పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10 వేల మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేనున్నట్లు పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఈ నెల 19వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా 10వేల నిత్యవసర సరుకుల కిట్స్,10వేల హ్యాండ్ శానిటైజర్లు, 3 రకాల కూరగాయలు. ఇంకా అవసరం మేరకు పంపిణీ చేస్తామని చెప్పారు. పంపిణీకి రెవెన్యూ సహకారం కోరడం జరిగిందని, సామాజిక దూరం పాటిస్తూ రెవెన్యూ శాఖ ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. ఆయా మొత్తం 10వేల కిట్స్ ను జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS గారు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి గారికి అందజేశారు. తనకు శుభాకాంక్షలు తెలపటానికి ఎవరు కలవకుడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఫోన్, వాట్సాప్ ద్వారానే శుభాకాంక్షలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా మీ చుట్టుపక్కల ఉన్న పేదాలను గుర్తించి వారికి సరుకులు, బియ్యం లాంటి వస్తువులు వితరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ గారు, RDO రవీంద్రనాథ్ గారు తదితరులు ఉన్నారు.
కాగా కరోనా లాకౌట్ సమయంలో మంత్రి గారు ..జన్మదినం సందర్భంగా 10వేల సంచులు. ఆయన బొమ్మలతో శానిటైజర్ లు తయారు చేయించడం అంటే మాటలు కాదని..ఎంతో మంది పనిచేసి వుంటారని...అంత మందికి పని కల్పించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
No comments:
Post a Comment