Thursday, 2 April 2020

భక్తి ప్రపత్తులతో సీతారాముల కళ్యాణం...

  ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం భ‌ద్రాచలం సీతారామ దివ్యక్షేత్రంలో  ఆలయ నిత్యకళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణం జరిగింది.  దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా భద్రాద్రి శ్రీసీతారాములకు ప్రభుత్వం తరపున పట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించగా, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ చారి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, క‌లెక్ట‌ర్ ఎం.వి. రెడ్డి, ఆల‌య ఈవో న‌ర్సింహులు తదితరులు ముత్యాల తలంబ్రాలు, కర్పూర మలాలు తదితర కళ్యాణ సంబురాలు   సమర్పించారు. 
తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు....
శ్రీ రామ జనన వేళా విశేషం ఇది- వసంత ఋతువు, చైత్ర మాసం, శుద్ధ నవమి, గురువారం (ఏప్రిల్ 2, గురువారం అయ్యింది), పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం (మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని 'అభిజిత్ ముహూర్తం' అంటారు). 
ఇది త్రేతాయుగ కాలం నాటి శ్రీరాముని జనన ముహూర్తం. దశరథ మహారాజు కుమారునిగా, కౌసల్యాదేవి గర్భాన శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఈ విషయం వాల్మీకి మహర్షి శ్రీ రామాయణంలో తెలియజేశారు. అందువల్ల ఈ పుణ్యదినాన్ని మనం అనాదిగా 'శ్రీరామనవమి' పేరుతో పండుగ జరుపుకొంటున్నాం. ఈ చైత్ర శుద్ధ నవమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే- శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం, శ్రీరామ నవమి మరుసటి రోజు, అంటే- దశమి నాడు శ్రీరామచంద్రమూర్తికి సార్వభౌమునిగా 'శ్రీరామ పట్టాభిషేకం' జరిగింది. ఆ అనవాయితి కోనసాగింపుగా భద్రాచలంలో  శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.

🔸

No comments:

Post a Comment