Friday, 27 November 2020

శైలజ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తిన ఎం.ఎల్.ఏ.రోజా...



మహిళలకి అవకాశం ఇస్తే ఎంత ఎతైన ఎదుగుతారు అందుకు శైలాజారెడ్డి ఉదహారణ అంటూ నగరి ఎం.ఎల్.ఏ. రోజా పేర్కొన్నారు. రెడ్డీస్ మల్టీ ప్లేక్సు ప్రారంభించిన అనంతరం ఆమే మాట్లాడారు. వివరాల్లోకి వెళితే ఇది డిజిటైలేజేషన్లి వేగంగా విస్తరించిన 20వ శాతాబ్ధాపు అవిష్కరణల్లో  మనకు ఏది కావాలి అన్న వార్త అయినా వినోదం అయినా  క్షణంలో లో మన ముందుకు తీసుకుని వస్తోంది డిజిటల్ప్పు వ్యవస్థ...మనం ఎక్కడున్న  దిన పత్రికలూ టీవి ఛానల్ కన్నా దీటైన్నది  సోషల్ మీడియా. సోషల్ మీడియా లో అతిముఖ్యమైనది యూట్యూబ్. ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు యూట్యూబ్ లో క్షణంలో  ప్రత్యేక్షం. యూట్యూబ్ మన జీవితంలో భాగం అయిపొయింది.
ఇప్పుడు రెడ్డీస్  ముల్టీప్లెక్ వారు ప్రేక్షకులను మరింతా కనువిందు చేయటానికి సరికొత్త ఛానల్ లతో మన ముందుకు వచ్ఛఛారు..   పొలిటికల్ల్ ప్రియులకు పొలిటికల్ ఛానల్, మహిళలకోసం మహిళా ఛానల్, స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఛానల్, సినిమా ప్రేక్షకులకి ఆర్ – ఫ్లెక్స్ (R-Flex OTT ) ఓ టి టి  ని ఇలా ఎన్నో సరికొత్త చానెల్స్ ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో అతిధుల సమక్షంలో ఘనంగా  ప్రారంభించారు.
రెడ్డీస్  ముల్టీప్లెక్ ప్రారంభోత్సవానికి దర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి, నగరి ఎమ్ ఎల్ ఏ రోజా, మాజీ ఏం పి మధు యాష్కీ గౌడ్, నరసింహ రెడ్డి, విద్య వతి, అవినాష్ రెడ్డి, రవి చంద్ర రెడ్డి, స్నేహ, శైలజ చరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, బియగూడ హరీష్, తదితరులు పాల్గున్నారు.
అనంతరం నగరి ఎమ్ ఎల్ ఏ రోజా గారు మాట్లాడుతూ “మహిళలకి అవకాశం ఇస్తే ఎంత ఎతైన ఎదుగుతారు దానికి నిదర్శనమే శైలజ చరణ్ రెడ్డి. యూట్యూబ్ ఛానల్, ఓ టి టి సినిమాలు, టి వి ఛానల్ ఇవి అన్ని చాలా రిస్క్ తో కూడుకున్న వ్యాపారాలు, మా శైలజ రెడ్డి గారికి ధెర్యం ఎక్కువ, వారు ఈ రంగం లో కూడా మంచి విజయం సాదించాలి అని వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులని మరింత ఎంటర్టైన్ చేయాలనీ కోరుకున్నారు.
ఎస్ వి కృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ* “ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ నేటి యూత్ కి మంచి వేదిక అవుతుంది. సినిమాలు, యూట్యూబ్ ఛానల్, రియల్ ఎస్టేట్ అని మంచి పద్ధతితో చేస్తున్నారు. మంచి విజయం సాదించాలి అని కోరుకున్నారు.
*శైలజ చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ* “ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ నాకు కొత్తయిన నేను విజయం సాధిస్తానని నమ్మకం నాకుంది. ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ కులానికి కానీ మతానికి కానీ ఏ రాజకీయానికి సంబంధించింది కాదు కానీ రెడ్డి అంటే అందరికి మంచి చేసేవాడు, అందరిని రక్షించేవాడు అని ఈ పేరు పెట్టడం జరిగింది. నేటి యూత్ కి కావాల్సిన అని హంగులు మా యూట్యూబ్ చానెల్స్ లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ అంటే అందరికి చిన్న చూపు ఉంది కానీ ఇప్పటి శాటిలైట్ చానెల్స్ కన్నా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ గా దూసుకుపోతున్నాయి. ఆర్ – ఫ్లెక్స్ (R-Flex OTT ) ఓ టి టి ద్వారా అని భాషల్లో సినిమాలు చేస్తాము. రియల్ ఎస్టేట్ లో పేద వాళ్ళకి సహాయంగా తక్కువ ధరతో అందరికి ఇళ్ళు ఇవ్వాలని ఆశిస్తున్నాము. త్వరలోనే శాటిలైట్ ఛానల్ ని కూడా ప్రారంభిస్తాం” అని తెలిపారు.
*మాజీ ఏం పి మధు యాష్కీ గౌడ్ గారు మాట్లాడుతూ* “రెడ్డీస్  ముల్టీప్లెక్ ప్రారంభించిన శైలజ గారికి, విజయ్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు. వారు ప్రాంరంభించిన ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ లో విజయం సాదించాలి అని యూత్ కి కొత్త వారికీ టాలెంట్ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు.
*విజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ* “టాలీవుడ్ అనేది ఒక చేపల చెరువు, కానీ ఇప్పుడు ఆన్ లైన్ అనే మహా సముద్రం ఆ చేపల చెరువు ను మిగేసింది. ఇప్పుడు ప్రపంచం అంత యూట్యూబ్ మరియు ఓ టి టి లనే చూస్తుంది. మేము మా చానెల్స్ ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాం. ఎవరి దగ్గరైన మంచి కథ ఉండి డైరెక్షన్ చేయగాలే టాలెంట్ ఉంటె మేము అవకాశం ఇష్టం. రెడ్డీస్  ముల్టీప్లెక్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో కొత్త యూట్యూబ్ చానెల్స్ తో మీముందుకు వస్తున్నాం. అని రంగాల వారికీ అవసరమైన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఛానల్, మహిళలకి బ్యూటీ ఛానల్, రాజకీయ ప్రియులకి పొలిటికల్ ఛానల్ ఎలా అని రంగాల చానెల్స్ ని మేము మా రెడ్డీస్  ముల్టీప్లెక్ లో సమకూరిస్తాం.

తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం


కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రిగింది. తిరుమ‌ల‌లో వ‌ర్షం, ఈదురుగాలుల కార‌ణంగా మాడ వీధుల్లో ఊరేగింపును టిటిడి ర‌ద్దు చేసింది. ఉదయం 4.45 గంటలకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆల‌యంలో ధ్వ‌జ‌స్తంభం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆనంత‌రం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రాశ‌స్త్యం..
పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, బోర్డు స‌భ్యులు శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌నపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల వ‌సంత మండ‌పంలో శ్రీ రాధా దామోద‌ర పూజ


కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శుక్ర‌‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ రాధా దామోద‌ర పూజ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ రాధాకృష్ణుల ఉత్స‌వ‌మూర్తుల‌ను వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ రాధ, కృష్ణుడు(దామోద‌రుడు) స‌క‌ల‌సృష్టికి మూల‌కార‌కుల‌ని చెప్పారు. ప్ర‌కృతి స్త్రీ స్వ‌రూప‌మ‌ని, స‌మ‌స్త జీవ‌రాశులు క్షేమంగా ఉండేందుకు రాధా దామోద‌ర పూజను టిటిడి నిర్వ‌హించింద‌ని వివ‌రించారు. స్వామి, అమ్మ‌వారి అనుగ్ర‌హంతో వ్యాధిబాధ‌లు తొల‌గుతాయ‌న్నారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ రాధాకృష్ణులకు తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి చక్రతీర్థానికి  చేరుకున్నారు. తిరుమ‌ల‌లో కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా చ‌క్ర‌తీర్థం ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ఈ తీర్థానికి అభిషేకం, పుష్ప నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు.  

Thursday, 26 November 2020

మంజీరా నదిలో దూకి ఏఓ ఆత్మహత్య


సంగారెడ్డి: ఆవేశమో..ఆవేదనో ఓ యువ అధికారిణి నిండు ప్రాణం బలి తీసుకుంది. మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి కారులో వచ్చిన అరుణ బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి బలవన్మరనానికి పాల్పడ్డారు. విషయం అందుకున్న అధికారులు గల్లంతు అయిన అరుణ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పని వత్తిడి వల్లా ఇలా చేసిందా లేక ఏవరైన బెదిరింపులా..మరేదైన కారణం వుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది..

Wednesday, 25 November 2020

అక్రమణలకు నాకు సంబంధం లేదు : కూరపాటి రంగరాజు

ఖమ్మం, నవంబర్" 25 : TNGOS భూ ఆక్రమణలతో తనకు సంబంధం లేదని తనపై  తప్పుడు కేసులు బనాయించారని టిఎన్జీవో ల మాజీ నాయకులు కూరపాటి రంగరాజ పేర్కొన్నారు. బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో టి ఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో జరిగిన భూ అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొందరు కావాలనే తనపై పై అక్రమ కేసులు బనాయించారని  కూరపాటి రంగరాజు ఆవేధన వ్యక్తం చేశారు.  తన హయo లో ఎలాంటి భూ ఆక్రమణ జరగలేదని 2018లో టీఎన్జీవోస్ నూతన పాలకవర్గం ఏర్పడిందని తనకు సంబంధం లేని విషాయంలో తనను దోషిగా చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. సుమారు 8 ఎకరాల భూమి ఆక్రమించారని ఖమ్మం రూరల్, ఖమ్మం టు టౌన్ PC లోని నా పై అక్రమ కేసులు పెట్టాటం జరిగిందని నాపై తగిన విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులను కోరారు తన హయంలోనే 1687 మించి సభ్యులు ఉంటే 1570 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించామని అన్నారు నేను 2016లో పదవి విరమణ అప్పుడే డిసెంబర్ లో TNGOS నుంచి కూడా తొలగించారని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు* వీటన్నింటిపై తగిన విచారణ జరిపించి *తనకు న్యాయం చేయాలని విలేకరులను ఉన్నతాధికారులను కూరపాటి రంగరాజు కోరారు*

Monday, 23 November 2020

అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర@ 111 కన్నుమూత! 1924లో అల్లూరికి సేవలందించిన విప్లవ వీరుని అనుచరుడు... అనారోగ్యంతో కన్నుమూత తుది శ్వాస విడిచిన మన్నెం యోధుడు...


విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు.

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు 111 సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం నాడు మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు.అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చి..111యేళ్ల విప్లవ కారునికి తుది విడ్కోలు పలికారు.

Sunday, 22 November 2020

తిరుమలలో కార్తీక శోభ... పార్వేట మండపంలో వనభోజనం.....

                                          
తిరుమల, నవంబరు 22 : తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది. 
ముందుగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపం వ‌ద్ద‌ మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంత‌రం గ‌రుడ వైభ‌వం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ  ప్ర‌తి ఏడాదీ పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఇందులో భాగంగా ఈసారి కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కార్య‌క్ర‌మాన్ని 250 మంది భ‌క్తుల‌తో ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన‌ట్టు చెప్పారు. 
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బోర్డు స‌భ్యులు శ్రీ ముర‌ళీకృష్ణ‌, ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి‌, శ్రీ నాగరాజ, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య పేష్కార్ శ్రీ జగన్ మోహనాచార్యులు, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాస్, ఎవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

భారీగా రేషన్ బియ్యం పట్టివేత...

ఖమ్మం, నవంబర్' 22 : భారీగా రేషన్ బియ్యం పట్టివేత రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 410 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తల్లాడ  పోలీసులు పట్టుకున్నట్లు వైరా ఏసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. 
ప్రభుత్వం నిరుపేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని  రేషన్ దుకాణాల నుండి  తక్కువ ధరలకు సేకరించి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో సిఐ వసంతకుమార్ , పెట్రొలింగ్ విధులు నిర్వహిస్తున్న తల్లాడ ఎస్సై తిరుపతి రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వై.సాంబశివరావు మరియు సిబ్బందితో  తల్లాడ ప్రధాన రహదారి రెడ్డిగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.అనుమానాస్పదంగా వెళ్తున్న  ఏపీ 37 TA 66 88, TSO5 UC 2856 గల రెండు లారీలను ఆపి తనిఖీ చేయగా 410 క్వింటాళ్ల రేషన్  బియ్యం ఎలాంటి పత్రాలు లేకుండా  తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారని ఏసీపీ తెలిపారు.  జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్లు తోట రవికుమార్, బిట్రా పుల్లారావు ను అదుపులోకి తీసుకొని విచారించగా ..సేకరించిన రేషన్ బియ్యాన్ని  ఖమ్మం మీదుగా కాకినాడకు  తరలిస్తునట్లు తెలిపారని ఏసీపీ పెర్కొన్నారు.

Saturday, 21 November 2020

చెన్నై విమానాశ్రయం దగ్గర అమిత్ షా కు చేదు అనుభవం..


  
చెన్నై : కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తమిళనాడు పర్యటనలో అనూహ్య సంఘటన జరిగింది. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో వెళ్తూ, జీఎస్‌టీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న బీజేపీ, ఏఐఏడీఎంకే కార్యకర్తలకు అభివాదం చేసేందుకు కారు దిగి, నడుస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు ఆయనపైకి ఓ ప్లకార్డును విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్లకార్డు ఆయనపై పడకుండా నిరోధించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆగంతకుడు విసిరిన ప్లకార్డుపై గో బ్యాక్ అమిత్ షా అని రాసి ఉంది. ఈ వ్యక్తి చెన్నైకి చెందిన దురైరాజ్ (67) అని పోలీసులు తెలిపారు. 
చెన్నై విమానాశ్రయం బయట ఉన్న జీఎస్‌టీ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు అమిత్ షా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి, తన కారు నుంచి దిగి, రోడ్డుపై నడిచారు. దీంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. 
ఇదిలావుండగా, అమిత్ షా రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటిస్తారు. 2021లో తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చలు జరపడంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు.

వేడుక‌గా వెంక‌న్న పుష్ప‌యాగం.

తిరుమల, 21-11-2020 : పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌ని‌వారం పుష్పయాగ మహోత్సవం శోభాయ‌మానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.@ సత్యన్యూస్

సోనూసూద్ కు భరణిచే ఆత్మీయ సత్కారం.

 

హైదరాబాద్ : నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలసకార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారిని ఆయన ఆదుకుంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ ను ప్రజలు కొనియాడుతున్నారు.

ఈ క్రమంలోనే  ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సోనూసూద్ ను ఆచార్య సినిమా సెట్స్లో సన్మానించారు. వలసకార్మికలకు ఆయన చేసిన సాయాన్ని తనికెళ్ల భరణి కొనియాడారు. తనికెళ్ల భరణి సోనూసూద్ తో పాటు దర్శకుడు కొరటాల శివను సైతం సన్మానించారు.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ సెట్స్ లో సినిమా యూనిట్ సోనూసూద్ ను ఘనంగా సన్మానించింది.*

Tuesday, 17 November 2020

చంద్రప్రభా వాహనం పై ధనలక్ష్మి అలంకారంలో పద్మావతి అమ్మవారు

తిరుపతి/తిరుఛానూర్, 17-11-2020 :
చంద్రప్రభ వాహనంపై ధనలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి  అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు,  జెఈవో శ్రీ‌ పి.బ‌పంత్‌కుమార్ దంప‌తులు, సివిఎస్వో శ్రీ  గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి , సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి , విఎస్వో శ్రీ బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు, అలంకార భట్టార్ శ్రీ ఎం.జి.రామచంద్రన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
న‌వంబ‌రు 19న పంచమీ తీర్థం :
నవంబరు 19వ తేదీ గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) సందర్భంగా ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 10 నుండి మధాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

సూర్యప్రభ వాహనంపై శోభిల్లిన శ్రీవారి దేవేరి


శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలోని సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌పంత్‌కుమార్‌ దంపతులు, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, విఎస్వో శ్రీ బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Monday, 16 November 2020

గ‌రుడ‌ వాహ‌నంపై శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుప‌తి‌, 2020 న‌వంబ‌రు 16 :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ  రోజైన సోమ‌వారం రాత్రి విశేషమైన గ‌రుడ‌ వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు  దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. గరుత్మంతుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  జెఈవో శ్రీ పి.బ‌పంత్‌కుమార్‌ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.  

