అపన్నులను ఆదుకోవడంలో తెనాలి లో ఓ ట్రస్ట్ ముందు వరుసలో నిలిచింది..ఏదో ఒకటి చేసేశాం అనకుండా..అందరికీ శుచిగా..రుచిగా వండి. వార్చి ఇంటి భోజనం అందజేస్తోంది.. లాకౌట్ లో ఇబ్బందులు పడుతున్న కొన్ని కాలనీలకు ఆటోలో ఆహార పదార్థాలు తీసుకుని వెళ్లి వేడి తగ్గకముందే వడ్డించేస్తోంది..వీరు వితరణ చేస్తున్న వంటల్లో.. మైసూర్ బొండాలు.. పోకోడిలు..పూర్ణాలు వంటివి అది వేడి వేడిగా.. అంటే ఈ టైంలో ఇంతగా చేస్తున్నారా అఃటూ అశ్చర్యపోవిల్సిందే.
1.గోధుమ రవ్వ ఉప్మా 50కిలోలు దోస ఆవకాయ.
దద్ద్యోజనం25 కిలోలు అన్నం150 కిలోలు సొరకాయ గోంగూర పులుసు కూర ..సాంబారు .... వితరణ
2క్వింటాళ్లు ఆకుకూర టొమాటో మామిడికాయ పప్పు 60 కిలోలు.. దోసకాయ వంకాయ టొమాటో పచ్చిమిర్చి కలిపి రోటి పచ్చడి 100కిలోలు .... వితరణ
3.ఆహారపదార్థముల వితరణలో భాగంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పిల్లులు చాలా మంది పొద్దునే మాకు బాగా ఆకలిగా ఉంది ఏమన్నా ఉంటే పెట్టండి అని అడిగారు.. చాలా బాధ అనిపించింది. వాళ్ళకి పొద్దున్నే 8 గంటలకు ఉప్మా పెట్టాం ...
ఇంకొక ప్రాంతంలో వాళ్ళు దద్ద్యోజనం మీరు చేస్తే బాగుంటుంది అయ్యా కావాలి అంటే అక్కడకి 25కిలోల అన్నంలో 25 లీటర్ల పెరుగుతో దద్దోజనం..
4.పులిహోర 100కిలోలు అన్నం2క్వింటాళ్లు 80 కోలోల వంకాయ టొమాటో కూర బంగాళదుంప కూర సొరకాయ టొమాటో ఆకుకూర పెసరపప్పు వేసి పప్పు..25 కిలోలు నేతితిరగమోతతో .
5.150 కిలోల పిండితో మైసూర్ బోండా ,, టొమాటో సొరకాయ పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర అవి వేసి పచ్చడి50 కిలోలు.... వితరణ
కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్ కారణంగా తెనాలిలో స్వీయనిర్భంధంలో ఉన్న ఎంతో మంది నిరాశ్రయులకి అన్నార్తులకు ఆహారపదార్థముల వితరణలో భాగంగా శ్రీరామాయణ నవాహ్నిక జ్ఞాన యజ్ఞ ట్రస్ట్. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర గురు పాదుకా పీఠం ఆధ్వర్యంలో బ్ర||వే||విష్ణుభట్ల ఆంజనేయులుగారి వారి సంకల్పానుసారం గత 27 రోజుల నుంచి నిరిఘ్నంగా అనేక రకముల ఆహారపదార్థముల వితరణ జరుగుతోందని వారి కుమారుడు యజ్జ విష్ణుభట్ల వివరించారు.వండిన వంట వండకుండా వండి రోజుకి సుమారు వెయ్యి మందికి పైగా పేద ప్రజలు ఉండే కాలనీలకు వెళ్ళి స్వయంగా ఆహారాన్ని అందిస్తున్నారు....
రోజు వితరణలో భాగంగా అందరికీ అన్నం కూర పచ్చడి చేసి అనేక ప్రాంతాల్లో వితరణ చేయటం జరిగుతోందని..ఈ అన్నదాన విషయం తెలుసుకొని మాకు అనేక మంది అనేక ప్రాంతముల నుంచి దేశముల నుంచి ఫోన్లద్వారా మేసేజులా ద్వారా అనేక మంది అభినందనములు ఆశీర్వచనములు ఇస్తున్నారు అలాగే చాలా మంది సహకరిస్తున్నారు అందరికీ అనేక ధన్యవాదాలు.. ఇంకా అభివృద్ధిగా ఈ కార్యక్రములు పరమాచార్య స్వామి వారి అనుగ్రహముతో నడవాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment