ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రామసాయం రఘురాం రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ సినిమా యాక్టర్ దగ్గుపాటి వెంకటేష్ గారు ఖమ్మంలో మయూరి సెంటర్ నుంచి, జెడ్పీ సెంటర్ మీదుగా ఖమ్మం జిల్లా కోర్టు వరకు రోడ్డు షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రేణుక చౌదరి తదితరులతో కలిసి వెంకటేష్ రోడ్ షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారి చేతి గుర్తుకి, ఈనెల 13వ తారీకున జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెంకటేష్ ని చూడటానికి పట్టణంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చాలామంది యువత, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు మానుకొండ రాధా కిషోర్, ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ / రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి, కమర్తపు మురళి, జావేద్, పోటు అభిలాష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment