ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తం అయింది..రెవిన్యూ.. పోలీసు.. వైధ్య ఆరోగ్య..మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఖమ్మం రూరల్ మండలంలో కరోనా ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోంటున్నాయి..
కరోనా ప్రబలకుండా వుండేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు.. ఆయా శాఖలు సమన్వయం తో వ్యాధి ఇతరులలో వ్యాప్తి చెందకుండా ప్రణాలికతో ముందుకు పోతామని అజయ్ కుమార్ అన్నారు.
కరోనా వ్యాప్తి మొదలైన నెల రోజుల అనంతరం జిల్లాలో తొలికేసు నమోదైందని బాదితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాందీ హాస్పిటల్ కు తరలించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం; కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో # జిల్లా కలెక్టర్ RV కర్ణన్,# # CP : తఫ్సిర్ ఇక్బాల్ # # DMHO మాలతి # లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు...
కేసు నమోదైన ఖమ్మం రూరల్ మండలం లో వ్యాధి వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టామని మంత్రి అయ్ కుమార్ అన్నారు...
ఖమ్మం జిల్లా కలేక్టర్ అర్.వి. కర్ణన్ మాట్లాడుతూ కరోనా బాధితుని గుర్తించిన ప్రాంతంలో కరోనా కమ్యూనిటీ దశకు చేరకుండా అధికారులు పూర్తి స్తాయి చర్యలు తీసుకుంటున్నారని ఆ ప్రాంతాల్లో అవసరమయ్యే నిత్యావసర వస్తువులను నేరుగా ఇండ్లకు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు..
ఖమ్మం రూరల్ మండలం.. పెద్దతండా..జలగం నగర్.. తదితర ప్రాంతాల్లో పోలీసులు గట్టి భధ్రత ఏర్పాటు చేశారని..కరోనా జ CP తప్సిర్ ఇక్భాల్ పేర్కొన్నారు...
No comments:
Post a Comment