Wednesday, 1 April 2020
నాలుగో సింహానికి మొక్కిన ఏం.ఎల్.ఏ.
కనిపించని నాలుగో సింహం పోలీసు అంటూ డైలాగ్ గుర్తుందిగా. కరోనా భయందోళనలు నెలకొన్న వేళ ఆ నాలుగో సింహం ఓ ఎమ్మేల్యే తో పాదాభివందనం చేయించుకుంది.. వేసవి ఎండ మంట..విటిని పక్కన బెట్టి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వున్నారు పోలీసులు.కళ్యాణం.వచ్ఛిన.. కక్కోచ్ఛిన తప్పదన్న చందం ప్రస్తుత పోలీసుల పరిస్థితి.. కరోనా అంటువ్యాధి కమ్యూనిటీ దశకు చెరకుండ ప్రభుత్వాలు ప్రకటించిన లాకౌట్ ను కట్టు దిట్టంగా అమలు చేస్తున్నారు ..కుటుంబాలను వదిలి.. రోడ్డు పక్కన దొరికింది తిని బాధ్యతలు నిర్వహిస్తన్నారు .మరో వైపు కొందరు పోలీసులు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన సమయంలో భార్య. పిల్లలకు దూరంగా వుంటూ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు.. ఈ దశలో పోలీసుల కర్తవ్యపాలనపై కొన్ని చోట్ల ప్రశంసలు వెల్లువెత్తుతుంండగా అరకు ఎం.ఎల్.ఏ..ఓ పోలీసు అధికారి కాళ్లకు మొక్కి తన కృతజ్ఞత తెలిపిన తీరు అక్కడి వారిని అబ్బురపరిచింది...పోలీసు కాళ్లు మొక్కిన ఎం.ఎల్.ఏ. పల్గుణ మాట్లాడుతూ పోలీసులు రోడ్డుపై వుండబట్టే పరిస్థితి ప్రశాంతంగా వుంది..లేకుంటే ఏలా వుండేదో..ఏదేమైనా ప్రాణాలు పణంగా బెట్టి వాళ్లు డ్యూటీ చేస్తున్నారు.. మనమం ఎంతో రుణపడి వుంటాం అన్నారు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment