Sunday, 26 April 2020

విధి నిర్వహణలో ఇంటి ఇంటికి పాఠం...

అలూరి రమ్యకృష్ణ.. గుంటూరు జిల్లాకు చెందిన ..MCA..,చదివిన యువ కేరటం..3 సంవత్సరాల క్రితం ఢిల్లీ స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటిలో విజేత గా నిలిచింది.. మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలో తండ్రి  ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడు కావడంతో ఉపాధ్యాయ వృత్తి కొంత కాలం నిర్వహించింది. అటుపై ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తు..ఇటివల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై విధ్యా సహాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది... కరోనా లాకౌట్ సమయంలో తాను బాధ్యతలు నిర్వహిస్తున్న బాపట్ల నియోజకవర్గ పరిధిలోని అప్పికట్ల లో ఇంటి ఇంటికి తిరిగి ప్రభుత్వ సహాయాన్ని అందజేయడంతో కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలని ఆ ప్రాంతవాసులకు జాగృత్తలు చెప్పింది.. ప్రస్తుతం అదే గ్రామంలో ఇల్లు. ఇల్లు తిరుగుతూ 10వ తరగతి విధ్యార్థులకు సబ్జెక్టులలో వున్న అనుమానాలు నివృత్తి చేస్తు తన కర్తవ్యం నిర్వర్తించే పనిలో...నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే డబ్బులు బాగా వచ్ఛేవి కదా అని నేను అన్నప్పుడు.. నాకు ఈ ఉద్యోగం సంతృప్తి నిస్తోందని ఇలా ప్రజలకు సేవ అందించే అవకాశం ఎ కొద్ది మందికోనేగా దొరికేది అంటూ బదులిచ్ఛింది..💐💐💐భారత దేశానికి ఇటువంటి యువ కేరటాలు అవసరం ఎంతో వుంది అందమా మరీ...💐💐💐💐@మణికుమార్,

No comments:

Post a Comment