హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాలపై టిటిడి ఛైర్మన్ శనివారం సమీక్ష నిర్వహించింది
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి. .సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మప్రచార కార్యక్రమాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు సభ్యులు పలు సూచనలు చేశారు.
కార్తీక దీపోత్సవం రోజున తిరుమలలో తొలిసారిగా శ్రీ మలయప్పస్వామివారికి కార్తీక దీప నీరాజనం పేరుతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో దీపాలు వెలిగిస్తారు
జిల్లా ధర్మప్రచార మండలి పేరుతో ఆసక్తి గల భక్తులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ధర్మప్రచార కార్యక్రమాల నిర్వహణ.
గతంలో ఎంతోమంది పేద యువతీ యువకులకు సామూహికంగా కల్యాణాలు చేయించిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు నూతన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం.
– హెచ్‌డిపిపి కార్యక్రమాలను ఎస్వీబీసీ సహకారంతో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు చెపట్టనున్నారు. టిటిడి కల్యాణమండపాల్లో మందిరం, భజన మందిరం నిర్మించి క్రమం తప్పకుండా ప్రతిరోజూ సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.
ఈ సమావేశంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, జెఈవో .బసంత్‌కుమార్, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, హెచ్‌డిపిపి కార్యనిర్వాహక కమిటీ సభ్యులు. పెంచలయ్య, టిటిడి ప్రాజెక్టుల లైజన్ అధికారి వెంకటశర్మ పాల్గొన్నారు.
No comments:
Post a Comment