Friday, 3 April 2020
వైభవంగా భధ్రాధ్రి రాముని పట్టాభిషేకం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ ప్రభావంతో భక్తులు లేకుండానే మహా పట్టాభిషేకం నిర్వహించారు. వైదిక పెద్దలు ఆలయ ప్రాంగణంలోనే ఈ క్రతువు నిర్వహించారు. శ్రీరామనవమి తర్వాత రోజు సీతారాముల వారికి పట్టాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని పురస్కరించుకుని సమస్త నదీజలాలతో అభిషేకం చేశారు. నగలు, రాజదండం, రాజముద్రిక చత్రం, శంఖు చక్రాలు, కిరీటంతో రాముడికి ఆలంకరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment