముద్రం వద్ద సూర్యోదయాన్ని వీక్షించి. సూర్యునికి అర్ఘ్యం ఇచ్చారు. ఇది జ్ఞానోదయం కోసం స్వామి వివేకానంద తన జీవిత అన్వేషణ.. అనుబంధం కోసం ఎంపిక చేసుకున్న ప్రదేశం. 45 గంటల సుదీర్ఘ ధ్యాన దీక్షలో మోడీ కొనసాగనున్నారు.జూన్ 1 సాయంత్రం వరకు ఆయన ఈ అభ్యాసంలో కొనసాగేందుకు దీక్ష చేపట్టారు .కాగా 131 సంవత్సరాల క్రితం చికాగోలో ప్రపంచ సర్వ మత మహా సభలలో ప్రసంగానికి ముందు వివేకానంద ధ్యానం చేసిన పవిత్ర పుణ్యస్థలం లోనే ప్రస్తుతం నరేంద్ర మోదీ 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నారు. స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం హిందూ జీవన విధానానికి నూతన దిశను చూపించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment