ఆ కార్యక్రమానికి హాజరైన సి.పి.రాజకొండ..మహేష్ ఎం భగవత్ ..కార్మికులకు నమస్కరించి సామగ్రిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఇటీవల మణిపూర్ హిల్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఆ ప్రాంత వాసులను ఇదే పద్దతిలో సరుకులను పంపిణీ చేయగా రాచకొండ సి.పి. నమస్కారం తో కార్మికులను సరుకులు తీసుకోవాలని సూచించడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
Thursday, 30 April 2020
నమస్కారంతో నిత్యావసరలను అందజేసిన సి.పి. : మహేష్ భగవత్.
రాచకొండ సి.పి. పారిశుధ్య కార్మికులకు నమస్కరించారు..మేమివ్వటం కాదు మీరే తీసుకోండి అంటూ నిత్యవసర సరుకులను వారిని తీసుకోమ్మన్నారు..చర్లపల్లి ఏరియాలోని అక్సఫోర్డు గ్రామర్ స్కూల్ యాజమాన్యం పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసర సరుకులను అందజేయగా
Sunday, 26 April 2020
విధి నిర్వహణలో ఇంటి ఇంటికి పాఠం...
అలూరి రమ్యకృష్ణ.. గుంటూరు జిల్లాకు చెందిన ..MCA..,చదివిన యువ కేరటం..3 సంవత్సరాల క్రితం ఢిల్లీ స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటిలో విజేత గా నిలిచింది.. మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలో తండ్రి ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడు కావడంతో ఉపాధ్యాయ వృత్తి కొంత కాలం నిర్వహించింది. అటుపై ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తు..ఇటివల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై విధ్యా సహాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది... కరోనా లాకౌట్ సమయంలో తాను బాధ్యతలు నిర్వహిస్తున్న బాపట్ల నియోజకవర్గ పరిధిలోని అప్పికట్ల లో ఇంటి ఇంటికి తిరిగి ప్రభుత్వ సహాయాన్ని అందజేయడంతో కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలని ఆ ప్రాంతవాసులకు జాగృత్తలు చెప్పింది.. ప్రస్తుతం అదే గ్రామంలో ఇల్లు. ఇల్లు తిరుగుతూ 10వ తరగతి విధ్యార్థులకు సబ్జెక్టులలో వున్న అనుమానాలు నివృత్తి చేస్తు తన కర్తవ్యం నిర్వర్తించే పనిలో...నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే డబ్బులు బాగా వచ్ఛేవి కదా అని నేను అన్నప్పుడు.. నాకు ఈ ఉద్యోగం సంతృప్తి నిస్తోందని ఇలా ప్రజలకు సేవ అందించే అవకాశం ఎ కొద్ది మందికోనేగా దొరికేది అంటూ బదులిచ్ఛింది..💐💐💐భారత దేశానికి ఇటువంటి యువ కేరటాలు అవసరం ఎంతో వుంది అందమా మరీ...💐💐💐💐@మణికుమార్,
Monday, 20 April 2020
కరోనా కాలంలో.. తెనాలి విందు భలే పసందు..
అపన్నులను ఆదుకోవడంలో తెనాలి లో ఓ ట్రస్ట్ ముందు వరుసలో నిలిచింది..ఏదో ఒకటి చేసేశాం అనకుండా..అందరికీ శుచిగా..రుచిగా వండి. వార్చి ఇంటి భోజనం అందజేస్తోంది.. లాకౌట్ లో ఇబ్బందులు పడుతున్న కొన్ని కాలనీలకు ఆటోలో ఆహార పదార్థాలు తీసుకుని వెళ్లి వేడి తగ్గకముందే వడ్డించేస్తోంది..వీరు వితరణ చేస్తున్న వంటల్లో.. మైసూర్ బొండాలు.. పోకోడిలు..పూర్ణాలు వంటివి అది వేడి వేడిగా.. అంటే ఈ టైంలో ఇంతగా చేస్తున్నారా అఃటూ అశ్చర్యపోవిల్సిందే.
1.గోధుమ రవ్వ ఉప్మా 50కిలోలు దోస ఆవకాయ.
దద్ద్యోజనం25 కిలోలు అన్నం150 కిలోలు సొరకాయ గోంగూర పులుసు కూర ..సాంబారు .... వితరణ
2క్వింటాళ్లు ఆకుకూర టొమాటో మామిడికాయ పప్పు 60 కిలోలు.. దోసకాయ వంకాయ టొమాటో పచ్చిమిర్చి కలిపి రోటి పచ్చడి 100కిలోలు .... వితరణ
3.ఆహారపదార్థముల వితరణలో భాగంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పిల్లులు చాలా మంది పొద్దునే మాకు బాగా ఆకలిగా ఉంది ఏమన్నా ఉంటే పెట్టండి అని అడిగారు.. చాలా బాధ అనిపించింది. వాళ్ళకి పొద్దున్నే 8 గంటలకు ఉప్మా పెట్టాం ...
ఇంకొక ప్రాంతంలో వాళ్ళు దద్ద్యోజనం మీరు చేస్తే బాగుంటుంది అయ్యా కావాలి అంటే అక్కడకి 25కిలోల అన్నంలో 25 లీటర్ల పెరుగుతో దద్దోజనం..
4.పులిహోర 100కిలోలు అన్నం2క్వింటాళ్లు 80 కోలోల వంకాయ టొమాటో కూర బంగాళదుంప కూర సొరకాయ టొమాటో ఆకుకూర పెసరపప్పు వేసి పప్పు..25 కిలోలు నేతితిరగమోతతో .
5.150 కిలోల పిండితో మైసూర్ బోండా ,, టొమాటో సొరకాయ పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర అవి వేసి పచ్చడి50 కిలోలు.... వితరణ
కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్ కారణంగా తెనాలిలో స్వీయనిర్భంధంలో ఉన్న ఎంతో మంది నిరాశ్రయులకి అన్నార్తులకు ఆహారపదార్థముల వితరణలో భాగంగా శ్రీరామాయణ నవాహ్నిక జ్ఞాన యజ్ఞ ట్రస్ట్. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర గురు పాదుకా పీఠం ఆధ్వర్యంలో బ్ర||వే||విష్ణుభట్ల ఆంజనేయులుగారి వారి సంకల్పానుసారం గత 27 రోజుల నుంచి నిరిఘ్నంగా అనేక రకముల ఆహారపదార్థముల వితరణ జరుగుతోందని వారి కుమారుడు యజ్జ విష్ణుభట్ల వివరించారు.వండిన వంట వండకుండా వండి రోజుకి సుమారు వెయ్యి మందికి పైగా పేద ప్రజలు ఉండే కాలనీలకు వెళ్ళి స్వయంగా ఆహారాన్ని అందిస్తున్నారు....
రోజు వితరణలో భాగంగా అందరికీ అన్నం కూర పచ్చడి చేసి అనేక ప్రాంతాల్లో వితరణ చేయటం జరిగుతోందని..ఈ అన్నదాన విషయం తెలుసుకొని మాకు అనేక మంది అనేక ప్రాంతముల నుంచి దేశముల నుంచి ఫోన్లద్వారా మేసేజులా ద్వారా అనేక మంది అభినందనములు ఆశీర్వచనములు ఇస్తున్నారు అలాగే చాలా మంది సహకరిస్తున్నారు అందరికీ అనేక ధన్యవాదాలు.. ఇంకా అభివృద్ధిగా ఈ కార్యక్రములు పరమాచార్య స్వామి వారి అనుగ్రహముతో నడవాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Sunday, 19 April 2020
కరోనా హద్దులు దాటుతున్న ఆభిమానం.. మంత్రిగారి ఇబ్బందులు... కాని అది కఠినమైన కరోనా తస్మాత్ జాగ్రత్త సారు..!
ఖమ్మం : తన పుట్టినరోజు ఎవరూ స్వయంగా రావద్దంటూ మంత్రి పువ్వాడ అజయ్ ఎంత విజ్జపనలు చేసిన.. ఉరకలు వేసే అభిమానం అగడం లేదు..కరోనా కేకు రూపంలో మంత్రిగారి ముందుకు రావడంతో ఆయన ఆ కేక్ ను కట్ చేశారు. .కాదు కాదు ..కరోనాను ఖండించారు అందమా..
Saturday, 18 April 2020
మంత్రి గారి జన్మదిన ఏర్పాట్లు ఘనం... స్టికర్లు - సంచులు సూపర్ అంటున్న అభిమానులు..
పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10 వేల మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేనున్నట్లు పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఈ నెల 19వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా 10వేల నిత్యవసర సరుకుల కిట్స్,10వేల హ్యాండ్ శానిటైజర్లు, 3 రకాల కూరగాయలు. ఇంకా అవసరం మేరకు పంపిణీ చేస్తామని చెప్పారు. పంపిణీకి రెవెన్యూ సహకారం కోరడం జరిగిందని, సామాజిక దూరం పాటిస్తూ రెవెన్యూ శాఖ ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. ఆయా మొత్తం 10వేల కిట్స్ ను జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS గారు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి గారికి అందజేశారు. తనకు శుభాకాంక్షలు తెలపటానికి ఎవరు కలవకుడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఫోన్, వాట్సాప్ ద్వారానే శుభాకాంక్షలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా మీ చుట్టుపక్కల ఉన్న పేదాలను గుర్తించి వారికి సరుకులు, బియ్యం లాంటి వస్తువులు వితరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ గారు, RDO రవీంద్రనాథ్ గారు తదితరులు ఉన్నారు.
కాగా కరోనా లాకౌట్ సమయంలో మంత్రి గారు ..జన్మదినం సందర్భంగా 10వేల సంచులు. ఆయన బొమ్మలతో శానిటైజర్ లు తయారు చేయించడం అంటే మాటలు కాదని..ఎంతో మంది పనిచేసి వుంటారని...అంత మందికి పని కల్పించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
Wednesday, 15 April 2020
రకరకాల ప్రత్యమ్నాయాలు..అయినా 1500 వందలకు పేదలను బ్యాంకులకు పరుగులు పెట్టిస్తస్తున్న ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం కరోనా సహాయం క్రింద తెల్లరేషన్ కార్డు దారులకు
Sunday, 12 April 2020
సాయం ముద్దు...సెల్ఫీలు వద్దు..... లాకౌట్ సాయంలో ఫోటోల ప్రాపగండాపై కలేక్టర్ అసహనం...
.
రాజస్థాన్ / అజ్మీర్ : సాయం చేయడంలో సోషల్ డిష్టేన్సు పాటించకుండా సెల్పీలు..ఫోటో సెషన్స్ నిర్వహించడం పై రాజస్థాన్ ఆజ్మిర్ కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పేదలను ఇలా ఫోటోలు తీసి పబ్లిసిటీ ఇవ్వడం ఎంత వరకు సమంజసం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు సేల్పీలను ఆయన నిషేదించారు..
లాకౌట్ సమయంలో నగరంలో నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేసేటప్పుడు సెల్ఫీలు, ఛాయాచిత్రాలు లేదా వీడియోలు తీసుకోవడం అనుమతించబడదని అజ్మీర్ జిల్లా కలెక్టర్ విశ్వ మోహన్ శర్మ అన్నారు.
ఇటువంటి పద్ధతుల్లో పాల్గొన్న వ్యక్తులపై నేరారోపణలు జరుగుతాయని, వారిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 188 (ప్రభుత్వ ఉద్యోగి ప్రకటించిన ఆదేశానికి అవిధేయత) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందని కలెక్టర్ చెప్పారు.
అవసరమైనవారికి ఆహార ప్యాకెట్లు మరియు కిరాణా పంపిణీ ప్రచార చర్యగా మారిన తరువాత ఈ ఉత్తర్వు వచ్చింది. అలాంటి ఒక సంఘటనలో, అజ్మీర్‌లో ఎనిమిది మంది పేదలకు రెండు అరటిపండ్లు పంపిణీ చేయడాన్ని క్లిక్ చేశారు.
13 దేశాలకు 1.4 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ మొదటి దశలో పొందనున్న దేశాల జాబితా
👉"హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను పొందనున్న 13 దేశాల మొదటి జాబితాను భారత్ క్లియర్ చేసింది"
👉"మొదటి జాబితాలో ఉన్న దేశాల పేరు అమెరికా, స్పెయిన్, జర్మనీ, బహ్రెయిన్, బ్రెజిల్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, సీషెల్స్, మారిషస్ తోపాటు డొమినికన్ రిపబ్లిక్లు ఉన్నాయి"
👉"అమెరికా 48 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను కోరగా భారతదేశం 35.82 లక్షల టాబ్లెట్లను మంజూరు చేసింది"
👉"జర్మనీకి 50 లక్షల మాత్రలు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను కేటాయించింది"
👉"బ్రెజిల్‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ 50 లక్షల మాత్రలు లభిస్తాయి"
"👉కెనడాకు 50 లక్షల మాత్రలు కేటాయించారు"
"👉బంగ్లాదేశ్‌కు 20 లక్షల మాత్రలను మంజూరు చేశారు"
👉"నేపాల్‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ 10 లక్షల మాత్రలు లభిస్తాయి"
👉"భూటాన్‌కు 2 లక్షల మాత్రలు మంజూరు చేశారు"
👉"శ్రీలంకకు 10 లక్షల టాబ్లెట్లు హైడ్రాక్సీక్లోరోక్విన్ లభిస్తాయి"
👉"ఆఫ్ఘనిస్థాన్‌కు 5 లక్షల మాత్రలను కేటాయించారు"
"👉మాల్దీవులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ 2 లక్షల మాత్రలు లభిస్తాయి"
"👉కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశానికి ఒక కోటి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు అవసరం. అయితే ప్రస్తుతం భారతదేశం వద్ద 3.28 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల నిల్వలు ఉన్నాయి. ఆలాగే మరో 1-2 కోట్ల మాత్రలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నది"
#India To Send 1.4 Crore Hydroxychloroquine Tablets To 13 countries
#India has cleared first list of 13 countries for sending Hydroxychloroquine. The name of the countries in the first list are USA, Spain, Germany, Bahrain, Brazil, Nepal, Bhutan, Afghanistan, Maldives, Bangladesh, Seychelles, Mauritius & Dominican Republic.
#USA had asked for 48 lakh tablets of HCQ, India has sanctioned 35.82 lakh tablets.
Germany will also get 50 lakh tablets of Hydroxychloroquine.
Brazil will get 50 lakh tablets of Hydroxychloroquine.
Canada will get 50 lakh tablets of Hydroxychloroquine.
Bangladesh will get 20 lakh tablets of Hydroxychloroquine.
Nepal will get 10 lakh tablets of Hydroxychloroquine.i
Bhutan will get 2 lakh tablets of Hydroxychloroquine.
Sri Lanka will get 10 lakh tablets of Hydroxychloroquine.
Afghanistan will get 5 lakh tablets of Hydroxychloroquine.
Maldives will get 2 lakh tablets of Hydroxychloroquine.
According to Health ministry, India needs one crore Hydroxychloroquine tablets, and currently India has 3.28 crore Hydroxychloroquine tablets and 1-2 crore tablets can be produced.
News Source : Indian Defence News
Saturday, 11 April 2020
అమెరికాలో హనుమాన్ విజయ్ దివాస్..
ప్రముఖ గాయని అన్నమయ్య గీతాల సంకీర్తకురాలు శోభరాజ్ గుర్తున్నారా..తెలిసిన వాళ్లు ఓకే ..తెలియక పోతే గూగుల్ చెబుతుంది తెలుసుకునే ప్రయత్నం చేయండి.. ఇహ.అసలు విషయంలోకీ వద్దాం మిచిగాన్ లో భారతీయులు ఈ నెల 8న హనుమాన్ విజయోత్సవ వేడుకలు (కొందరు జయంతి అంటారు గాని జయంతి మే మాసంలో వస్తుంది) జరుపుకున్నారు..
నిజానికి అక్కడి భారతీయులు సాముహికంగా జరుపుకునే అనవాయితి ప్రస్తుతం వేసులుబాటు లేనందున ఎవరి ఇళ్లలో వారు జరుపుకున్నారు..
గాయనీ శోభారాజ్ మేనకోడలు శీతల్ తన కుటుంబంతో మిచిగాన్ లోని తమ నివాసంలో వేడుకల్ని భక్తి పూర్యకంగా..పిల్లలు హనుమాన్ ఛాలీశా..శీతల్ గాన కచ్ఛేరిలను చుట్టు పక్కల వారు ఫోన్ లైవ్లో చూసి ఆనందించారు..మరో విషేషం ఎంటంటే పిల్లలు స్వయంగా పిండి వంటలం చేయటమే కాకుండా హనుమకు వడమాల వేశారు.కరోనా ఆందోళన వదిలి హాయిగా హనుమ సంకీర్తన రామ సంకీర్తన చేయడం ద్వారా మానసిక దృడత్వం సమకూర్చుకోవడమే అంటున్నారు ప్రవచనకారులు.
శీతల్ హిందూ సంప్రదాయాలపై ఇంగ్లీషు లో రాసిన మ్యాటర్ ...
Yes. We pray to the Monkey God!
We also pray to the cow, the tree, the hill, the river, heck even our car and to people as well when we do Namasthe :)!
The concept here is not to only Pray over or Pray for others but to Pray to the Indweller inside all! Our gratitude makes us appreciate the good we see in all animate and inanimate beings. That attitude of reverence makes everything around us our teachers while acknowledging that we are all in this together 🙏!
Hinduism existed as Sanatana Dharma (ancient way of being) before the concept of religion came around.
The Golden rule is basic:
You respect. You will be respected.
And no...Monkeys are not prayed for coconut candy nor cows worshipped for milk shake! :)
The courage and compassion of a monkey is admired. The gentleness and generosity of a cow is revered! Qualities that mighty humans can learn that these humble creatures exhibit naturally!
Hanuman, whose festival we celebrate now is to invoke his virtues inside us...
of Faith, Surrender and Humility!
That's the only purpose we have so many god forms (all from same source) and so many festivals... to glorify one good virtue attributed to one god form and celebrate with joy that reminder 😊!
Mixed kids and creativity to make our version of the traditional festival offering...Vada mala :)!
Friday, 10 April 2020
అప్పుడు మెకిన్ ఇండియా కు ప్రధాని పిలుపు నిచ్ఛారు..ఇప్పుడు మెడ్ ఎట్ హోమ్ అంటున్నారు కేంద్ర మంత్రులు..
మెడిన్ ఇండియా భారత ప్రధాని మోదీ అనేక వెధికల ద్వారా ప్రజలకు ఎకరువు పెట్టిన మాట..కరోనా కష్టకాలంలో మన దేశంలో తయారైన మందులకు డిమాండ్ వచ్ఛింది.. ఇప్పుడు కరోనా కట్టడికి స్వీయ నిర్భందం .బయటకు రావాలంటే మాస్కులు తప్పనిసరి.. ఎవరో వచ్ఛి మాస్కులు ఇచ్ఛేదాక ఎదురు చూపులు ఎందుకు ఆ మాత్రం మాస్కు మనమే తయారు చేసుకోవచ్చు అంటూ కేంద్ర టెక్స్ట్ టైల్ మంత్రి స్మృతి ఇరానీ మాస్కు తయారు చేసేశారు..ఇహ కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ భార్య..కుమార్తెలు సామాజిక భాధ్యతను పంచుకొంటూ తమ ఇంట్లో రోజు కొన్ని మాస్కులను తయారు చేసి ప్రజలకు పంచుతున్నారు.. ఈ విషాయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.. తన కుటుంబం సమాజీక భాధ్యతను గుర్తేరిగి నడుచుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు..
Thursday, 9 April 2020
హనుమ సాయం మొదలైంది.. బ్రేజిల్ అధ్యక్షుని కృతజ్ఞత భారత్ అందుకుంది
కరోనా రోగులపై సానుకూల ఫలితాలను చూపించిన క్లిష్టమైన హెచ్‌సిక్యూ ఔషధం కోసం ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు మొగ్గు చూపుతోంది. ఇది కోవిడ్ రోగులపై చాలా విజయవంతంగా పనిచేస్తోందని వైధ్యులు నమ్మకం..ఫలితాలు సానుకూలంగా వుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అజిత్రోమైసిన్తో పాటు హెచ్‌సిక్యూని ఉపయోగించిన భారతీయ వైద్యుల సమూహం. భారత ఫార్మా రంగం ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ ఔషధాల ఉత్పత్తిదారులలో ఒకటి. కరోనా భారత దేశం తలుపు తట్టిన వెళ్ల దేశియ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం మార్చి 25న ఆ హైడ్రో క్లోరోక్యిన్ మందు ఎగుమతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది..అయితే ఈ మందు కోసం మొన్న అమెరికా.. నిన్న బ్రెజిల్ తో సహా మొత్తం 30 దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి.
కాగా బ్రేజిల్ అధ్యక్షుడు జైర్ బొల్శశానారో భారత ప్రధాని మోదీకి హైడ్రో క్లోరోక్యిన్ మందులను తమకు అందజేయలని కోరుతూ బుధవారం ఓ లేఖ రాశారు. తాము కూడా సదరు ఔషధం ఉత్పత్తి చేస్తున్నామని కాని ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అవి చాలడంలేదని ఆయన ఆ లేఖలో రాశారు.. మరో అడుగు ముందుకేసి రామయణంలో హనుమలాగా తమ దేశానికి సాయం అందించాలని ఆయన అడిగారు.. ఆ వెంటనే స్పందించిన కేంద్రం ఔషధలను ఓడ ద్వారా బ్రెజిల్ తరలిస్తోంది..భారత స్పందన పట్ల బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్శశానారో కృతజ్ఞత వ్యక్తం చేశారు.. భాారత్ - బ్రెజిల్ బంధం ఎంతో గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.. ఇహ బ్రెజిల్ అధ్యక్షుడు హనుమ స్మరణ గురించి తెలుసుకందాం. బ్రిక్సు దేశాల సముహంలో ఒకటైన బ్రెజిల్ భారత్కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశం.గత జనవరిలో రిపబ్లిక్ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్శశానారో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..అప్పుడే ఆయన భారతీయులకు అత్యంత ప్రియమైన భారత - రామయణ చరిత్రక ప్రదేశాల గురించి తెలుసుకున్నారు..
ఔషధ పంపిణీ పట్ల కృతజ్ఞతలు తెలంపుతూ..
బ్రెజిల్ బాషాలో అధ్యక్షుడు జైర్ బొల్శశానారో పంపిన లేఖ ఆంశం
- Nossos agradecimentos ao primeiro-ministro da Índia Narendra Modi, que, após nossa conversa por telefone, liberou o envio ao Brasil de um carregamento de insumos para produção de hidroxicloroquina.
- Um gesto honroso que poderá ajudar a salvar a vida de muitos brasileiros, e do qual jamais esqueceremos. 🇧🇷🤝🇮🇳
సునందా..వందనాలమ్మా..
.
కంటి చెమ్మ కూడా కనికరం లేకుండా కరోనా కణికగా మారే కాలం ఇది...
తమ కుటుంబానికి దూరంగా..చిన్నారులను కనీసం దగ్గరకు వచ్ఛి పలుకరించలేని..లాలించలేని..బుజ్జగించలేని
పరిస్థితి లో ఎందరో అయినా మానసికంగా ధైర్యంగా.. ధృడ చిత్తంతో.. బాధితులకు వైధ్య సేవలు చేస్తూ వృత్తినే దైవంగా బావిస్తూ కరోనా కట్టడికి అది శక్తులను తలపోస్తూ.. వివరాల్లోకి వెళితే.
కర్నాటక బెలగావిలో ఓ హాస్పటల్లో కరోనా కార్చిచ్ఛును అదుపు చేయడంలో వైధ్య విధుల్లో వున్న నర్సు సునందా ఐసోలేషన్లో వున్న రోగులకు 7 రోజుల పాటు వైధ్య సేవలు అందజేశారు.. అనంతరం ఆమే స్థానిక హోటల్లో 14 రోజులు క్యారంటైన్ నిమిత్తం వుండాలి..కాగా నర్సు సునంద కుమార్తె తల్లిని చూడాలని పట్టుపట్టడంతో తండ్రి సునంద వున్న హోటల్డుకు తీసుకుని వెళ్లి దూరం నుండి సునందను చూపించగా..చిన్నారి ఆమె దగ్గరకు వెళ్లాలని ఎడుపు అందుకుంది..ఇది చూసిన సునంద బావోద్రేకంలో వుండిపోయింది.. కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన పలువురి హృదాయాలను కలచివేసింది..విషయం తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్పతో పాటు పలువురు అమెకు అభినందనలు తెలిపారు..
This is the current situation Some where in the world .. Staff nurses child daughter visited the hospital Staff nurse sunanda competed 7 days duty in isolation ward ,Belagavi karnataka then she kept for quarantine 14days in a hotel ... Her daughter came to meet her But sunanda has no choice to come near her daughter
..She hounoured to do her duty What we can do ..Thank U all who are fighting for us 💐💐💐
Tuesday, 7 April 2020
హద్దులు లేని కరోనాకు..అప్రమత్తతే మందు... లాకౌట్ నిబంధనలు పాటించాలని మంత్రి ఆజయ్ కుమార్ విజ్ఞప్తి....
ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తం అయింది..రెవిన్యూ.. పోలీసు.. వైధ్య ఆరోగ్య..మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఖమ్మం రూరల్ మండలంలో కరోనా ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోంటున్నాయి..
కరోనా ప్రబలకుండా వుండేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు.. ఆయా శాఖలు సమన్వయం తో వ్యాధి ఇతరులలో వ్యాప్తి చెందకుండా ప్రణాలికతో ముందుకు పోతామని అజయ్ కుమార్ అన్నారు.
కరోనా వ్యాప్తి మొదలైన నెల రోజుల అనంతరం జిల్లాలో తొలికేసు నమోదైందని బాదితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాందీ హాస్పిటల్ కు తరలించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం; కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో # జిల్లా కలెక్టర్ RV కర్ణన్,# # CP : తఫ్సిర్ ఇక్బాల్ # # DMHO మాలతి # లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు...
కేసు నమోదైన ఖమ్మం రూరల్ మండలం లో వ్యాధి వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టామని మంత్రి అయ్ కుమార్ అన్నారు...
ఖమ్మం జిల్లా కలేక్టర్ అర్.వి. కర్ణన్ మాట్లాడుతూ కరోనా బాధితుని గుర్తించిన ప్రాంతంలో కరోనా కమ్యూనిటీ దశకు చేరకుండా అధికారులు పూర్తి స్తాయి చర్యలు తీసుకుంటున్నారని ఆ ప్రాంతాల్లో అవసరమయ్యే నిత్యావసర వస్తువులను నేరుగా ఇండ్లకు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు..
ఖమ్మం రూరల్ మండలం.. పెద్దతండా..జలగం నగర్.. తదితర ప్రాంతాల్లో పోలీసులు గట్టి భధ్రత ఏర్పాటు చేశారని..కరోనా జ CP తప్సిర్ ఇక్భాల్ పేర్కొన్నారు...
Saturday, 4 April 2020
దారి తప్పిన ఒంటే..
లాకౌట్ర్ కూలో..నాలి జనం ఇంటిదారి పడుతండగా తాండూరు ఏరియాలొ ఓ ఒంటే దారి తప్పి బెల్లంపల్లి చేరుకుంది.. దీంతో స్థానికులు దానిని ఫారెస్ట్ అధికారులకు ఒప్పగించారు. కరోనా కాలంలో పోషణకు కష్టమైన యాజమని దీనిని వదిలేశాడ..లేక ఒంటే తప్పించుకుని బెల్లంపల్లి చేరిందో తౄలియాల్సి వుంది..తాండూరు మండలంలోని ఎవరైనా తమ గ్రామాల చూట్టుపక్కల ఒంటే సంబంధించిన వారు
ఉంటే ఎఫ్ ఆర్ వో మాజరుద్దీన్ గారిని కలవాలన అధికారులు పేేర్కోోన్నాారు. ఫోన్ నెంబర్ 79936 23765Friday, 3 April 2020
వైభవంగా భధ్రాధ్రి రాముని పట్టాభిషేకం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ ప్రభావంతో భక్తులు లేకుండానే మహా పట్టాభిషేకం నిర్వహించారు. వైదిక పెద్దలు ఆలయ ప్రాంగణంలోనే ఈ క్రతువు నిర్వహించారు. శ్రీరామనవమి తర్వాత రోజు సీతారాముల వారికి పట్టాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని పురస్కరించుకుని సమస్త నదీజలాలతో అభిషేకం చేశారు. నగలు, రాజదండం, రాజముద్రిక చత్రం, శంఖు చక్రాలు, కిరీటంతో రాముడికి ఆలంకరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు.
Thursday, 2 April 2020
కట్టు తప్పిన కరోనా క్రమశిక్షణ..
కరోనా అంక్షాల పేరుతో భక్తులు గుమ్మిగూడితే వ్యాధి ప్రభలుతుందనే ఆందోళనతో భధ్రాధ్రి రాముని కళ్యాణం ఆలయంలోని బేడా మందిరంలో నిర్వహించారు..అయితే ప్రశాంతంగా రాములోరి కళ్యాణం చూశామన్న ఆనందంలో వున్నారో..శ్రీరామ రక్ష సర్వజగధ్రక్ష అనుకున్నారో గాని కాసింత సేపు కరోనా క్రమశిక్షణ పక్కన బెట్టిన వి.ఐ.పిలు..ఒకే చోట గుమ్మిగూడారు. అక్కడ మాస్కులు ముందు జాగ్రత్తలు లేకపోవడం గమనార్హం..
అష్టలక్మీ ఆలయంలో వేడుకగా సీతారాముల కళ్యాణం .
హైదరాబాద్ ': ఎల్ .బి. నగర్ అష్టలక్ష్మీ దేవాలయంలో భక్తి శ్రద్దలతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కరోనా వ్యాధి నిర్మూలన కు రాష్ట్ర ప్రభుత్వం అంక్షాల నేపధ్యంలో కొద్దిమంది ఆలయ సిబ్బంది కమిటీ మెంబర్లు మాత్రమే హాజరయ్యారు.క దేవాలయ అర్చకులు వేధమంత్రాల నడుమ . శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువుని నిర్వహించారు.. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బంధం దామోదర్ మాజీ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్ మాడ్యం సుధాకర్ గుప్తా సెక్రటరీ అయితే అంజయ్య ట్రెజరర్ గంప జగన్ ఇంకా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భక్తి ప్రపత్తులతో సీతారాముల కళ్యాణం...
ప్రసిద్ద పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారామ దివ్యక్షేత్రంలో ఆలయ నిత్యకళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణం జరిగింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా భద్రాద్రి శ్రీసీతారాములకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించగా, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ చారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ ఎం.వి. రెడ్డి, ఆలయ ఈవో నర్సింహులు తదితరులు ముత్యాల తలంబ్రాలు, కర్పూర మలాలు తదితర కళ్యాణ సంబురాలు సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు....
శ్రీ రామ జనన వేళా విశేషం ఇది- వసంత ఋతువు, చైత్ర మాసం, శుద్ధ నవమి, గురువారం (ఏప్రిల్ 2, గురువారం అయ్యింది), పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం (మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని 'అభిజిత్ ముహూర్తం' అంటారు).
ఇది త్రేతాయుగ కాలం నాటి శ్రీరాముని జనన ముహూర్తం. దశరథ మహారాజు కుమారునిగా, కౌసల్యాదేవి గర్భాన శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఈ విషయం వాల్మీకి మహర్షి శ్రీ రామాయణంలో తెలియజేశారు. అందువల్ల ఈ పుణ్యదినాన్ని మనం అనాదిగా 'శ్రీరామనవమి' పేరుతో పండుగ జరుపుకొంటున్నాం. ఈ చైత్ర శుద్ధ నవమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే- శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం, శ్రీరామ నవమి మరుసటి రోజు, అంటే- దశమి నాడు శ్రీరామచంద్రమూర్తికి సార్వభౌమునిగా 'శ్రీరామ పట్టాభిషేకం' జరిగింది. ఆ అనవాయితి కోనసాగింపుగా భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.
🔸
Wednesday, 1 April 2020
భద్రాద్రిలో సీతారాముల కల్యాణంఆలయ ప్రాంగణంలోనే నవమి వేడుకలు
రాములోరికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్న మంత్రులు అల్లోల, పువ్వాడ
భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యానోత్సవం. గురువారం నిరాడంబరంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భద్రచలంకు చేరుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ ఎం.వి. రెడ్డి, ఆలయ ఈవో నర్సింహులు మంత్రికి పుష్రగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి అల్లోల, ప్రభుత్వ సలహాదారు రమణాచారి అధికారులతో చర్చించారు.
అనంతరం మంత్రి ఇంధ్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అలముకున్న తరుణంలో సామాజిక దూరం అత్యంత అవసరం అయిన పరిస్థితిలో భధ్రాధ్రి సీతారాముల కళ్యాణం ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిర్వహిస్తున్నట్లు చెప్పారు... ప్రజలు కరోనా కట్టడి కి తమ వంతు గా సామాజిక దూరం పాటించి వ్యాధి ప్రభలకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు..
నాలుగో సింహానికి మొక్కిన ఏం.ఎల్.ఏ.
కనిపించని నాలుగో సింహం పోలీసు అంటూ డైలాగ్ గుర్తుందిగా. కరోనా భయందోళనలు నెలకొన్న వేళ ఆ నాలుగో సింహం ఓ ఎమ్మేల్యే తో పాదాభివందనం చేయించుకుంది.. వేసవి ఎండ మంట..విటిని పక్కన బెట్టి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వున్నారు పోలీసులు.కళ్యాణం.వచ్ఛిన.. కక్కోచ్ఛిన తప్పదన్న చందం ప్రస్తుత పోలీసుల పరిస్థితి.. కరోనా అంటువ్యాధి కమ్యూనిటీ దశకు చెరకుండ ప్రభుత్వాలు ప్రకటించిన లాకౌట్ ను కట్టు దిట్టంగా అమలు చేస్తున్నారు ..కుటుంబాలను వదిలి.. రోడ్డు పక్కన దొరికింది తిని బాధ్యతలు నిర్వహిస్తన్నారు .మరో వైపు కొందరు పోలీసులు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన సమయంలో భార్య. పిల్లలకు దూరంగా వుంటూ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు.. ఈ దశలో పోలీసుల కర్తవ్యపాలనపై కొన్ని చోట్ల ప్రశంసలు వెల్లువెత్తుతుంండగా అరకు ఎం.ఎల్.ఏ..ఓ పోలీసు అధికారి కాళ్లకు మొక్కి తన కృతజ్ఞత తెలిపిన తీరు అక్కడి వారిని అబ్బురపరిచింది...పోలీసు కాళ్లు మొక్కిన ఎం.ఎల్.ఏ. పల్గుణ మాట్లాడుతూ పోలీసులు రోడ్డుపై వుండబట్టే పరిస్థితి ప్రశాంతంగా వుంది..లేకుంటే ఏలా వుండేదో..ఏదేమైనా ప్రాణాలు పణంగా బెట్టి వాళ్లు డ్యూటీ చేస్తున్నారు.. మనమం ఎంతో రుణపడి వుంటాం అన్నారు..
Subscribe to:
Comments (Atom)