శబరిమలైలో సమాచారకేంధ్రంప్రారంభించిన ప్రముఖులు. (పుణ్యం పూంకవనం 2020-2021 ప్రారంభోత్సవం)

 
 16 నవంబర్ 2020 : శబరిమల సున్నిధనం వద్ద తాంత్రి బ్రహ్మాస్రీ కందారు రాజీవరు పట్టణంధిట్ట ఎస్పీ తో కలసి శబరి మలై సన్నిధిలో  పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను శ్రీ ప్రారంభించారు. కార్యక్రమంలోఎన్ వాసు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు. ఎస్.పి. . పి విజయన్ ఐపిఎస్, ఐజిపి-కేరళ పోలీసు ప్రధాన కార్యాలయం. .   లోక్‌నాథ్ బెహెరా ఐపిఎస్, డిజిపి & స్టేట్ పోలీస్ చీఫ్ , జస్టిస్ గోపీనాథ్.  కేరళ హైకోర్టు.న్యాయమూర్తి, 
 శ్రీజిత్ ఐపిఎస్, ఐజిపి-క్రైమ్ బ్రాంచ్, శబరిమల  యొక్క మెల్సంతి. జయరాజ్ నంపూతిరి, శ్రీ. ఓం మనోజ్, శ్రీమతి. సంత షీలా నాయర్ ఐఎఎస్ (రిటైర్డ్), సన్నిధనం పోలీస్ స్పెషల్ ఆఫీసర్ . బి. కృష్ణ కుమార్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రముఖులు & పాల్గొనగా మరికొందరు వర్ఛువల్ పద్దతిలో ఆన్‌లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్.పి పర్యవేక్షణలో శబరిమల, పంబా పరివాహక ప్రాంతాలను శుభ్రం చేసి వ్యర్థాలను ఏరివేశారు.

భక్తి శ్రద్దలతో శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు..

తిరుపతి, 16-11-2020 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమ‌వారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు ఆల‌యంలో జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీ. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంతప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నార‌ని పురాణాల ఐతిహ్యం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

సకటాసుర వధ అలంకారంలో కత్తి - డాలు చేబూని దర్శనం ఇచ్ఛిన పద్మావతి అమ్మ..

తిరుపతి, 16-11-2020 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై సకటాసుర వధ అలంకారంలో కనువిందు చేశారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ.  సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sunday, 15 November 2020

తిరుఛానూర్ బ్రహ్మోత్సవాలలో వసంతోత్సవ వేడుక..


 శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆదివారం సాయంత్రం వసంతోత్సవం ఏకాంతంగా జరిగింది. కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. వసంతోత్సవంలో పాల్గొన్న తరువాత అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి దంపతులు, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, అర్చకులు శ్రీ బాబుస్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుచానూరుకు చేరిన‌ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం.


తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆది, సోమ‌వారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని ఆదివారం ఉద‌యం తిరుచానూరుకు తీసుకొచ్చారు
ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని వైభ‌వోత్స‌వ మండ‌పానికి తీసుకొచ్చారు. తిరుమ‌ల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం అక్క‌డి నుండి వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు. తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌కు అంద‌జేశారు. అక్క‌డ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఆల‌యంలోకి తీసుకెళ్లారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లారు.
 ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ చిరంజీవి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Saturday, 14 November 2020

కోదండరామునిగా శ్రీవారి దెవేరి...


శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో అమ్మవారు  దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం..

తిరుపతి, నవంబర్ 14: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత నిర్వహించారు. 
శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. 
నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తిఅయినది.అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. 
ఈ ఆస్థానంలో  శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయంగార్‌, టీటీడీ ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బా రెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీమతి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 
ప్రపంచాన్ని భాధిస్తున్న కరోనా వ్యాధిని సంహరించాలని శ్రీవారిన‌ ప్రార్థించాను – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
దేశ సరిహద్దుల్లో భారత సైనికుల ప్రాణాలు తీస్తున్న శత్రువులను, ప్రపంచాన్ని భాధిస్తున్న కరోనా వ్యాధిని సంహరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ప్రార్థించానని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల చైర్మన్ తనని కలిసిన మీడియాతో మాట్లాడారు. 
దేశ రక్షణకు సరిహద్దుల్లో మన సైనికులు చేస్తున్న వీరోచిత పోరాటం అభినందనీయమన్నారు.  కరోనా నుంచి ప్రపంచాన్ని స్వామి వారు తప్పకుండా కాపాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి యేటా లాగే ఈ సారి కూడా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్ర బద్దంగా నిర్వహించామని చైర్మన్ తెలిపారు.  
తెలుగు ప్రజలకు  శ్రీ వైవి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు.తెలిపారు. ఈ దీపావళి తెలుగు ప్రజలందరి ఇళ్లలో ఆనంద దీపాలు వెలిగించాలని  ఆకాంక్షించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం లభించాలని ఆయన కోరారు.  నరకాసురుని సత్యభామ వధించినట్లు గానే కరోనాను అంతం చేయగలిగేంత శక్తి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, అమ్మవారు ప్రజలందరికీ ప్రసాదించాలని శ్రీ సుబ్బారెడ్డి కోరారు.

(DEEPAVALI ASTHANAM AT SRIVARI TEMPLE ON NOVEMBER 14.)
Deepavali Asthanam has been observed with religious fervour in Sri Venkateswara Swamy temple at Tirumala on Saturday.

This annual event was held at the Ghanta Mandapam located in front of Bangaru Vakili between 7am and 9am. Sri Malayappa along with His consorts Sridevi and Bhudevi accompanied by Senadhipati Sri Viswaksena facing Garudalwar. After Asthanam, special Naivedyam and Harati rendered to deities.

TTD has cancelled the Kalyanotsavam, Unjal seva and Arjita Brahmotsavam in view of Deepavali Asthanam celebrations in the temple on Saturday. 

Speaking on this occasion, Chairman Sri YV Subba Reddy said he prayed Lord to weed off the enemies who are creating tensions at the border and demolish Covid virus and bestow blessings on people of the country as well across the globe.

EO Dr KS Jawahar Reddy, MP Sri V Prabhakar Reddy, Ex officio member Dr C Bhaskar Reddy, Members Smt Prasanthi Reddy,  Dr M Nischita, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath were also present..

Wednesday, 11 November 2020

తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకున్న రఘునందన్ రావు

తిరుమల: దుబ్బాక ఉపఎన్నికలో విజేతగా నిలిచిన బీజేపీ నేత ఎం. రఘునందన్ రావు శ్రీవారి మొక్కు తీర్చుకున్నారు. వేంకటేశునికి తలనీలాలు సమర్పించిన ఆయన.. స్వామి వారిని దర్శించుకున్నారు. నాటి నరేంద్రుని స్ఫూర్తిని, నేటి నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారని అన్నారు. దుబ్బాక విజయం తెలుగు రాష్ర్టాలతో పాటు దక్షిణభారతం అంతా ఉంటుందన్నారు. ఇది దుబ్బాక ప్రజలు విజయమని, వారి కోసం ప్రాణం పోయేవరకు కష్టపడతానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టి ఎలా ఆదేశిస్తే అలా సేవలు అందిస్తానన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో విజయానంతరం ఆయన నేరుగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించి అనంతరం సుపథం ఎంట్రీ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ.. విద్య నేర్పిన గురువుతో పోటీపడితే బాగుంటుందని, తాను గురువుగా భావించే కేసీఆర్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నాని అన్నారు. దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. తన విజయం పార్టీ సమిష్టి కృషికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామిగా దుబ్బాక నియోజక వర్గాన్ని నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు.

GODDESS CHEERS AS NAVANEETA KRISHNA..... వెన్నముద్దల కృష్ణమ్మగా పద్మావతమ్మ @ తిరుఛానూర్ కార్తీక బ్రహ్మోత్సవాలు

ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess Padmavathi decked as Navaneeta Krishna blessed devotees on Chinna Sesha Vahanam on Wednesday evening.
HH Sri Pedda Jiyar and HH Sri Chinna Jiyar Swamijis of Tirumala, TTD EO Dr KS Jawahar Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, DyEO Smt Jhansi Rani and others were also present.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన బుధ‌వారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు నవనీతకృష్ణుని అలంకారంలో చిన్న‌శేష‌వాహ‌నంపై  అభ‌య‌మిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుంది.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, బోర్డు సభ్యులు శ్రీ మురళీకృష్ణ, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లీశ్వ‌రి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Bahrain Prime Minister Prince Khalifa bin Salman Dies in US

 The Kingdom of Bahrain is in mourning today following news that  His Royal Highness Prime Minister Prince Khalifa bin Salman Al Khalifa has died in hospital.
He passed away this morning at the Mayo Clinic in the USA.
The burial ceremony will take place after the repatriation of the body, and the funeral will be limited to a specific number of relatives.
His Majesty King Hamad bin Isa Al Khalifa ordered the announcement of an official mourning for a week during which flags will be flown at half-mast.
Government ministries and departments will be closed for three days starting tomorrow.
“May Allah rest the soul of the deceased in eternal peace. From Allah we come and to Allah we return,” the Royal Court said...indian Prime Minister Narendra Modi Expressed his deep condolences to his  demise 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం..

తిరుపతి, 2020 న‌వంబ‌రు  11:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధ‌వారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా ఉదయం  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ త‌రువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం ఆస్థానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. 
 ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ ధనంజయులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ అర్చక బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tuesday, 10 November 2020

అంతా చపాతి రోలర్ వల్లే అంటున్న అధికార పక్షం ...

టీఆర్ఎస్ ఓటమికి కారణం  ఇండిపెండెంట్ ?

ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.  మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది.  అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి కూడా వచ్చింది.  కానీ, 20 వ రౌండ్ నుంచి ఫలితం మారిపోయింది.  20, 21, 22, 23 మిగతా రౌండ్ లలో బీజేపీ లీడింగ్ సాధించడంతో  విజయం సాధించింది.  ముందుగా సర్వేలు చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది.  దుబ్బాకలో బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెమటలు పట్టించి మరీ..బీజేపీ విజయం సాధించింది. తమ ఓటమికి చపాతి రోలర్‌ కారణమని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కారును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ ని కేటాయించారు. ఈ గుర్తే టీఆర్‌ఎస్‌ కొంప ముచ్చిందని సొంత పార్టీ నాయకులు అనుకుంటున్నారు.  అయితే..చపాతీ రోలర్‌ అచ్చం కారు లాగే ఉండటం విశేషం.  ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తు చపాతీ రోలర్ కు 3489 ఓట్లు వచ్చాయి. అలాగే..నోటాకు నోటా కు 552 ఓట్లు పోల్‌ అయ్యాయి. చపాతీ రోలర్‌ ఓట్లు టీఆర్‌ఎస్‌ కు వచ్చేయని...దుబ్బాక ప్రజలు కారు గుర్తు అనుకుని చపాతీ రోలర్‌ కు వేసారని టీఆర్‌ఎస్‌ నాయకులు వాపోతున్నారు.ఏది ఏమైనా చివరికి దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేసింది.

గోవిందరాజస్వామి ఆలయంలో కోవిల్ ఆల్వార్ తిరుమంజనం...


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో న‌వంబ‌రు 14వ తేదీన‌ దీపావ‌ళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.  అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్ర‌త్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎ.పి.శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఆర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
న‌వంబరు 14న దీపావళి ఆస్థానం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబరు 14వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు ఆస్థానం  జరుగనుంది.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

రేపు శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ..


తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 10వ తేదీ రేపు మంగ‌ళ‌వారం  అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం , ర‌క్షాబంధ‌నం , సేనాధిప‌తి ఉత్స‌వం , యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.
*న‌వంబ‌రు 11న ధ్వ‌జారోహ‌ణం :*
ఆలయంలో న‌వంబ‌రు 11న బుధ‌వారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం , అలంకారం , ఉదయం 9.30 నుండి 9.47 గంటల నడుమ ధ‌నుర్ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

*వాహనసేవల వివరాలు :*
11-11-2020(బుధ‌వారం)      ధ్వజారోహణం – చిన్నశేషవాహనం

12-11-2020(గురువారం)     పెద్దశేషవాహనం – హంసవాహనం

13-11-2020(శుక్ర‌వారం)   ముత్యపుపందిరి వాహనం –  సింహవాహనం

14-11-2020(శ‌నివారం)        కల్పవృక్ష వాహనం – హనుమంతవాహనం

15-11-2020(ఆదివారం)          పల్లకీ ఉత్సవం – వ‌సంతోత్స‌వం , గజవాహనం

16-11-2020(సోమ‌వారం)     సర్వభూపాలవాహనం – స్వర్ణరథం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), గరుడవాహనం

17-11-2020(మంగ‌ళ‌వారం)     సూర్యప్రభ వాహనం  – చంద్రప్రభ వాహనం

18-11-2020(బుధ‌వారం)        రథోత్సవం(స‌ర్వ‌భూపాల వాహ‌నం) – అశ్వ వాహనం

19-11-2020(గురువారం)      పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)  – ధ్వజావరోహణం.

Monday, 9 November 2020

భారతీయ ఉద్యోగులకు బైడెన్ శుభవార్త

అలా గెలిచారో లేదో ఇలా ఓ శుభవార్త చెప్పారు బైడెన్. హెచ్ 1బి వీసాల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రీన్ కార్డుల కోటాను కూడా త్వరలోనే పెంచుతామని చల్లని వార్త చెప్పారు బైడెన్. అంతేకాదు, హెచ్1బి వీసాలపై వచ్చే ఉద్యోగులు తమ వెంట తమ భార్య లేదా భర్తను తీసుకొచ్చుకునేందుకు కూడా అంగీకారం తెలపనున్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన, వెళ్తున్న ఎంతో మందికి ఈ నిర్ణయం కొత్త ఊపిరినిచ్చింది. త్వరలోనే ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తామని బైడెన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అమెరికాకు వచ్చే హై స్కిల్డ్ ఉద్యోగుల పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారు కొత్త అమెరికా అధ్యక్షుడు.
సుమారు 11 మిలియన్ల వలసదారులకు అంటే కోటి పది లక్షల మందికి అమెరికా సిటిజెన్‌షిప్ ఇస్తామని చెప్పారు బైడెన్. సరైన డాక్యుమెంట్లు లేకపోయినా సరే వాళ్లందరికీ అమెరికా పౌరసత్వం ఇచ్చేలా ఓ రోడ్‌మ్యాప్ రెడీ చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో కనీసం 5లక్షల మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం అతి త్వరలోనే అమెరికా చట్టసభల్లో ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ బిల్లును తీసుకొస్తామన్నారు. వీసా నిబంధనలతో ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేయడం తమ అభిమతం కాదని, ఫ్మామిలీ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానంతో కొత్త సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం దేశాలపై విధించిన వీసా బ్యాన్‌ను కూడా ఎత్తేయబోతున్నారు. పైగా ఏడాదికి 95వేల మంది శరణార్ధులకు అమెరికాలో ఆశ్రయం ఇచ్చేలా ఓ విధానాన్ని కూడా రూపొందించబోతోంది బైడెన్ సర్కార్.

నీవు చేసిన త్యాగం మ‌రువ‌లేనిది : శైలజా చరణ్ రెడ్డి


ప్రవీణ్ కుమార్ రెడ్డి ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామంలో పుట్టి పెరిగాడు. దేశ భక్తి మెండుగా ఉండడంతో మాతృభూమి సేవలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం సైన్యంలో చేరాడు. విధుల్లో చురుగ్గా ఉంటూ ఉన్నతాధికారుల మన్నలు పొందాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్‌ నాలా పోస్టు వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని,  కుటుంబ సభ్యులకు మరియు  శ్రేయోభిలాషులు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ దేవుడు వారికి మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ త్యాగం మరువలేనిదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి కొనియాడారు.  ఐరాల మండలం ను చిరస్థాయి లో దేశంలో నిలిచిపోయే విధంగా నీ త్యాగం... జోహార్లు ఆమె అన్నారు.